Sri Vishnu:టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు వరుసగా కామెడీ సినిమాలతో మంచి విజయాలను అందుకుంటున్నారు. ఈ ఏడాది కామ్రేడ్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు తాజాగా మరో కామెడీ సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమానే ఫ్యామిలీ ఫ్యాక్.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన సామజవరగమన సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఫ్యామిలీ ప్యాక్ టీజర్ ని చిత్ర బృందం గడిచిన కొన్ని గంటల క్రితం విడుదల చేశారు.
ఫ్యామిలీ ప్యాక్ టీజర్ రిలీజ్..
2027 సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమా టీజర్ ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా శ్రీ విష్ణు చెప్పే కామెడీ డైలాగులు, వీకే నరేష్ చేసే కామెడీ సీన్స్ టీజర్ కే హైలెట్గా నిలుస్తున్నాయి. ఇందులో అభిరామి శ్రీ విష్ణు మదర్ పాత్రలో అద్భుతంగా నటించారు. అలాగే వెన్నెల కిషోర్, మురళీ శర్మ , సుదర్శన్ కామెడీ కూడా టీజర్ కి హైలెట్గా నిలుస్తోంది. ఇందులో కమెడియన్ బుల్లి రాజు కూడా శ్రీ విష్ణు తమ్ముడు పాత్రలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది. సాక్షి మడోల్కర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.
also read:Rashmika mandanna:ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్.. రష్మిక కాలేజీ సీనియరా..?
ఆకట్టుకుంటున్న టీజర్..
శ్రీ విష్ణు(Sri Vishnu) చివరిలో చెప్పే ఒక పంచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఏం రైటరో.. ఏం కథ రాస్తున్నావు అని అడగగా అవతల ఉన్న.. పోలీస్ స్టేషన్ రైటర్ గుర్తింపు కదా సార్ అంటూ చెప్పగా దానికి శ్రీ విష్ణు గుర్తింపు కలలు వద్దురా బయట చెక్కేస్తున్నారు.. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లు రాయండి.. ఫన్ ఉండాలి.. జోష్ ఉండాలి .. కిక్ ఉండాలి అంటూ చెప్పే డైలాగ్ హైలెట్గా నిలిచింది. ఫ్యామిలీ ప్యాక్ సినిమాలో శ్రీవిష్ణు ఒక డిఫరెంట్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తున్నారు.. బాధ్యత గల ఫ్యామిలీ మ్యాన్ లా కాకుండా కుటుంబం గురించి అసలు పట్టించుకోని స్వార్థపరుడులా ఆయన పాత్ర కనిపిస్తోంది.
also read:Kavya – Anirudh:కావ్య మారన్- అనిరుధ్ పెళ్లి ఖర్చు ఎన్ని కోట్లో తెలుసా?
కాంబో అదుర్స్..
ఒకే కుటుంబంలో బంజారాహిల్స్, బోరు బండ ఉంటే ఎలా ఉంటుందో మా ఇల్లు అలా ఉంటుంది అంటూ కుటుంబంలోని లైఫ్ స్టైల్ తేడాలని చూపించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నారు ఇలాంటి స్వార్థపరుడైన పోలీస్ జీవితంలోకి తనపై అధికారులతో కథ ఎలాంటి మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత జరిగే గందరగోళం ఏంటి అనే విషయంపై టీజర్ తోనే ఒక క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ రామ్ అబ్బరాజు.. శ్రీ విష్ణు తన కామెడీ టైమింగ్ తో, బాడీ లాంగ్వేజ్ తో టీజర్ ని హైలెట్ చేశారు. ఇక వీకే నరేష్-శ్రీ విష్ణు కాంబినేషన్ అంటేనే నవ్వులకు కొదవ ఉండదు అన్నట్లుగా మార్చేశారు. ఈ సినిమాతో వీరిద్దరూ మరొకసారి సందడి చేయబోతున్నారు. జనవరి 14న ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే సంక్రాంతి బరిలో చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి ఈ ఫ్యామిలీ ప్యాక్ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.




