Regina Cassandra:ఒకప్పుడు దక్షిణాది సినిమాల్లో నటించడాన్ని బాలీవుడ్ హీరోయిన్లు పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాన్ ఇండియా సినిమాల ప్రభావంతో తెలుగు, తమిళ చిత్రాలకు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో బాలీవుడ్ భామలు సైతం సౌత్ సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా కొందరు బాలీవుడ్ హీరోయిన్లు దక్షిణాది చిత్ర పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నటి రెజీనా కసాండ్రా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
జాన్వీ, రాధికా వ్యాఖ్యలపై రెజీనా స్పందన :
ఇటీవల రాధికా ఆప్టే, జాన్వీ కపూర్ సౌత్ సినిమా ఇండస్ట్రీ గురించి చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చకు కారణమయ్యాయి. ఈ వివాదంపై ఓ తమిళ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా రెజీనా స్పందించారు. నటీనటులకు ఒక సినిమా కథ నచ్చకపోతే దానిని తిరస్కరించే స్వేచ్ఛ ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో హీరో, హీరోయిన్లకు వేర్వేరు నిబంధనలు ఉండకూడదన్నారు.
జాన్వీ కపూర్‌కు సినిమా విషయంలో అసౌకర్యంగా అనిపిస్తే అప్పుడే తన అభిప్రాయాన్ని చెప్పి ఉండాల్సిందని పేర్కొన్నారు. నటీనటులను బలవంతంగా సినిమాలు చేయించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. రేప్ అయితే చేయలేకు కదా అంటూ కౌంటర్ వేశారు నచ్చని కథలో నటించాల్సిన అవసరం ఎవరికీ లేదని అన్నారు.
also read:Vijay Thalapathy:వైఎస్ ఫ్యామిలీ పెళ్లికి విజయ్ ఎవరితో వచ్చారో తెలుసా?
షూటింగ్ రోజు స్క్రిప్ట్ ఇవ్వడం సమస్య :
సౌత్ సినిమా పరిశ్రమలో తాను గమనించిన ఓ సమస్యను కూడా రెజీనా ప్రస్తావించారు. కొన్ని సందర్భాల్లో షూటింగ్ ప్రారంభమయ్యే రోజు ఉదయం 6 గంటలకు మాత్రమే నటీనటులకు స్క్రిప్ట్ అందిస్తారని తెలిపారు. అదే హిందీ చిత్ర పరిశ్రమలో మాత్రం షూటింగ్‌కు ముందే కాస్ట్యూమ్స్, సన్నివేశాలు, సాంకేతిక విభాగాలకు సంబంధించిన విషయాలను పక్కాగా సిద్ధం చేసుకుంటారని వివరించారు.
రాధికా ఆప్టే(Regina Cassandra) గతంలో బాలకృష్ణతో సినిమా చేసిన సమయంలోనే తనకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాల్సిందని రెజీనా అభిప్రాయపడ్డారు. సినిమా పూర్తయిన తర్వాత ఇంటర్వ్యూలలో విమర్శలు చేయడం కంటే, షూటింగ్ సమయంలోనే సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.
also read:Ramayana:రామాయణ సినిమా మొదటిరోజు కలెక్షన్స్..?
బాలీవుడ్లో తనకు జరిగిన అవమానంపై ఆవేదన :
ఇదే సందర్భంగా బాలీవుడ్లో దక్షిణాది నటీమణులు ఎదుర్కొంటున్న వివక్ష గురించి రెజీనా తన అనుభవాన్ని వెల్లడించారు. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘కేసరి చాప్టర్ 2’ చిత్రంలో పార్వతి నాయర్ పాత్రలో కనిపించినప్పటికీ, సినిమా ప్రమోషన్లలో తనకు తగిన గుర్తింపు ఇవ్వలేదని ఆరోపించారు.
కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ ప్రమోషన్లలో తన పేరుకు ప్రాధాన్యత ఇవ్వలేదని, తాను నటించిన పాట విడుదలయ్యే వరకు కనీసం సోషల్ మీడియాలో ట్యాగ్ కూడా చేయలేదని పేర్కొన్నారు.
తాను సౌత్ ఇండియన్ కావడం వల్లే ఇలా జరిగిందా? అంటూ ప్రశ్నించారు. జాన్వీ కపూర్‌కు సినీ నేపథ్యం ఉండటంతో అవకాశాలు సులభంగా వస్తుండవచ్చని, కానీ తనలాంటి నటీమణులు ఎదుర్కొనే సమస్యలను కూడా గుర్తించాలని అన్నారు.
మొత్తానికి ఉత్తరాది, దక్షిణాది చిత్ర పరిశ్రమల మధ్య అనవసరమైన వివాదాలు సృష్టించవద్దని రెజీనా కోరారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.




