Bandla Ganesh:తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడుగా, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు బండ్ల గణేష్.. ముఖ్యంగా మెగా అభిమానులు ఆనందపడేలా ఎన్నోసార్లు పలు రకాల ఈవెంట్లలో మెగా హీరోలను ప్రశంసిస్తూ అభిమానులను ఖుషీ చేస్తుంటారు. అయితే అలాంటి బండ్ల గణేష్ కి ఇప్పుడు తాజాగా ఒంగోలు కోర్టు ఒక పెద్ద షాక్ ఇచ్చింది. చెక్ బౌన్స్ కేసులో ఏడాది పాటు జైలు శిక్ష విధించడమే కాకుండా 95 లక్షల రూపాయలు జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి బండ్ల గణేష్ ఇచ్చిన ఒక చెక్ బౌన్స్ కావడంతో ఆ బాధితులు సైతం కోర్టును ఆశ్రయించారు.
బండ్ల గణేష్ కు జైలుశిక్ష..
2018 లో ప్రకాశం జిల్లాలో మద్దిరాలపాడు గ్రామానికి చెందిన జానకిరామయ్య వద్ద బండ్ల గణేష్ 95 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారట. అయితే జానకిరామయ్య మరణించడంతో.. ఆయన తండ్రి జెట్టి వెంకటేశ్వర్లకి పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ పేరుతో బండ్ల గణేష్(Bandla Ganesh) 95 లక్షల రూపాయలు చెక్కుని అందించారు. అయితే ఆ చెక్ బౌన్స్ కావడంతో జట్టి వెంకటేశ్వర్లు ఒంగోలు కోర్టుని ఆశ్రయించడం జరిగింది.. దీనిపైన విచారణ జరిపిన న్యాయస్థానం నేరం రుజువు అవడంతో బండ్ల గణేష్ కి జైలు శిక్ష విధించడమే కాకుండా జరిమానా విధిస్తూ తీర్పుని ఇచ్చింది.
also read:Tyson Naidu:టైసన్ నాయుడుగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా విశ్వరూపం!
స్పందించిన బండ్ల గణేష్..
అయితే ఈ తీర్పు పైన అప్పీల్ చేసుకునేందుకు కోర్టు నెల రోజులపాటు గడువు కూడా అందించింది. గతంలో కూడా బండ్ల గణేష్ కేసులో శిక్ష పడగా.. ఆయన అప్పీల్ కు వెళ్లారు.. ఒంగోలు కోర్టు జైలు శిక్ష విధించడం పైన బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.. భారత రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, పోలీసుల వ్యవస్థ పైన నాకు చాలా గౌరవం ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి వ్యవస్థకు కూడా ఒక ప్రత్యేకమైన గౌరవం, బాధ్యతలు ఉన్నాయని.. జిల్లా కోర్టు నుంచి హైకోర్టు, అక్కడ నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయం కోరేందుకు మనకు రాజ్యాంగం అవకాశం కల్పించిందనీ, న్యాయవ్యవస్థ పైన పూర్తి విశ్వాసంతో చట్టాన్ని గౌరవిస్తూ ముందుకు సాగడమే నా నమ్మకం అంటూ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
also read:ENE Repeat :ENE రిపీట్ మూవీ రివ్యూ.. నవ్వులే నవ్వులు.. సినిమా ఎలా ఉందంటే?
నెటిజెన్స్ భిన్నభిప్రాయాలు..
మొత్తానికి బండ్ల గణేష్ జైలు శిక్ష పైన తన స్పందన తెలియజేయడంతో కొంతమంది నెటిజన్స్ సైతం పలు రకాల భిన్నాభిప్రాయాలను తెలియజేస్తున్నారు. బండ్ల గణేష్ ఈ మధ్యకాలంలో పెద్దగా సినిమాలలో కనిపించలేదు. కానీ సినిమా ఈవెంట్లలో కనిపిస్తూ అప్పుడప్పుడు ఆయన చేసే కామెంట్లు ఎప్పుడు కూడా వివాదాస్పదంగానే మారుతూ ఉన్నాయి. అయితే తిరిగి తాను మళ్లీ తన బ్యానర్ పైన పలు రకాల సినిమాలను తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్న సమయంలోనే.. ఇలా ఒంగోలు హైకోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ విషయం పైన బండ్ల గణేష్ కు ఊరట లభిస్తుందో లేదో చూడాలి మరి.
భారత రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థలపై నాకు అపారమైన గౌరవం ఉంది. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి వ్యవస్థకు ఒక ప్రత్యేకమైన గౌరవం, బాధ్యత ఉన్నాయి. జిల్లా కోర్టు నుంచి హైకోర్టు, అక్కడి నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయం కోరేందుకు రాజ్యాంగం మనకు అవకాశం కల్పించింది. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసంతో, చట్టాన్ని గౌరవిస్తూ ముందుకు సాగడమే నా నమ్మకం. 🙏
— BANDLA GANESH. (@ganeshbandla) November 18, 2026




