Saturday, November 14, 2026
HomeLATESTTollywood:క్యాన్సర్ ను జయించిన టాలీవుడ్ హీరోయిన్..!

Tollywood:క్యాన్సర్ ను జయించిన టాలీవుడ్ హీరోయిన్..!

Tollywood: ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ క్యాన్సర్ బారిన పడి ఇప్పుడే ఆ వ్యాధి నుండి బయటపడ్డాను అని చెప్పి అభిమానులను ఆశ్చర్యపరిచింది.

on
- Advertisement -banner Ad

Tollywood:తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న హీరోయిన్ లలో మోనాల్ గజ్జర్ కూడా ఒకరు. బిగ్ బాస్ హౌస్లో ఈ అమ్మడు చేసిన సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోనాల్ గజ్జర్ తాజాగా తన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ అభిమానులకు ఒక పెద్ద షాక్ ఇచ్చింది. తనకు పాపిల్లరి థైరాయిడ్ క్యాన్సర్ సోకినట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఇటీవల సర్జరీ చేయించుకున్నట్లుగా ఒక వీడియో ద్వారా తెలియజేసింది. అయితే ఆ సర్జరీ విజయవంతంగా పూర్తి అయ్యిందని ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్లుగా వెల్లడించింది.

క్యాన్సర్ ను జయించాను అంటూ వీడియో విడుదల చేసిన మోనాల్ గజ్జర్..

మోనాల్ గజ్జర్ తన ఆరోగ్య ప్రయాణం గురించి పలు విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఒక వీడియోని విడుదల చేసింది.. మోనాల్ గజ్జర్, అల్లరి నరేష్ హీరోగా నటించిన సుడిగాడు, బ్రదర్ అఫ్ బొమ్మాలి వంటి చిత్రాలలో హీరోయిన్గా నటించి, ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు తెలుగు(Tollywood) బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొని బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ వంటి చిత్రంలో స్పెషల్ సాంగ్ లో కూడా అలరించింది.

- Advertisement -
Advertisement

also read:Suriya:”సీన్” సినిమా కోసం సూర్య తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకండి అంటూ హెచ్చరిక..

తాజాగా తన ఆరోగ్య సమస్య గురించి మోనాల్ గజ్జర్ తెలియజేస్తే చేసిన ఒక పోస్టు అభిమానులను ఆందోళన కలిగించింది. పాపిల్లరి థైరాయిడ్ క్యాన్సర్ రావడంతో వైద్యుల సూచన మేరకు సర్జరీ చేయించుకున్నానని అదృష్టవశాత్తు ఆపరేషన్ విజయవంతంగా పూర్తి అయ్యిందని వెల్లడించింది. ఈ సందర్భంగా తన అభిమానులకు కీలకమైన సందేశాన్ని కూడా అందించింది. కెరియర్ వ్యక్తిగత జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఎవరూ కూడా ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు అంటూ సూచించింది. ఏదైనా అనారోగ్య సమస్యలు కనిపిస్తే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించి ఎప్పటికప్పుడు ఆరోగ్యానికి సంబంధించి పరీక్షలు చేయించుకోవాలని కోరింది.

- Advertisement -
Advertisement

also read:Idupukayitham:ఇడుపు కాయితం.. టీజర్ రిలీజ్..!

హెచ్పివి వ్యాక్సిన్ ప్రాముఖ్యత..

వీటితో పాటుగా సర్వైకల్ క్యాన్సర్ నిర్వహణలో హెచ్పివి వ్యాక్సిన్ ప్రాముఖ్యతను గురించి కూడా తెలియజేసింది మోనాల్ గజ్జర్. ఒకవైపు సినిమాలలో మరొకవైపు బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైన మోనాల్ త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు, నెటిజన్స్ సైతం సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు. ప్రస్తుతం పలు గుజరాతి సినిమాలలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ చివరిగా 2021 లో అల్లుడు అదుర్స్ అనే చిత్రంలో మాత్రమే స్పెషల్ సాంగులో అలరించింది.. ఆ తర్వాత మళ్లీ తెలుగు సినీ ఇండస్ట్రీ వైపు చూడలేదు. అయితే అభిమానులు మాత్రం తిరిగి మళ్లీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వాలని కామెంట్స్ చేస్తున్నారు. మరి అభిమానుల కోరిక మేరకు మోనాల్ గజ్జర్ ఏదైనా సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి మరి.

- Advertisement -
Advertisement

 

View this post on Instagram

 

A post shared by Monaal Gajjar (@monal_gajjar)

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you