Actress Sitara:తెలుగు, తమిళ్ భాషలలో ఎన్నో చిత్రాలలో నటించి సొంత మనిషిలా అనిపించే అరుదైన నటీమణులలో అలనాటి నటి సితార కూడా ఒకరు. కొన్ని చిత్రాలలో హీరోయిన్గా కూడా నటించింది. మరికొన్ని చిత్రాలలో తల్లిగా, అమ్మగా, అక్కగా కూడా నటించి అద్భుతమైన నటన ప్రదర్శించింది. ప్రస్తుతం సితార వయసు 50 సంవత్సరాలు పైనే ఉన్నప్పటికీ ఇంకా వివాహం చేసుకోకుండా సింగిల్ లైఫ్ ని కొనసాగిస్తూ ఉండడంతో ఆమె అభిమానులలో ఎప్పుడూ ఆసక్తి రేపే అంశం ఏమిటంటే .. పెళ్లి ఎందుకు చేసుకోలేదు అనే ప్రశ్న ఇప్పటికీ అభిమానులలో ఉండిపోయింది. అసలు సితార ఒంటరితనానికి వెనుక ఉన్న చేదు నిజం ఏంటి అనే విషయం తెలియాలి.
ఇన్నేళ్లయినా సితార ఎందుకు వివాహం చేసుకోలేదు?
సితార(Actress Sitara) వివాహం చేసుకోకపోవడానికి గల కారణాన్ని స్వయంగా ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది.. కేరళలోని కిలిమనార్ లో పరమేశ్వరన్ , వల్సల నాయర్ దంపతులకు సితార జన్మించింది. చిన్న వయసు నుంచి ప్రతి విషయంలో కూడా తన తండ్రి అడుగుజాడలలో పెరిగింది సితార. కెరియర్ లో ఎదుగుతున్న సమయంలో ఆమెకు అండగా కూడా నిలిచారు. అయితే తన తండ్రి మరణ వార్త ఆమె జీవితాన్ని కుదిపేసింది. ఈ విషాదం నుంచి ఆమె తేరుకోవడానికి సుమారుగా కొన్ని సంవత్సరాలు పట్టిందట.
also read:Simran Choudhary: కైపెక్కించే ఫోజులతో మెస్మరైజ్ చేసిన సిమ్రాన్ చౌదరి!
తండ్రి మరణమే ఆమెను ఒంటరిని చేసిందా?
దీంతో ఆమె సినీ కెరియర్ లో కూడా కొన్నేళ్లపాటు ఇండస్ట్రీకి దూరమైంది. కాలం గడిచే కొద్దీ మానసిక వేదన నుంచి బయటపడే క్రమంలో ఆమె పెళ్లి అనే ఆలోచన కూడా చేయలేకపోయింది. కాల ప్రవాహంలో సంవత్సరాలు గడిచిపోవడంతో వైవాహిక జీవితం గురించి ఆలోచించలేదని అయితే భవిష్యత్తులో ఆలోచన వస్తే ఖచ్చితంగా వివాహం చేసుకుంటానంటూ తెలియజేసింది. సితార సినీ ఇండస్ట్రీలోకి కూడా ఎటువంటి ప్రణాళిక లేకుండా ఎంట్రీ ఇచ్చింది. 1985లో తాను చదువుకుంటున్న సమయంలోనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
also read:Donga Naa Koduku:దొంగ నా కొడుకు మూవీ రివ్యూ: మౌళి హ్యాట్రిక్ హిట్ కొట్టాడా?
తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన సితార..
తన నటనతో ఎంతో ప్రతిభ కనపరిచిన సితారకు, తల్లితండ్రులు మాత్రం తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేయమని దానిపైన దృష్టి పెట్టమని కోరారు. దీంతో కేవలం వేసవి సెలవులు , దసరా, క్రిస్మస్ సెలవులలోని ఈమె సినిమా షూటింగ్లలో పాల్గొనేదట. మిగతా సమయాలలో ఎక్కువగా చదువుపైనే దృష్టి పెట్టేదని తెలియజేసింది. అలా 1990లో ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన మనసు మమత అనే చిత్రంతో మొదటిసారిగా గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత ఎంతోమంది స్టార్ హీరోల చిత్రాలలో నటించి విజయాలను అందుకుంది. హీరోయిన్ పాత్రల తర్వాత సితార తన సెకండ్ ఇన్నింగ్స్ ను కూడా మొదలుపెట్టి.. మంచి విజయాలను అందుకుంది.. స్నేహం కోసం, లెజెండ్, శ్రీమంతుడు, అరవింద సమేత తదితర చిత్రాలలో కూడా నటించింది. సితార వెండితెర పైనే కాకుండా బుల్లితెర సీరియల్స్ లలో నటించి మంచి ఆదరణ దక్కించుకుంది. ఇప్పటికీ కూడా తన తండ్రి చెప్పిన మాటలను పాటిస్తూ క్రమశిక్షణతో బరువు పెరగకుండా ముందుకు వెళుతోంది. ఏది ఏమైనా సితార వ్యక్తిగత జీవితంలో మాత్రం పెళ్లికి నోచుకోకపోవడంతో అభిమానులకు ఇప్పటికీ నిరాశను మిగులుస్తోంది.




