Tollywood:భారతీయ సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన ఘనత కొందరు దర్శకులకు మాత్రమే దక్కింది. ముఖ్యంగా బాక్సాఫీస్ దగ్గర రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించడం అనేది ప్రతి దర్శకుడికి సాధ్యమయ్యే విషయం కాదు. భారీ బడ్జెట్, అద్భుతమైన కథ, స్టార్ హీరోల ఇమేజ్‌తో పాటు ప్రేక్షకుల ఆదరణ కూడా తోడైతేనే ఈ అరుదైన రికార్డును అందుకోవచ్చు. ఈ విషయంలో దర్శకధీరుడు రాజమౌళి సరికొత్త ట్రెండ్‌ను సృష్టించారు. ఆయన బాటలోనే పలువురు దర్శకులు వెయ్యి కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టారు.
రాజమౌళి.. ఇద్దరు హీరోలతో రెండు ఇండస్ట్రీ హిట్లు
దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ భారతీయ సినిమా(Tollywood) చరిత్రలోనే ఒక సంచలనంగా నిలిచింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1810 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. దీంతో వెయ్యి కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన తొలి భారతీయ దర్శకుల్లో ఒకరిగా రాజమౌళి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ కలయికలో రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ కూడా ప్రపంచవ్యాప్తంగా రూ.1310 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆయన ఖాతాలో మరో భారీ విజయాన్ని చేర్చింది.
నితీష్ తివారీ.. రెండు భారీ విజయాలు :
‘దంగల్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు నితీష్ తివారీ మరోసారి వెయ్యి కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించారు. అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’ భారత్‌తో పాటు చైనా మార్కెట్లోనూ భారీ వసూళ్లు సాధించింది. తాజాగా రణ్‌బీర్ కపూర్, యశ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘రామాయణ’తో మరోసారి ఈ మైలురాయిని అందుకున్నాడు.
ఆదిత్య ధర్.. వరుసగా రెండు వెయ్యి కోట్ల సినిమాలు :
దురంధర్ రివేంజ్-2’, ‘దురంధర్-1 ’ చిత్రాలతో ఆదిత్య ధర్ కూడా ఈ జాబితాలో ప్రత్యేకంగా నిలిచారు. వరుసగా రెండు సినిమాలతో వెయ్యి కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించిన దర్శకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. మొత్తంగా భారతీయ దర్శకుల మధ్య వెయ్యి కోట్ల వసూళ్ల పోటీ మరింత ఆసక్తికరంగా మారుతోంది.
also read:Master Bharath:డాక్టర్‌గా సెటిల్ అయిన మాస్టర్ భరత్.. సినిమాలపై సంచలన కామెంట్స్!
ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్‌తో సత్తా :
కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కేజీఎఫ్ 2’ బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు సృష్టించింది. యశ్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1233 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి వెయ్యి కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించింది.
also read:Jr NTR:అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎన్టీఆర్.. నిర్మాత ఎవరో తెలుసా?
అట్లీ.. జవాన్‌తో అరుదైన రికార్డు :
తమిళ దర్శకుడు అట్లీ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌తో తెరకెక్కించిన ‘జవాన్’తో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1160 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల అంచనా.
సిద్ధార్థ్ ఆనంద్, నాగ్ అశ్విన్‌లకు భారీ గుర్తింపు :
షారుఖ్ ఖాన్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ‘పఠాన్’ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1055 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. అలాగే ప్రభాస్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ రూపొందించిన ‘కల్కి 2898 ఏడీ’ సుమారు రూ.1111 కోట్ల వసూళ్లతో ఈ ఘనతను అందుకుంది.రాబోయే రోజుల్లో ఈ జాబితాలో మరెంతమంది చేరతారో చూడాలి.




