Thursday, November 19, 2026
HomeLATESTBalakrishna:ధోని ఐపీఎల్ కి గుడ్ బై.. బాలయ్య వీడియో వైరల్..!

Balakrishna:ధోని ఐపీఎల్ కి గుడ్ బై.. బాలయ్య వీడియో వైరల్..!

Balakrishna: మిస్టర్ కూల్ ధోని ఐపీఎల్ కి రిటైర్మెంట్ ప్రకటించడంతో బాలయ్య వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

on
- Advertisement -banner Ad

Balakrishna:క్రికెట్ దిగ్గజం, మిస్టర్ కూల్ గా పేరు సంపాదించిన ధోనీ ఇటీవలే ఐపిఎల్ కు గుడ్ బాయ్ చెప్పారు.. ఆరు సంవత్సరాల క్రితమే అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పిన ధోని.. తన 45 ఏళ్ల వయసులో ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నప్పటికీ , ధోని ఐపిఎల్ జర్నీని సైతం గుర్తు చేసుకుంటున్నారు.. ఈ సందర్భంగా ధోనీకి సంబంధించి ఎన్నో తెలియని విషయాలను తెలియజేస్తూ ఆయన రికార్డులను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులు, నేటిజన్స్ వైరల్ చేస్తున్నారు. ధోని రిటైర్మెంట్ పై పలువురు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా స్పందించారు.

ధోని రిటైర్మెంట్ పై బాలయ్య వీడియో..

టాలీవుడ్ లో నందమూరి హీరో బాలకృష్ణ తాజాగా ధోని ఐపిఎల్ రిటైర్డ్ విషయం పైన ఉద్దేశిస్తూ మాట్లాడిన ఒక పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోని స్టార్ స్పోర్ట్స్ షేర్ చేసినట్లు తెలుస్తోంది. 15 సంవత్సరాల క్రితం పసుపు రంగు జెర్సీ ధరించి మనందరి జీవితాలలో ఒక సూర్యుడు ఉదయించారు.. ఆ నెంబర్ 7 తో మనం కనెక్ట్ అయినప్పుడు మన జట్టులోనే కాదు నేరుగా మన గుండెలలోకి ప్రవేశించి తన టాలెంట్ వల్లే ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కూడా అతడిని ఓడించలేకపోయింది.. అతను వికెట్ల వెనుక .. మనం టీవీ సెట్స్ ముందు ఆటని నడిపించాం అంటూ తెలిపారు.

- Advertisement -
Advertisement

also read:Jagapathi Babu:జగపతిబాబు భార్య ఆయన పక్కన ఎందుకు నడవరో తెలుసా..? రియల్లీ గ్రేట్..!

ఎమోషనల్ గా సాగిన వీడియో..

కొందరు మహి అని పిలవగా ఇంకొందరు కెప్టెన్ కూల్ , మరి కొంతమంది తల అంటూ పిలుస్తూ ఉంటారు. ఎవరు ఆటకు కొత్త ఊపిరి అందించారు. ఎవరు కోట్లాదిమంది అభిమానులలో కొత్త క్రేజీని కలిగించారో.. ఆ కెప్టెన్ ఇప్పుడు మన అభిమాన నటుడు మనందరికీ గర్వకారణం అయ్యారు. మనల్ని గెలిపించారు. నవ్వించారు. కానీ ఓటమి మాత్రం అంగీకరించడం నేర్పలేదు.. మన ప్రత్యర్ధులు కూడా అభిమానులే ఈ లెక్కలన్నీ జనాలు అందించినందుకు ధన్యవాదాలు తల అంటూ ఒక ఎమోషనల్ వీడియో ద్వారా తెలియజేసిన వీడియోని వైరల్ చేశారు.

- Advertisement -
Advertisement

also read:Suriya:సూర్య మనసు బంగారం.. యువ నటుడికి ఖరీదైన కానుక!

బాలయ్య సినిమాలు..

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ (Balakrishna)సినిమాల విషయానికి వస్తే. డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య దాదా అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, గ్లింప్స్ సినిమా పైన అంచనాలను పెంచేస్తున్నాయి. గడిచిన కొన్ని నెలల క్రితం బాలయ్య ఈ సినిమా షూటింగ్లో పాల్గొనగా అనుకోకుండా గాయం అవ్వడంతో బాలయ్యకు సర్జరీ కూడా జరిగినట్లు తెలిసిన విషయమే.. ఇప్పుడు తాజాగా సినిమా షూటింగ్లో పాల్గొన్నట్లుగా వినిపిస్తోంది. ఇలా ఒక వైపు సినిమాలలో మరొకవైపు షోలలో కూడా పాల్గొంటూ బాగానే పాపులారిటీ సంపాదిస్తున్నారు బాలయ్య.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you