Thursday, October 29, 2026
HomeLATESTSai Pallavi:సాయి పల్లవి కాబోయే భర్తలో ఉండాల్సిన లక్షణాలు ఇవే..!

Sai Pallavi:సాయి పల్లవి కాబోయే భర్తలో ఉండాల్సిన లక్షణాలు ఇవే..!

Sai Pallavi:తనకు కాబోయే భర్త స్వార్థపూరిత మనస్తత్వం కలిగిన వ్యక్తి కాకూడదని సాయి పల్లవి చెప్పుకొచ్చింది.

on
- Advertisement -banner Ad

Sai Pallavi:సాయి పల్లవి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఆమె అందరికీ సుపరిచితురాలే. కొంతమంది హీరోయిన్లు ఇండస్ట్రీలోకి క్రేజ్ కోసం వస్తారు. మరికొంతమంది డబ్బు సంపాదించుకోవడానికి వస్తారు. కానీ సాయి పల్లవి మాత్రం మరో రకం. తనకున్న టాలెంట్‌ను నిరూపించుకోవడానికి, జనాలకు మంచి చేయడానికి ఇండస్ట్రీలోకి వచ్చారు. అందుకే జనాలకు ఉపయోగపడే సినిమాలే చేస్తూ ఉంటారు. ఎన్నో పీక్ ఆఫర్లు వచ్చినా సరే, రొమాంటిక్ సీన్లు ఉంటే అసలు నటించనంటూ తెగేసి చెప్పిన హీరోయిన్. ప్రముఖ స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చినా, తనకు నచ్చకపోతే వాటిని సున్నితంగా తిరస్కరించే హీరోయిన్ సాయి పల్లవి. తన నిర్ణయాలకు, వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇచ్చే ఆమెపై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన అభిమానం, గౌరవం ఉన్నాయి.

రామాయణ సినిమా ప్రమోషన్స్‌లో సాయి పల్లవి :

ప్రస్తుతం సాయి పల్లవి రామాయణ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సాయి పల్లవి ప్రముఖ హిందీ క్విజ్ షో *కౌన్ బనేగా కరోడ్‌పతి*లో పాల్గొంది. అమితాబ్ బచ్చన్‌తో సరదాగా ముచ్చటించింది. ఇక ఈ షోకు ‘రామాయణం’ సినిమాలో శ్రీరాముడిగా నటిస్తున్న రణబీర్ కపూర్ కూడా హాజరయ్యారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సాయి పల్లవి, రణబీర్ కపూర్ ఇద్దరూ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -
Advertisement

ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ సాయి పల్లవి(Sai Pallavi) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తన జీవిత భాగస్వామిలో ఉండాల్సిన లక్షణాల గురించి వివరించింది. దీనికి సంబంధించిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.

also read:Simran Choudhary: యువరాణి గెటప్ లో ఆకట్టుకుంటున్న సిమ్రాన్ చౌదరి.. ఫోటోలు వైరల్!

- Advertisement -
Advertisement

కాబోయే భర్తలో ఆ లక్షణం ఉండాల్సిందే:

అందరికీ తెలిసిందే.. మొదటి నుంచి కూడా సాయి పల్లవి స్వార్థం లేని మనిషి. అందుకే తన జీవిత భాగస్వామిలోనూ ఈ గుణం తప్పనిసరిగా ఉండాలని సాయి పల్లవి కోరుకుంటోంది. తనకు కాబోయే భర్త స్వార్థపూరిత మనస్తత్వం కలిగిన వ్యక్తి కాకూడదని సాయి పల్లవి చెప్పుకొచ్చింది.

కేవలం తన అవసరాలు, తన సంతోషం గురించి మాత్రమే ఆలోచించే వ్యక్తి తనకు వద్దంటూ తెగేసి చెప్పింది. తనను అర్థం చేసుకుని, తన మనోభావాలను గౌరవించడంతో పాటు ఇతరుల పట్ల కూడా ప్రేమగా ఉండేవాళ్లే తనకు నచ్చుతారని తెలిపింది. తన ఆలోచనలకు, అభిప్రాయాలకు విలువనిచ్చే వ్యక్తినే జీవిత భాగస్వామిగా కోరుకుంటున్నానని సాయి పల్లవి వెల్లడించింది. అలాంటి వ్యక్తి కోసమే తాను ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.

- Advertisement -
Advertisement

జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు మంచితనానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ముందుగా అతను మంచి వ్యక్తిత్వం కలిగిన మనిషిగా ఉండాలని సాయి పల్లవి అభిప్రాయపడింది.

also read:Fauzi Teaser:ఫౌజీ టీజర్ పై కేంద్ర మంత్రికి లేఖ రాసిన నేతాజీ మనవడు..!

తప్పులను అంగీకరించే మనస్తత్వం ఉండాలి:

దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఆమె మాట్లాడిన మాటలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. తనలోని తప్పులను గుర్తించి, వాటిని నిజాయితీగా ఒప్పుకునే మనస్తత్వం ప్రతి వ్యక్తిలోనూ ఉండాలని సాయి పల్లవి అభిప్రాయపడింది. తాను చేసిన పొరపాట్లను గుర్తించి, వాటిని సరిదిద్దుకునే మనస్తత్వం ఉండాలని అభిప్రాయపడింది.

తమ జీవిత భాగస్వామి ఎలా ఉండాలనే విషయంలో ఒక్కో హీరోయిన్‌కు ఒక్కో అభిప్రాయం ఉంటుంది. అయితే సాయి పల్లవి మాత్రం తనకు కాబోయే భర్తలో ఉండాల్సిన లక్షణాల గురించి కేవలం మూడు కీలక అంశాలను ప్రస్తావించింది. ఆమె చెప్పిన ఈ విషయాలు ఇప్పుడు నెట్టింట ఆసక్తికర చర్చకు దారితీశాయి. దీంతో సాయి పల్లవి వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you