Kajal Agarwal:రెండు దశాబ్దాలుగా దక్షిణాది ఉత్తరాది ప్రేక్షకులను తన నటనతో, అందంతో ఆకట్టుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. తెలుగు, తమిళ భాషలలో ఎన్నో చిత్రాలలో నటించి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో చందమామ సినిమాతో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. వివాహము అనంతరం సినిమా అవకాశాలు తగ్గినప్పటికీ పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో నటిస్తూ తన కెరీర్ ని కొనసాగిస్తోంది. ఇటీవలే భారీ అంచనాల మధ్య విడుదలైన రామాయణం సినిమాలో కూడా రావణుడి భార్య మండోదరి పాత్రలో నటించి ఆకట్టుకుంది.
భారతీయుడు 2 షూటింగ్ సెట్లో అంత ప్రమాదం జరిగిందా?
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలే ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ అగర్వాల్ తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన పలు విషయాలను తెలియజేసింది. ఈ క్రమంలోనే తాను అత్యంత భయానక సంఘటనను ఎదుర్కొన్న విషయాలను కూడా తెలియజేసింది.. కాజల్ అగర్వాల్(Kajal Agarwal) మాట్లాడుతూ.. భారతీయుడు 2 సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో జరిగిన ప్రమాదం నుంచి తాను ఎలా బయటపడ్డానో ఇప్పటికీ అర్థం కాలేదని, ఆ విషయాన్ని తలుచుకుంటే.. తాను భయభ్రాంతులకు గురవుతానని తెలియజేసింది. అక్కడ జరిగిన సీన్ ఇప్పటికీ తన ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటుందని వెల్లడించింది.
also read:Sameera Reddy:గోవాలో ఇల్లు కొన్న ఎన్టీఆర్ హీరోయిన్..లోపల ఇన్ని ప్రత్యేకతలా!
ఇప్పటికీ భయమేస్తోంది అంటున్న కాజల్..
2020 ఫిబ్రవరిలో చెన్నై ప్రాంతంలో ఈవీపీ ఫిలిం సిటీ లో భారతీయుడు 2 సినిమా షూటింగ్ జరుగుతోందని డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా కమలహాసన్ ఇందులో ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఇందులో కొన్ని భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరించారు. అయితే అనూహ్యంగా అక్కడ ఏర్పాటు చేసిన ఒక భారీ క్రేన్ కుప్పకూలడంతో సుమారుగా అది 100 అడుగుల ఎత్తు నుంచి పడిపోవడంతో సెట్లో ఒక్కసారిగా పెద్ద కలకలం రేగింది అని అయితే ఈ ప్రమాదంలో ముగ్గురు సినిమా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా మరి కొంతమంది గాయాలయ్యాయని తెలియజేసింది.
also read:Om Chapter 1:ఒకే ట్రైలర్‌లో ఇన్ని ట్విస్టులా.. ‘ఓం’ సినిమాపై పెరిగిన అంచనాలు!
దేవుడే కాపాడాడంటూ కామెంట్..
ఆ ప్రమాదం జరిగిన సమయంలో కాజోల్ అగర్వాల్ షూటింగ్లోనే ఉన్నానని , ఆమె ఒక 80 ఏళ్ల వృద్ధురాలి పాత్ర కోసం మేకప్ వేసుకున్నానని షూటింగ్లో తనకు సంబంధించిన సీన్స్ లేకపోవడం వల్ల మానిటర్ వద్దే ఉండాల్సి వచ్చిందని ఇంతలోన ఒక్కసారిగా ఒక భారీ శబ్దం వినిపించింది. ఏం జరిగిందో అర్థం కాక అందరిలో భయం కనిపిస్తూ ఒక్కసారిగా పరుగులు తీశారు. ఆ గందరగోళంలో ఒక టేబుల్ను ఢీకొని అక్కడే పడిపోయానని తెలిపింది.. అయితే ఆ సమయంలో ఒక భారీ క్రేన్ తన వైపే కూలిపోతున్నట్లు కాజల్ అగర్వాల్ గుర్తించారు. ఒక్కసారిగా భయంతో కదల లేక ఉండిపోయాను. అయితే సరిగ్గా ఆ సమయంలో ఎవరో తన చేయి పట్టుకొని మరి టెంటు నుంచి బయటికి లాగేయడం, ఆ వెంటనే క్రేన్ తన పక్కనే కుప్పకూలిందంటూ తెలియజేసింది. అయితే తనను కాపాడిన వ్యక్తి ఎవరో ఇప్పటికీ తెలియదని తన సిబ్బందిని అడిగినా కూడా ఎవరూ చెప్పలేకపోయారని ఆ సమయంలో దేవుడే నన్ను కాపాడాడనే విషయం బలంగా నమ్ముతున్నానని తెలిపింది.




