Thursday, November 5, 2026
HomeLATESTRamayana: రామాయణ రెండవ భాగం వాయిదా.. పార్ట్ 3 కూడా..?

Ramayana: రామాయణ రెండవ భాగం వాయిదా.. పార్ట్ 3 కూడా..?

Ramayana: బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు అటు విదేశాలలో కూడా ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూసిన రామాయణ మొదటి భాగం ఎట్టకేలకు విడుదలయ్యింది.

on
- Advertisement -banner Ad

Ramayana: యావత్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా రామాయణం మొదటి భాగం ఈరోజున చాలా గ్రాండ్ గా ప్రపంచ స్థాయిలో విడుదలైంది. ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా, యశ్ రావణాసురుడిగా, సీత పాత్రలో సాయి పల్లవి, సూర్పనఖ పాత్రలో రకుల్ ప్రీతిసింగ్ నటించారు. నమిత్ మల్హోత్ర నిర్మాణంలో నితీష్ తివారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గత కొద్ది రోజుల నుంచి సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న చిత్ర బృందానికి ఇప్పుడు రిలీఫ్ అయ్యింది. మొదటి భాగం 2026 దీపావళికి, రెండవ భాగం 2027 దీపావళికి విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించారు.

రామాయణ పార్ట్ 2 విడుదల వాయిదా..

చెప్పినట్టుగానే మొదటి భాగాన్ని విడుదల చేసినప్పటికీ ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సంపాదించింది. ఇప్పుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత మాట్లాడుతూ.. పార్ట్ 2 గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ.. రామాయణ 2 కేవలం 50 శాతం మాత్రమే షూటింగ్ పూర్తి అయ్యిందని, ఆ సినిమా వాయిదా పడే అవకాశం ఉందంటూ తెలిపారు. అలాగే పార్ట్ 3 కూడా ఉంటుందని తెలియజేశారు. ఈ విషయం విన్న అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

- Advertisement -
Advertisement

also read:Pranitha Subhash: ఫెస్టివ్ లుక్ లో ఆకట్టుకుంటున్న ప్రణీత సుభాష్!

రెండవ భాగంపై అంచనాలు పెంచేసిన మొదటి భాగం..

ఇటీవల హీరోయిన్ సాయి పల్లవి కూడా తాను ఇంకా పార్ట్ 2 షూటింగ్లో జాయిన్ అవ్వలేదంటూ తెలియజేసింది. దీంతో రామాయణం రెండో భాగం 2028 కి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వినిపిస్తున్నాయి. అలాగే పార్ట్ 3 కూడా ఉంటుందా ఉండదా అనే విషయం పైన త్వరలోనే చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి, రామాయణ (Ramayana)మొదటి భాగంలో రావణుడు సీతను అపహరించుకోవడం, జటాయువు మరణంతో ఎండ్ చేశారు. దీంతో రామాయణ రెండవ భాగంలో రాముడు, హనుమంతుడు మధ్య సన్నివేశాలు, రామ రావణ యుద్ధం ఉంటుందని సమాచారం

- Advertisement -
Advertisement

also read:Tollywood:60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి.. టాలీవుడ్ నటుడు ఏమన్నారంటే..?

పార్ట్ 3 ఉంటుందా?

రామాయణం మూడో భాగంలో రాముడు సీతతో అయోధ్యకు రావడం , సీత అడవులకు వెళ్లడం లవకుశల గురించి, రామ అవతారం సమాప్తి గురించి ఉంటుందని సమాచారం. మొత్తానికి రామాయణ మొదటి భాగం విడుదలవ్వడంతో రెండో భాగం పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి పాజిటివ్ టాక్ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సుమారుగా 100 కోట్లకు పైగా బుక్ అయినట్లుగా వినిపించాయి. మరి మొదటి రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి. ప్రస్తుతం రామాయణ సినిమాలకు సంబంధించి ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you