Thursday, November 19, 2026
HomeLATESTHyper Aadi:రోజాతో హైపర్ ఆదికి విభేదాలు..స్టేజీ పైనే ఇచ్చి పడేశాడుగా..!

Hyper Aadi:రోజాతో హైపర్ ఆదికి విభేదాలు..స్టేజీ పైనే ఇచ్చి పడేశాడుగా..!

Hyper Aadi:రోజా గారంటే నాకు చాలా ప్రత్యేకమైన అభిమానం. కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మాత్రం నేనేదో అన్నాను, అదేదో అన్నాను అంటూ రాసేసుకున్నారు. నేనేం అనలేదండి.. మీరే అనుకుని మీరే రాసేసుకున్నారు..

on
- Advertisement -banner Ad

Hyper Aadi:సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వార్తలైనా, రాజకీయాలకు సంబంధించిన విషయాలైనా సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా యూట్యూబ్‌లో థంబ్‌నెయిల్స్ కోసం కొంతమంది క్రియేటర్లు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. అసలు విషయంతో సంబంధం లేకపోయినా, ఏదో పెద్ద వివాదం జరిగినట్లు క్రేజీ టైటిల్స్ పెడుతూ వీడియోలను వైరల్ చేస్తుంటారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఆఈ)ను ఉపయోగించి ఆకట్టుకునే థంబ్‌నెయిల్స్ రూపొందిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు.

ముఖ్యంగా సినీ సెలబ్రిటీల గురించి సోషల్ మీడియాలో ఎలాంటి ప్రచారాలు జరుగుతుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ప్రముఖుల గురించి అయితే రకరకాల వార్తలు ప్రచారంలో ఉంటాయి. అలాంటి ప్రచారాలకు తాజాగా హైపర్ ఆది తనదైన శైలిలో చెక్ పెట్టారు.

- Advertisement -
Advertisement

రోజా, హైపర్ ఆది మధ్య విభేదాలంటూ ప్రచారం:

జబర్దస్త్ షో ద్వారా రోజా, హైపర్ ఆది(Hyper Aadi) మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా గుర్తుండిపోయింది. అయితే రాజకీయాల్లోకి వచ్చేసరికి పరిస్థితులు మారాయి. రోజా వైఎస్సార్‌సీపీకి మద్దతుగా ఉండగా, హైపర్ ఆది జనసేన పార్టీకి మద్దతు పలికారు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

అంతేకాకుండా, హైపర్ ఆది రోజాపై ఏదో వ్యాఖ్యలు చేశారని, ఆమెపై మండిపడ్డారని, విమర్శలు గుప్పించారని కొందరు యూట్యూబ్ ఛానల్స్ రకరకాల థంబ్‌నెయిల్స్‌తో వీడియోలు రూపొందించారు. అసలు ఏం జరిగిందనే విషయాన్ని పక్కనపెట్టి, ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయనే విధంగా ప్రచారం చేశారు. దీంతో ఈ వార్తలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

- Advertisement -
Advertisement

also read:Gopichand;మహేష్ బాబు కి విలన్ గా చేయాల్సిన గోపీచంద్.. చెడ దొబ్బింది ఎవరంటే?

స్టేజీపైనే క్లారిటీ ఇచ్చిన హైపర్ ఆది :

తాజాగా ఇలాంటి ప్రచారాలన్నింటికీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు హైపర్ ఆది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన స్టేజీపైకి వచ్చి మైక్ పట్టుకుని మాట్లాడారు. అక్కడికి ముఖ్య అతిథిగా వచ్చిన రోజా గురించి ప్రస్తావిస్తూ తన మనసులోని మాటలను బయటపెట్టారు.

- Advertisement -
Advertisement

“రోజా గారంటే నాకు చాలా ప్రత్యేకమైన అభిమానం. కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మాత్రం నేనేదో అన్నాను, అదేదో అన్నాను అంటూ రాసేసుకున్నారు. నేనేం అనలేదండి.. మీరే అనుకుని మీరే రాసేసుకున్నారు. ఈ సభాముఖంగా క్లారిటీ ఇస్తున్నాను” అంటూ హైపర్ ఆది చెప్పుకొచ్చారు.

also read:Bandla Ganesh:నిర్మాత బండ్ల గణేష్ కు ఏడాది జైలు శిక్ష.. ఆయన రియాక్షన్ ఏమిటంటే?

నవ్వేసిన రోజా.. వైరల్ అవుతున్న వీడియో:

సాధారణంగా తనదైన పంచ్ డైలాగ్స్, సెటైరికల్ కామెంట్స్‌తో ప్రేక్షకులను నవ్వించే హైపర్ ఆది.. ఈసారి కూడా అదే స్టైల్‌లో సమాధానం ఇచ్చారు. తనకు, రోజాకు మధ్య విభేదాలు ఉన్నాయంటూ తప్పుడు ప్రచారం చేసిన వారికి ఒక్క మాటతో గట్టి కౌంటర్ ఇచ్చారు. మరోవైపు హైపర్ ఆది మాట్లాడుతున్న సమయంలో రోజా కూడా నవ్వుతూ కనిపించారు.

దీంతో ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూట్యూబ్‌లో వచ్చే ప్రతి వార్తను నమ్మకూడదని, ముఖ్యంగా సెలబ్రిటీల మధ్య విభేదాలంటూ వచ్చే ప్రచారాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించాలని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. మొత్తానికి రోజాతో తనకు ఎలాంటి విభేదాలు లేవనే విషయాన్ని హైపర్ ఆది సరదాగా, సూటిగా చెప్పడంతో ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you