Medha Meka:టాలీవుడ్లో వారసుల ఎంట్రీపై ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా సినీ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి కొత్త నటీనటులు పరిచయమవుతున్నారంటే ఇండస్ట్రీలోనూ చర్చ మొదలవుతుంది. ఇప్పుడు సీనియర్ హీరో శ్రీకాంత్, నటి ఊహ దంపతుల కుమార్తె మేధా మేకా పేరు కూడా టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. హీరోయిన్గా తన తొలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాకముందే ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయనే వార్తలు ఆసక్తిని పెంచుతున్నాయి.
డెబ్యూ ముందే సీక్వెల్లో అవకాశం? :
మేధా మేకాను ఓ ప్రముఖ సినిమా సీక్వెల్ కోసం పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే, మొదటి సినిమా విడుదల కాకముందే ఓ క్రేజీ ఫ్రాంచైజీలో నటించే అవకాశం ఆమెకు దక్కినట్లవుతుంది. అయితే ఆ సీక్వెల్ ఏది? అందులో మేధా పాత్ర ఏమిటి? ఆమెను చిత్రబృందం ఖరారు చేసిందా? అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
మోక్షజ్ఞ సినిమాలోనూ పేరు! :
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా పరిచయం కావాల్సిన సినిమాలోనూ మేధా పేరు వినిపించింది. ఈ కాంబినేషన్‌పై అప్పట్లో ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. అయితే పలు కారణాలతో ఆ ప్రాజెక్ట్ ఆలస్యమవుతుండటంతో ఈ కాంబినేషన్ కార్యరూపం దాల్చలేదని తెలుస్తోంది. ఒకవేళ ఆ సినిమా కుదిరి ఉంటే, మరో స్టార్ ఫ్యామిలీ హీరో సరసన మేధా హీరోయిన్గా పరిచయమయ్యేవారు.
also read:Payal Raj put:రాధిక ఆప్టేకు.. దిమ్మతిరిగే కౌంటర్ వేసిన పాయల్ రాజ్ పుత్..!
మైత్రీ మూవీ మేకర్స్‌తో గ్రాండ్ ఎంట్రీ :
ప్రస్తుతం మేధా తన తొలి సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ చిత్రంతో ఆమె హీరోయిన్గా పరిచయం కానున్నారు. ‘మైత్రీ ఇన్ లవ్’ (Mythri In Love) అనే పేరుతో ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో కొత్త హీరో జై జాస్తి కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. పెద్ద నిర్మాణ సంస్థలో తొలి సినిమా చేసే అవకాశం రావడం మేధాకు మంచి ఆరంభమనే చెప్పాలి.
also read:khushitha kallapu:శ్రీలీల కంటే అందంగా ఉందని మార్చేశారా? త్రివిక్రమ్ హీరోయిన్‌పై చర్చ!
చదువులోనే కాదు.. స్పోర్ట్స్‌లోనూ టాలెంట్! :
మేధా(Medha Meka) వ్యక్తిగత నేపథ్యం కూడా ఆసక్తికరంగా ఉంది. కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాలో ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. చదువుతో పాటు డ్యాన్స్‌పై ఆసక్తి పెంచుకున్నారు. ముఖ్యంగా బాస్కెట్‌బాల్‌లోనూ ఆమెకు మంచి ప్రావీణ్యం ఉందని తల్లి ఊహ గతంలో వెల్లడించారు. జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొన్నట్లు తెలిపారు.
ఇలా చదువు, క్రీడలు, కళలతో తనకంటూ ప్రత్యేక అనుభవాన్ని సంపాదించుకున్న మేధా ఇప్పుడు నటనలో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. తొలి సినిమా విడుదల కాకముందే మరో రెండు ప్రాజెక్టుల్లో ఆమె పేరు వినిపిస్తుండటంతో ఈ స్టార్ కిడ్ టాలీవుడ్లో ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటారో చూడాలి.




