Thursday, October 29, 2026
HomeLATESTAnasuya:సోషల్ మీడియాలో నెటిజన్ వింత ప్రశ్న.. అనసూయ స్ట్రాంగ్ కౌంటర్!

Anasuya:సోషల్ మీడియాలో నెటిజన్ వింత ప్రశ్న.. అనసూయ స్ట్రాంగ్ కౌంటర్!

Anasuya:సోషల్ మీడియా నా అకౌంట్, నా ఇష్టం. ఎంతసేపైనా ఉంటాను” అంటూ సమాధానమిచ్చింది. ఎదుటివారికి నేరుగా కౌంటర్

on
- Advertisement -banner Ad

Anasuya:అనసూయ.. ఈ పేరు చెబితే పాజిటివ్ కామెంట్స్ ఎంత ఎక్కువగా వినిపిస్తాయో, అంతకంటే ఎక్కువగా నెగటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి. అనసూయ ఏం చేసినా సరే, కొంతమంది జనాలు పెద్ద రాద్ధాంతం చేస్తూ ఉంటారు. ఆమె డ్రెస్సింగ్ సెన్స్, సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వీడియోలపై ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. అయినా సరే, అనసూయ వాటన్నింటినీ పెద్దగా పట్టించుకోకుండా.. తన లైఫ్ తనది అంటూ ముందుకు సాగుతుంది. స్టార్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోని లైఫ్ స్టైల్ తో సోషల్ మీడియాని మడత పెట్టేసే అనసూయ బాడీని మెయిన్ టైన్ చేయడంలో ఎంత హుందాగా ఉంటుందో అందరికి తెలిసిందే.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనసూయ:

వర్క్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉండే అనసూయ ఈ మధ్యకాలంలో ఎంత బరువు తగ్గిందో అందరికీ తెలిసిందే. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ అనసూయను తన నెక్స్ట్ సినిమా వివరాల గురించి అడుగుతూనే, కౌంటర్ వేస్తూ ప్రశ్నించాడు. ఇది కొందరు బాగానే అనిపించినా..అనసూయ ని ఇష్టపడే వాళ్లకి మాత్రం కౌంటర్ లా అనిపించింది. అందుకే అనసూయ రియాక్షన్ కి వాళ్లు ఫిదా అయిపోతున్నారు.

- Advertisement -
Advertisement

also read:Niharika Konidela:‘పాకెట్ రాకెట్స్’ టైటిల్‌తో నిహారిక కొత్త సినిమా.. క్యాస్టింగ్ చూస్తే మైండ్ బ్లాక్!

నెటిజన్ ప్రశ్నకు అనసూయ అదిరిపోయే సమాధానం :

“ఎప్పుడూ సోషల్ మీడియాలో కనిపిస్తావా? లేక సినిమాలు చేసేది ఏమైనా ఉందా?” అంటూ ఓ నెటిజన్ అనసూయను(Anasuya) ఘాటుగా ప్రశ్నించాడు. దీనికి అనసూయ చాలా నెమ్మదిగానే అదిరిపోయే సమాధానం ఇచ్చింది. “ప్రస్తుతం రెండు సినిమాల గురించి మాట్లాడుతున్నాను. అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయో తెలియదు. ఇక సోషల్ మీడియా నా అకౌంట్, నా ఇష్టం. ఎంతసేపైనా ఉంటాను” అంటూ సమాధానమిచ్చింది. ఎదుటివారికి నేరుగా కౌంటర్ ఇవ్వకుండానే తన మాటలతో సమాధానం చెప్పిందని అభిమానులు అంటున్నారు. ఇంకొంతమంది దట్ ఈజ్ అనసూయ..తాట తీసేస్తుంది జాగ్రత్త అని ఘాటుగా బల్దులిస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:Janhvi Kapoor:పెద్ది వివాదంపై జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబుకు షాక్!

అనసూయ వ్యాఖ్యలు వైరల్ :

ప్రస్తుతం అనసూయ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. అనసూయ ఎంత పవర్‌ఫుల్ లేడీ అనేది అందరికీ తెలిసిందే. సాధారణంగా ఆమె ఎవరి జోలికీ వెళ్లదని, అయితే తనను ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం తనదైన శైలిలో సమాధానం చెబుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.అదే అనసూయ ప్రత్యేకత అని ఆమె అభిమానులు చెబుతున్నారు. అందుకే అనసూయను ఎంతమంది ఇష్టపడతారో, అంతే స్థాయిలో విమర్శించే వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం అనసూయ తదుపరి ఏ సినిమాలో నటించబోతోందనే విషయంపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనసూయ ఏ సినిమాలో నటించినా తన పాత్రని మాత్రం చాలా ఢిఫరెంట్ గా చూస్ చేసుకుంటుంది అంటున్నారు ఆమె అభిమానులు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you