Sunday, November 22, 2026
HomeLATESTJabardast Babu:ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న జబర్దస్త్ కమెడియన్..!

Jabardast Babu:ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న జబర్దస్త్ కమెడియన్..!

Jabardast Babu: జబర్దస్త్ కామెడీ షో తో నటుడిగా మంచి పేరు సొంతం చేసుకొని లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో దర్శకుడిగా మారిన బాబు ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు.

on
- Advertisement -banner Ad

Jabardast Babu:జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో కమెడియన్ బాబు కూడా ఒకరు.. ఇటీవలే లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వెబ్ సిరీస్ ద్వారా డైరెక్టర్ గా మారి మంచి విజయాన్ని అందుకున్నారు. అందరూ కూడా బాబు టాలెంట్ ను చూసి ప్రశంసలు కురిపించారు. ఇటీవలే ఓటీటీలో ఈ సిరీస్ కి మంచి ఆదరణ లభించడంతో మరిన్ని సినిమాలను, వెబ్ సిరీస్లను తెరకెక్కించే అవకాశాలను సంపాదించుకున్నారు. ఇటువంటి తరుణంలో జబర్దస్త్ బాబు తాను ప్రేమించిన అమ్మాయితో కలిసి వైవాహిక బంధం లోకి అడుగుపెట్టారు.

ప్రేమించిన అమ్మాయితో ఏడడుగులు వేసిన జబర్దస్త్ బాబు..

నవంబర్ 21వ తేదీన బాబు వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు బాబు.. జబర్దస్త్ బాబు(Jabardast Babu) వివాహ వేడుకకు జబర్దస్త్ ఆర్టిస్టులతో పాటు కొంతమంది బుల్లితెర సెలబ్రిటీలు కూడా హాజరై ఈ జంటను ఆశీర్వదించారు. ప్రస్తుతం బాబు పెళ్లి వీడియోకి సంబంధించిన వీడియో లు కూడా వైరల్ గా మారాయి వీటిని చూసిన అభిమానులు, నెటిజన్స్ సైతం ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Ravi Teja:రాజమౌళికి రవితేజ అదిరిపోయే కాంప్లిమెంట్.. ఆ కామెంట్స్ వైరల్!

డైరెక్టర్గా సక్సెస్ అయ్యాకే పెళ్లి..

సాధారణ కంటెస్టెంట్ గా కామెడీ షోలోకి అడుగుపెట్టి ఆ తర్వాత టాప్ కమెడియన్ గా పేరు సంపాదించిన బాబు తనదైన విభిన్నమైన కామెడీ పంచులతో బుల్లితెర ఆడియన్స్ ను నవ్విస్తుంటారు. ఒక జబర్దస్త్ లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ, మరికొన్ని టీవీ షోలలో కూడా కమెడియన్ గా కొనసాగుతున్నారు. కేవలం నటుడు గానే కాకుండా స్క్రిప్ట్ రైటర్ గా కూడా మంచి ప్రాధాన్యత ఉన్నది. ఇప్పటికే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోల కోసం ఎన్నో స్కిట్స్ కూడా రాశారు బాబు.. ఇలా మల్టీ టాలెంట్ పర్సన్ అయిన బాబు ఇటీవలే లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వెబ్ సిరీస్ తో మరింత దగ్గరయ్యారు. ఈ వెబ్ సిరీస్ కి ఓటీటిలో కూడా మంచి ఆదరణ లభించింది

- Advertisement -
Advertisement

అమ్మాయి ఎవరంటే?

జబర్దస్త్ బాబు వివాహం చేసుకున్న అమ్మాయి పేరు అమూల్య.. వీరిది ప్రేమ వివాహం . గత ఏడేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని బాబునే స్వయంగా చాలా ఇంటర్వ్యూలలో తెలియజేశారు.. ఇక అమూల్య విషయానికి వస్తే. ఈమె బి ఫార్మసీ పూర్తి చేసుకుంది . కొన్ని తెలుగు న్యూస్ చానల్స్ లో యాంకర్ గా పనిచేస్తున్న సమయంలో బాబుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారి చివరకు ప్రేమికులుగా మారేలా చేసింది. అయితే ప్రొఫెషనల్ కెరియర్ పరంగా బాబు ఎదగడంతో అమూల్య ప్రోత్సాహం కూడా ఉన్నది. కానీ కనీసం ఒక్క సినిమా అయినా డైరెక్టర్ గా చేసి స్థిరపడిన తర్వాతే వివాహం చేసుకోవాలనుకున్న బాబు.. ఇన్ని సంవత్సరాల పాటు వెయిట్ చేశారట. ఇప్పుడు డైరెక్టర్గా విజయం సాధించడంతో ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో అమూల్యని బాబు వివాహం చేసుకున్నారు.

 

- Advertisement -
Advertisement
View this post on Instagram

 

A post shared by Babu_Offical (@degala_babu_official)

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you