Chiranjeevi:సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక న్యూస్ బాగా హీట్ పెంచేస్తోంది. అదే మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన మూవీ గాసిప్. మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుంది అంటే సోషల్ మీడియాలో, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హంగామా నడుస్తుంది అనే దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ అయిన ఆయన రేంజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, ఆయనను ఆరాధించే అభిమానులు ఎంతమంది ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటించిన సినిమా రిలీజ్ అవుతుంది అంటే కచ్చితంగా థియేటర్‌కు వెళ్లి చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు.
విశ్వంభర సినిమాపై ట్రోలింగ్ :
అయితే, మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటించిన సినిమా విషయంలో మాత్రం గజిబిజిగా, అందరూ గందరగోళానికి గురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. సినిమా ఎప్పుడు అనౌన్స్‌మెంట్ ఇచ్చారు? ఆ తర్వాత ఎప్పుడో సినిమాకి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు. సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది అన్నారు. ఇదిగో రిలీజ్ అన్నారు. సడన్‌గా వీఎఫ్‌ఎక్స్ బాగా క్వాలిటీగా ఇవ్వాలి, అందుకే సినిమాను పోస్ట్‌పోన్ చేస్తున్నామంటూ రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు దాటేస్తున్నారు.
దీంతో సోషల్ మీడియాలో విశ్వంభర సినిమాపై ఘాటుగా ట్రోలింగ్ కూడా జరిగింది. ఎప్పుడూ ట్రోలింగ్‌కు గురికాని మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమా కారణంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యారు. కానీ డైరెక్టర్ వశిష్ట మాత్రం ఎక్కడా తగ్గకుండా, సినిమా రిలీజ్ అయిన తర్వాత కచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకా వేరే రేంజ్‌కు వెళ్లిపోతారు అన్న ధీమా వ్యక్తం చేస్తూనే ముందుకు వెళ్లారు.
also read:Anasuya:సోషల్ మీడియాలో నెటిజన్ వింత ప్రశ్న.. అనసూయ స్ట్రాంగ్ కౌంటర్!
డిసెంబర్ 4న విశ్వంభర రిలీజ్ అంటూ ప్రచారం:
లేటెస్ట్‌గా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటూ ఓ న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. అయితే, దీనిపై ఇప్పటివరకు చిత్రబృందం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. డిసెంబర్ 4 అంటే నెల రోజులు మాత్రమే ఉంది.
ప్రమోషన్స్ ఎలా చేస్తారు? :
అయితే, ఈ నెల రోజుల్లో సినిమా ప్రమోషన్స్ ఎలా చేస్తారు? మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఏ రేంజ్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తాము! టీజర్, ట్రైలర్, సినిమా ప్రమోషన్స్ ఇంకా ఏవేవో ఉంటాయి. అవేవీ లేకుండా ఎలా? ఇంకొకపక్క ఏమో, అసలు సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు అంటున్నారు. దీంతో విశ్వంభర సినిమా రిలీజ్‌పై గందరగోళ పరిస్థితి నెలకొంది.
అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు:
కొంతమంది ఫ్యాన్స్ ఈ సినిమా డిసెంబర్ 4న రిలీజ్ అవ్వాలని కోరుతుంటే, ఇంత లేట్ చేసి రిలీజ్ చేస్తే కచ్చితంగా సినిమా నెగెటివ్ టాక్‌ను దక్కించుకుంటుంది అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌పై ఫుల్ హడావిడి నడుస్తోంది.
చిత్రబృందం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్పందిస్తే, వీటన్నిటికీ ఒక ఫుల్‌స్టాప్ పెట్టినట్లు అవుతుందని అభిమానులు అంటున్నారు. చూద్దాం, చిత్రబృందం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో! కనీసం డైరెక్టర్ వశిష్ట అయినా రిలీజ్ డేట్ గురించి ఒక మాట చెబితే బాగుంటుందని భావించే జనాలు కూడా ఉన్నారు.




