Thursday, November 19, 2026
HomeLATESTChiranjeevi:కాకా సినిమాలో అనస్వర రాజన్ పాత్ర అదేనా..?

Chiranjeevi:కాకా సినిమాలో అనస్వర రాజన్ పాత్ర అదేనా..?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి బాబి కొల్లి దర్శకత్వంలో నటిస్తున్న కాకా సినిమాలో అనస్వర రాజన్ పాత్ర సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

on
- Advertisement -banner Ad

Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి ఈమధ్య ఎక్కువగా ఇతర సినిమా ఈవెంట్స్ కి హాజరవుతూ అక్కడ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా తన అప్కమింగ్ సినిమాలకు సంబంధించి ఏదో ఒక విషయంపై హింట్ ఇస్తూ సినిమా హైపును పెంచడం అలవాటుగా మారింది. అందుకే ఇప్పుడు ఇండస్ట్రీలో చిరు లీక్స్ అనే పదం బాగా వైరల్ గా మారింది. తాజాగా ఇప్పుడు మరొకసారి తన సరదా మాటలతో కాకా చిత్రంలోని ఒక కీలక సస్పెన్స్ విషయాన్ని బయటపెట్టి మరింత వైరల్ చేశారు చిరంజీవి.

కాకా సినిమాలో అనస్వర పాత్ర పై చిరంజీవి కామెంట్..

డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న చిత్రం కాకా. ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. వీరి కాంబినేషన్లో వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత సినిమా రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో నటి అనస్వర రాజన్ చిరంజీవి కూతురు పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈమె పాత్ర అమ్ములుకు సంబంధించి పోస్టర్లను కూడా విడుదల చేశారు. ఇందులో చిరంజీవి కూతురు పాత్రలో ఆమె స్వభావం ఎలా ఉంటుంది అనే విషయం పైన తాజాగా చిరంజీవి ఒక హింట్ ఇచ్చేశారు.

- Advertisement -
Advertisement

also read:Balakrishna:ధోని ఐపీఎల్ కి గుడ్ బై.. బాలయ్య వీడియో వైరల్..!

నన్నేమీ అడగద్దు అంటూనే లీక్..

గడిచిన కొన్ని గంటల క్రితం ఇట్లు అర్జున సినిమా సక్సెస్ మీట్ జరగగా .. ఇందుకు చిరంజీవి ముఖ్యఅతిథిగా విచ్చేశారు.. అనీష్ హీరోగా ఈ చిత్రంలో నటించగా.. హీరోయిన్గా అనస్వర రాజన్ నటించారు. స్టేజ్ పైన చిరంజీవి(Chiranjeevi) అనస్వర రాజన్ గురించి మాట్లాడుతూ.. ఆమె నటనను చూసి మెచ్చుకున్నారు.. కాకా చిత్రంలో సినిమా విషయాలను తెలియజేస్తూ ఉన్న సమయంలోనే యాంకర్ స్రవంతిని ఉద్దేశిస్తూ నువ్వు నన్ను ఏ ప్రశ్నలు అడగొద్దు తల్లి.. నేనేం లీక్ చేస్తానో అని నాకే భయంగా ఉంది. కాస్త దూరంగా ఉండు అంటూ చిరంజీవి చాలా సరదాగా అక్కడ అందరిని నవ్వించారు.

- Advertisement -
Advertisement

also read:Jagapathi Babu:జగపతిబాబు భార్య ఆయన పక్కన ఎందుకు నడవరో తెలుసా..? రియల్లీ గ్రేట్..!

మూగ అమ్మాయిగా నటిస్తోందా?

ఆ తర్వాత వెంటనే చిరంజీవి కాస్త అనస్వర వైపుగా తిరిగి చూస్తూ.. కాకా చిత్రంలో అనస్వర అద్భుతంగా నటించారని చెప్పగా అనస్వర నువ్వేమైనా మాట్లాడతావా? తను మాట్లాడదు. మాట్లాడలేదు.. నేను చెప్పిన ఈ చిన్న మాట మీరు ఇంటికి వెళ్ళాక మరి గుర్తుకు తెచ్చుకొని ఆలోచించండి అప్పుడు అసలు విషయం మీకే ఏంటో అర్థం అవుతుంది అంటూ చిరంజీవి నవ్వేశారు. కాకా చిత్రంలో కూడా అనస్వర రాజన్ మూగ అమ్మాయి పాత్రలో కనిపించబోతోందని పలువురు నెటిజన్స్ , మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.. ఇట్లు అర్జున చిత్రంలో కూడా హీరో మూగవాడి పాత్రలో కనిపించారు. కానీ ఇప్పుడు కాకా సినిమాలో మూగ అమ్మాయి పాత్రలో అనస్వర రాజన్ నటిస్తూ ఉండడం గమనార్హం. గతంలో రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో వినికిడి లోపం ఉన్న అమ్మాయి పాత్రలో నటించి మెప్పించారు. ఇప్పుడు కాకా సినిమాలో కేవలం కళ్ళు, హావ భావాలతో అనస్వర ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని అభిమానులు సైతం భావిస్తున్నారు. జనవరి 13న 2027 ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you