Payal Raj put:సోషల్ మీడియాలో గత రెండు మూడు రోజుల నుంచి ఎక్కువగా వినిపిస్తున్న పేరు హీరోయిన్ రాధిక ఆప్టే పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఈమె తెలుగు సినీ పరిశ్రమలో రెండు మూడు చిత్రాలలో నటించగా అందులో బాలయ్యతో నటించిన సినిమాల పైన చేసిన కామెంట్స్ అలాగే తెలుగు సినీ పరిశ్రమని తక్కువ చేసి మాట్లాడడం, సినిమాలో కనిపించే పద్ధతి గురించి కూడా మాట్లాడడంతో రాధిక ఆప్టే పేరు ఎక్కువగా వినిపిస్తోంది. కెరియర్ ప్రారంభంలో రాధిక ఆప్టేకు అవకాశాలు ఇచ్చి, భారీ పారితోషకాలు ఇచ్చి, తెలుగు సినీ పరిశ్రమ ప్రోత్సహించినప్పటికీ ఇప్పుడు ఇష్టానుసారంగా కామెంట్స్ చేయడంతో చాలామంది ఫైర్ అవుతున్నారు.
రాధిక ఆప్టే పై పాయల్ ఫైర్..
రాధిక ఆప్టే చేసిన కామెంట్స్ సైతం పలువురు సెలబ్రిటీలు కూడా ఫైర్ అవుతున్నారు. అలా నిన్నటి రోజున ప్రముఖ నిర్మాత SKN కూడా ఫైర్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం పైన తాజాగా మరో టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కూడా తీవ్రంగా స్పందించింది. టాలీవుడ్ పరిశ్రమకు అండగా నిలుస్తూ రాధిక ఆప్టేకు ఒక గట్టి కౌంటర్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. పూర్తి వివరాల్లోకి వెళితే.. రాధిక ఆప్టే ఇటీవలే ఇంటర్వ్యూలో సౌత్ ఇండస్ట్రీ గురించి ముఖ్యంగా ఇక్కడ కమర్షియల్ సినిమాలలో నటీనటుల పాత్రల గురించి ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
also read:khushitha kallapu:శ్రీలీల కంటే అందంగా ఉందని మార్చేశారా? త్రివిక్రమ్ హీరోయిన్‌పై చర్చ!
గుర్తింపు ఇచ్చిన ఇండస్ట్రీపై విమర్శలు సరికాదు..
తెలుగు సినీ పరిశ్రమలో నటులకు ముఖ్యంగా హీరోయిన్లకు సరైన ప్రాధాన్యత లభించేదని, కేవలం గ్లామర్ కోసమే ఉపయోగించుకుంటున్నారు అనే రీతిలో ఆమె మాట్లాడింది. ఇటువంటి నేపథ్యంలోని RX 100 సినిమా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ మాట్లాడుతూ.. తెలుగు ఇండస్ట్రీ తనకు చాలా గుర్తింపును , పేరును, భద్రతను కూడా ఇచ్చిందని తెలిపింది. కెరియర్ ఇచ్చిన పరిశ్రమ పైన ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు అంటూ తెలిపింది. తెలుగు సినిమా పరిశ్రమ ఎంతో క్రమశిక్షణతో కూడుకున్నదని, ఇక్కడ నటీనటులను చాలా గౌరవిస్తారు. మనకు మంచి జీవితాన్ని భవిష్యత్తును ఇచ్చిన ఇండస్ట్రీ గురించి ఇలా ఇష్టానుసారంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు అంటూ హీరోయిన్ రాధిక ఆప్టేకు గట్టి కౌంటర్ ఇచ్చింది పాయల్ రాజ్ పుత్(Payal Raj put). ఇందుకు సంబంధించి చేసిన ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
also read:Ramayana Movie Review:రామాయణం మూవీ రివ్యూ.. రావణుడిగా యష్ విశ్వరూపం.. సినిమా ఎలా ఉందంటే?
నేను తెలుగు నటినని గర్వపడుతున్నాను..
అంతేకాకుండా తాను ఒక గర్వించదగ్గ తెలుగు నటిగా, తెలుగు సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. ఇక్కడ ప్రేక్షకులు చూపించే ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనని, నేను తెలుగు సినిమా నటినని చెప్పుకోవడానికి కూడా చాలా గర్వపడుతున్నాను, స్టార్డం తెచ్చిన పరిశ్రమ గురించి ఇలా చెడుగా మాట్లాడడం, సంవత్సరాల తర్వాత ఇలాంటి నిందలు వేయడం సరైనది కాదు అని, మీ కెరియర్ కి పునాది వేసిన మొత్తం ఇండస్ట్రీ పైనే ఇలా విమర్శలు చేయడం మీలోని అసహనానికి ఇది అక్కస్సుకి నిదర్శనం అని తెలియజేసింది. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం తెలుగు సినీ పరిశ్రమ కష్టకాలంలో నాకు అండగా నిలిచిన ఈ పరిశ్రమను తాను ఎప్పుడు అండగా నిలుస్తూ ఉంటానని రాసుకొచ్చింది..
Tollywood made me who I am today. I will always stand by the industry that stood by me. 🎬🔥
— Payal Rajput https://t.co/YvO6hcnDz3— paayal rajput (@starlingpayal) November 4, 2026




