Thursday, October 29, 2026
HomeINTERVIEWSKeerthy Suresh:హీరోయిన్ కీర్తి సురేష్ కి వేధింపులు?

Keerthy Suresh:హీరోయిన్ కీర్తి సురేష్ కి వేధింపులు?

Keerthy Suresh: టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది హీరోయిన్ కీర్తి సురేష్. అభిమాని ద్వారా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని చెప్పుకొచ్చింది.

on
- Advertisement -banner Ad

Keerthy Suresh:టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది హీరోయిన్ కీర్తి సురేష్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ పలు చిత్రాలలో స్పెషల్ సాంగులలో కూడా నటించడానికి సిద్ధమవుతోంది. అంతేకాకుండా ఇటీవలే బాలీవుడ్ లో కూడా తన హవా కొనసాగించడానికి సిద్ధమయ్యింది. అయితే కీర్తి సురేష్ కి ఒక చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది. అది కూడా విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు సెల్ఫీ కోసం ఒక ప్రయాణికుడు తనని ఇబ్బంది పెట్టినట్లు ఆమె తాజాగా తెలియజేశారు.

విమానంలో అభిమాని చేత ఇబ్బంది ఎదుర్కొన్న కీర్తి సురేష్..

మిలాన్ నుంచి భారత్ కి తన భర్త ఆంటోనీతో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది కీర్తి సురేష్. విమానంలో మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి తన దగ్గరికి వచ్చి మరి సెల్ఫీ అడిగారని, అతను సరిగ్గా నిలవలేని పరిస్థితిలో ఉండడంతో కొద్దిసేపు ఆగాలని సూచించాను. అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి వినకుండా వెంటనే ఫోటో దిగాలని చాలా పట్టుపట్టాడు. ఈ ఘటనతో తన భర్త ఆంటోని కూడా అసహనానికి గురయ్యారని తెలిపింది. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో విమాన సిబ్బంది సహాయం తీసుకున్నామని కీర్తి సురేష్ తెలియజేశారు. అయితే అభిమానులు అందరూ ఇలాగే ప్రవర్తించరని, కొంతమంది మాత్రమే ఇలా దారుణంగా ప్రవర్తిస్తారు. చాలామంది ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతారంటూ తెలియజేసింది. కీర్తి సురేష్ మాట్లాడినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -
Advertisement

also read:Katrina Kaif:బాడీ షేమింగ్ ట్రోల్స్ పై దిమ్మతిరిగే సమాధానం చెప్పిన కత్రినా కైఫ్..!

కీర్తి సురేష్ కెరియర్..

కీర్తి సురేష్ ( Keerthy Suresh)సినిమాల విషయానికి వస్తే.. 2000 సంవత్సరంలో పైలట్ అనే చిత్రం ద్వారా బాలనటిగా పరిచయమైంది. 2016లో నేను శైలజ అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత రెమో, మహానటి, మన్మధుడు 2, సర్కారు వారి పాట, దసరా, కల్కి తదితర చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. కీర్తి సురేష్ సినిమాలలోనే కాకుండా పలు రకాల వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ఉన్నది. ఈ వెబ్ సిరీస్ ను ఓటీటీలో విడుదలై మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నాయి.

- Advertisement -
Advertisement

also read:Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర రిలీజ్‌పై గందరగోళం..!

కీర్తి సురేష్ సినిమాలు..

ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో రెండు తమిళ చిత్రాలే కాకుండా రౌడీ జనార్ధన్, జనవరి 12న విడుదల అనే చిత్రాలతో పాటు హిందీ సినిమా కూడా ఉన్నది. కీర్తి సురేష్ తన చిరకాల ప్రియుడు ఆంటోనీని ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. దాదాపుగా 15 సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట డిసెంబర్ 12న 2024న గోవాలో చాలా గ్రాండ్గా వివాహం చేసుకున్నారు. వివాహ అనంతరం కీర్తి సురేష్ ఎక్కువగా బోల్డ్ పాత్రలలోనే కనిపిస్తోంది. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన సినిమాలకు సంబంధించి పలు రకాల అప్డేట్లను ఇస్తూ ఉంటుంది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you