Salman Khan:బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన సల్మాన్ ఖాన్ ఈ మధ్యకాలంలో నటించిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. అయినా కూడా ఆయన క్రేజ్ మాత్రం తగ్గలేదు. తాజాగా సల్మాన్ ఖాన్ నటించిన మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్ అనే సినిమా డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎన్నోసార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఈవెంట్లో పాల్గొన్న సల్మాన్ ఖాన్ పలు విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంలోనే బాలీవుడ్ హీరోయిన్స్ శ్రద్ధా కపూర్ కి క్షమాపణలు చెప్పారు. వాటి గురించి పూర్తి వివరాలు చూద్దాం.
సల్మాన్ ఖాన్ , శ్రద్ధా కపూర్ సినిమాలు ఒకే టైంలో విడుదల..
బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటించిన ఈథా చిత్రం కూడా విడుదల కాబోతోంది. డిసెంబర్ 4న దీంతో బాక్సాఫీస్ వద్ద రెండు సినిమాల మధ్య ఒక గట్టి పోటీ ఉండనుంది. ఈ నేపథ్యంలోని సల్మాన్ ఖాన్(Salman Khan), శ్రద్ధ సినిమాతో తన చిత్రం అనుకోకుండా క్లాష్ అవుతోందని ఈ విషయం ముందే తెలిసి ఉంటే ఆ తేదీని ఎంచుకునే వారం కాదు అంటూ తెలియజేశారు. ఇటీవలే ఒక న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ తన సినిమా విడుదల తేదీ విషయం పైన ఎదురైన ఇబ్బందుల గురించి మాట్లాడారు.
ALSO READ:Jabardast Babu:ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న జబర్దస్త్ కమెడియన్..!
స్పందించిన సల్మాన్ ఖాన్..
నవంబర్ 20వ తేదీన ఈథా చిత్రం విడుదల చేయాలనుకున్నాము. అయితే వీఎఫ్ఎక్స్ కారణాల లోపాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. ఆ తర్వాత నవంబర్ 27న రిలీజ్ చేయాలనుకున్నాము . కానీ అదే రోజున సూరజ్ నటించిన యే ప్రేమ్ మోల్ లియో సినిమా రిలీజ్ కావడంతో వెనక్కి వెళ్ళాము. సూరజ్‌తో నేను ఎప్పటికీ బాక్సాఫీస్ వద్ద పోటీగా దిగను. అలాగే సన్నీ లియోన్ సినిమా కూడా ఉండడంతో ఆయనతో పోటీ పడకూడదని నిర్ణయించుకున్నానని తెలియజేశారు. అలాగే డిసెంబర్ 24న షారుక్, సుహానాల కింగ్ సినిమా రిలీజ్ కాబోతోంది. షారుక్ తో కూడా తాను ఎప్పటికీ పోటీకి దిగను. అంతర్జాతీయ చిత్రాలైన మరికొన్ని చిత్రాలు కూడా రాబోతున్నాయి. అయినా కూడా నాకు ఇబ్బంది లేదు. షారుఖ్ ఖాన్ తో మాత్రం బాక్సాఫీస్ వద్ద క్లాష్ ఉండకూడదని తెలిపారు సల్మాన్ ఖాన్.
ALSO READ:Ravi Teja:రాజమౌళికి రవితేజ అదిరిపోయే కాంప్లిమెంట్.. ఆ కామెంట్స్ వైరల్!
శ్రద్ధా కపూర్ కి క్షమాపణలు..
శ్రద్ధా కపూర్ నటించిన యే ప్రేమ్ మోల్ లియో డిసెంబర్ 4న రిలీజ్ కావడం పై మాట్లాడుతూ.. నాకు ఈ విషయం ముందే తెలిసి ఉంటే శ్రద్ధ సినిమాతో పోటీగా వచ్చేవాడిని కాదు ఇప్పటికే శ్రద్ధ కపూర్ కి ఫోన్ చేసి మరి క్షమాపణలు తెలియజేశానని, శ్రద్ధ చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. ఆమెకి ఫోన్ చేసి.. ఈ విషయం నాకు తెలియదు నిజంగా నన్ను క్షమించు అని చెప్పాను. ఆమె రెండు సినిమాల విడుదలకు తగినంత స్థలం ఉంది సార్ అని చెప్పడంతో అది విని నేను చాలా సంతోషించాను అంటూ తెలిపారు. అలాగే శ్రద్ధా కపూర్ నటించిన సినిమాలపై కూడా ప్రశంసలు కురిపించారు సల్మాన్ ఖాన్.




