Monday, November 23, 2026
HomeLATESTSharwanand:నా కెరీర్‌కు వాళ్లే పిల్లర్స్.. నలుగురు డైరెక్టర్లకు శర్వానంద్ థ్యాంక్స్!

Sharwanand:నా కెరీర్‌కు వాళ్లే పిల్లర్స్.. నలుగురు డైరెక్టర్లకు శర్వానంద్ థ్యాంక్స్!

Sarwanand:తన కెరీర్‌లో కీలకమైన సినిమాలు చేసిన దర్శకులను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.గుణ్ణం గంగరాజు,దేవా కట్టా,సుజిత్,సంపత్ నందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు .

on
- Advertisement -banner Ad

Sharwanand:టాలీవుడ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా నిర్వహించిన ప్రీరిలీజ్ వేడుకలో చిత్ర బృందం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా శర్వానంద్ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి.

సినిమా విషయంలో ఎలాంటి టెన్షన్ లేదు! :

ప్రీరిలీజ్ ఈవెంట్‌లో శర్వానంద్ మాట్లాడుతూ.. సాధారణంగా ప్రతి సినిమా విడుదల సమయంలోనూ ఏదో ఒక రకమైన ఆందోళన ఉంటుందని, కానీ ‘భోగి’ విషయంలో తనకు అలాంటి టెన్షన్ లేదని చెప్పారు. సినిమా ఫస్ట్ కాపీ చూసినప్పుడే ఎంతో సంతృప్తి కలిగిందని వెల్లడించారు. దర్శకుడు సంపత్ నంది కథ చెప్పిన సమయంలో కొన్ని సన్నివేశాలు తనను ఆలోచనలో పడేశాయని తెలిపారు.

- Advertisement -
Advertisement

ముఖ్యంగా ఈ సినిమా కోసం డబ్బింగ్ చెప్పేటప్పుడు భాష విషయంలో కొంత సందేహం కలిగిందన్నారు. ప్రతి భాషను ఒక తల్లిలా గౌరవించాలని, మన మాతృభాషతో ఎంత మర్యాదగా వ్యవహరిస్తామో ఇతర భాషల విషయంలోనూ అదే గౌరవం ఉండాలని అభిప్రాయపడ్డారు. సినిమాలో తన పాత్రను ప్రేక్షకులు తప్పకుండా అర్థం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

also read:Mahesh Babu:మహేష్ బాబు లుక్‌పై సోషల్ మీడియాలో చర్చ.. అస్థిపంజరంలా మారారంటూ ట్రోల్స్!

- Advertisement -
Advertisement

నా ఇమేజ్‌ను పక్కనపెట్టి ఈ సినిమా చేశా:

‘భోగి’ కోసం తన ఇమేజ్‌ను పక్కనపెట్టి కథను నమ్మి ముందుకు వెళ్లానని శర్వానంద్ (Sharwanand)తెలిపారు. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలను సంపత్ నంది అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసించారు. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి పెర్ఫార్మెన్స్ తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ముఖ్యంగా యాక్షన్ కొరియోగ్రఫీ చేసిన దిలీప్ పనితీరును ప్రత్యేకంగా అభినందించారు.

తన కెరీర్‌లో కీలకమైన సినిమాలు చేసిన దర్శకులను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘అమ్మ చెప్పింది’తో గుణ్ణం గంగరాజు, ‘ప్రస్థానం’తో దేవా కట్టా, ‘రన్ రాజా రన్’తో సుజిత్ తనలోని విభిన్న కోణాలను ప్రేక్షకులకు పరిచయం చేశారని చెప్పారు. ఇప్పుడు ‘భోగి’తో సంపత్ నంది తనలో మరో కొత్త యాంగిల్‌ను బయటకు తీసుకొచ్చారని పేర్కొన్నారు.

- Advertisement -
Advertisement

also read:Meenakshi Chaudhary:తన క్రష్ గురించి బయటపెట్టిన మీనాక్షి చౌదరి.. ఫ్యాన్స్ ఫిదా!

చివర్లో పవర్‌ఫుల్ డైలాగ్‌తో ముగింపు:

సంపత్ నందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపిన శర్వానంద్.. ‘భోగి’ సినిమాలోని పవర్‌ఫుల్ డైలాగ్‌తో తన ప్రసంగాన్ని ముగించారు. ‘‘తగ్గినోడికి తగలబెట్టడం కూడా తెలుసు. అనవసరంగా కెలకకండి.. తగలబెట్టి పడేస్తాడు’’ అంటూ చెప్పిన డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంది.

ట్రైలర్‌లోని యాక్షన్ సన్నివేశాలు, శర్వానంద్ కొత్త లుక్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. మరి నవంబర్ 27న విడుదల కానున్న ‘భోగి’ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you