Saturday, November 14, 2026
HomeLATESTAllu Sneha Reddy:అల్లు అర్జున్ భార్యకు అరుదైన గౌరవం..?

Allu Sneha Reddy:అల్లు అర్జున్ భార్యకు అరుదైన గౌరవం..?

Allu Sneha Reddy : అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఈ విషయాన్ని ఆమె తన ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

on
- Advertisement -banner Ad

Allu Sneha Reddy:టాలీవుడ్ లో స్టార్ హీరోగా , పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించిన అల్లు అర్జున్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కూడా నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలను కూడా పంచుకుంటుంది. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి భారతదేశంలో మొదటిసారి నిర్వహిస్తున్న స్టెప్ వెల్ ఆర్ట్ బినాలే , బౌలీ ఆర్ట్ సంఘం లో కీలక బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆమె కల్చర్ అండ్ హెరిటేజ్ విభాగం చైర్పర్సన్ గా నియమితులైనట్లు తెలుస్తోంది.

అరుదైన గౌరవాన్ని అందుకున్న అల్లు అర్జున్ భార్య..

భారతీయ కళలు , సంస్కృతి , సాంప్రదాయ వారసత్వాన్ని మరింత ముందుకి నడిపించే లక్ష్యమే ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం. దీనికోసం అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి(Allu Sneha Reddy) తన వంతు కృషి చేయనున్నారు. బౌలీ ఆర్ట్ సంఘం ఇండియాలో మొట్టమొదట మెట్ల బావుల కళా ఉత్సవం. ఇది తెలంగాణలో చారిత్రక మెట్ల బావుల వారసత్వ ప్రదేశాలలో జరగనుంది. వాటి యొక్క అద్భుతమైన నిర్మాణశైలి, చారిత్రక ప్రాధాన్యత, కళల నాగరికతకు మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ వేదిక ద్వారా తెలియజేయనున్నారు.

- Advertisement -
Advertisement

also read:Tollywood:క్యాన్సర్ ను జయించిన టాలీవుడ్ హీరోయిన్..!

బౌలీ ఆర్ట్ సంఘం ఈవెంట్..

బౌలీ ఆర్ట్ సంఘం ఈవెంట్ 2026 డిసెంబర్ 1 నుంచి 2027 జనవరి 10వ తేదీ వరకు జరుగుతుంది.. ఈ వేడుకలలో భారతీయ కళలు, సంస్కృతి, వారసత్వ సంపాదన గురించి ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారు. ఇటువంటి కార్యక్రమానికి చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టడంతో తనకి చాలా ఆనందంగా ఉందంటూ సోషల్ మీడియా ద్వారా స్నేహారెడ్డి తన ఆనందాన్ని తెలియజేసింది. ఇండియాలో మొదటిసారిగా నిర్వహిస్తున్న బౌలీ ఆర్ట్ సంఘం తో తాను కలిసి పనిచేయడం అందులో కూడా కల్చర్ అండ్ హెరిటేజ్ విభాగానికి చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టడం కూడా ఆనందంగా ఉందని తెలిపింది.

- Advertisement -
Advertisement

also read:Suriya:”సీన్” సినిమా కోసం సూర్య తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

సంతోషం వ్యక్తం చేసిన స్నేహ రెడ్డి..

13 కి పైగా చారిత్రక మెట్ల బావులు వారసత్వ ప్రదేశాలలో 200 మందికి పైగా కళాకారులను ఒకే వేదిక పైన తీసుకువచ్చే ఈ పనిని చేయడం పై తనకు మరింత ఆనందంగా ఉందని.. ముఖ్యంగా యువతకు మన నాగరికత చరిత్రను వారసత్వం పైన ఉన్న అవగాహన, సంస్కృతి వంటి విషయాలను తెలియజేయడానికి ఆసక్తి పెంచేందుకు కృషి చేయడం కోసం ఎదురుచూస్తున్నానంటూ స్నేహ రెడ్డి తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక పోస్ట్ షేర్ చేసింది. అల్లు స్నేహారెడ్డికి కూడా ఇంస్టాగ్రామ్ లో భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ కలరు. దాదాపుగా 9.1 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.. చాలామంది సెలబ్రిటీలకు కూడా ఇంతమంది ఫాలోవర్స్ లేరని కూడా చెప్పవచ్చు. అల్లు అర్జున్ సినిమాల విషయానికే వస్తే.. ప్రస్తుతం డైరెక్టర్ అట్లితో కలిసి రాకా చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది.

- Advertisement -
Advertisement

 

View this post on Instagram

 

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you