Monday, November 2, 2026
HomeLATESTKing Movie:షారుక్ ఖాన్ బర్తడే.. కింగ్ సినిమా నుంచి రొమాన్స్, యాక్షన్ పాట రిలీజ్!

King Movie:షారుక్ ఖాన్ బర్తడే.. కింగ్ సినిమా నుంచి రొమాన్స్, యాక్షన్ పాట రిలీజ్!

King Movie: షారుక్ ఖాన్ ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కింగ్ మూవీ నుండి తాజాగా రొమాంటిక్ యాక్షన్ సాంగ్ నురిలీజ్ చేశారు.

on
- Advertisement -banner Ad

King Movie:బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తన 61వ పుట్టినరోజు ఈరోజు కావడం చేత అభిమానులు ప్రత్యేకించి మరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దీంతో షారుఖ్ ఖాన్ నటిస్తున్న సినిమా అప్డేట్ల కోసం కూడా అభిమానులు చాలా ఎక్సైటింగ్ గానే ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం షారుక్ ఖాన్ కింగ్ అనే ఒక చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా.. ఇందులో హీరోయిన్గా దీపికా పదుకొనే నటించింది. ఈ చిత్రానికి సంబంధించి తొలి పాట తూ మిల్ జాయే ను చిత్ర బృందం విడుదల చేసింది.

కింగ్ మూవీ నుండి సాంగ్ రిలీజ్..

ముఖ్యంగా షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే మధ్య రొమాన్స్ యాక్షన్ అంశాలను కలగలిపి రూపొందించిన ఒక పాటను విడుదల చేశారు. ఇది అభిమానులను ప్రత్యేకించి బాగా ఆకర్షిస్తుందని చెప్పవచ్చు. పాట ప్రారంభంలోనే షారుఖ్ ఖాన్ తనదైన శైలిలో చెప్పే డైలాగు కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది.. నేను హంతకుడుని కాదు ప్రేమికుడిని అంటూ చెప్పే డైలాగుతోనే ఈ పాట మొదలవుతుంది. ఆ తర్వాత ప్రకృతి అందాల మధ్య షారుక్ ఖాన్ – దీపిక నడుము సాగే రొమాంటిక్ సీన్స్ కూడా అందరిని ఆకట్టుకుంటున్నాయి.

- Advertisement -
Advertisement

also read:Mamitha Baiju:మమితా బైజు అసలు పేరు ఏంటో తెలుసా..?

రొమాంటిక్, యాక్షన్ మేళవింపుగా..

ఆ వెంటనే షారుఖ్ ఖాన్ ప్రత్యర్థులతో తలబడే యాక్షన్ దృశ్యాలను కూడా ఈ పాటలో చాలా అద్భుతంగా చూపించారు డైరెక్టర్. చివరిలో ఆయన చెప్పే.. ఈసారి గుండెల్లో మంట రగిలింది.. ఇప్పుడు ప్రపంచాన్ని తగలబెట్టకుండా ఆగదు.. అనే డైలాగులు కూడా మరింత హైలెట్ గా నిలిచాయి. కింగ్(King Movie) సినిమాలోని ఈ పాట ప్రేమ, భావోద్వేగాలు యాక్షన్ సీన్స్ సమాన ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ పాటకి సచిన్- జీగర్ సంగీతాన్ని అందించారు. ఈ పాటకి పియూష్ , షాజియా కొరియోగ్రఫీ అందించారు.

- Advertisement -
Advertisement

also read:Regina Cassandra:లవ్ ఫెయిల్యూర్ పై రెజీనా ఎమోషనల్ కామెంట్స్..!

మొదటి పాటతోనే అంచనాలు భారీ స్థాయికి..

షారుక్ ఖాన్ దీపికా పదుకొనే కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. కింగ్ సినిమాలో విడుదలైన ఈ పాటలో కూడా కెమిస్ట్రీ తో పాటు సంగీతం, యాక్షన్ సీన్స్ కూడా అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నట్లు కనిపిస్తున్నాయి. మొదటి పాటతోనే సినిమా పైన అంచనాలను మరింత పెంచేసేలా కనిపిస్తోంది. కింగ్ సినిమాలో షారుక్ ఖాన్ కుమార్తె సుహాన ఖాన్, అభిషేక్ బచ్చన్ తో పాటు పలువురు నటీనటులు సైతం కీలకమైన పాత్రలో నటించబోతున్నారు. 2026 డిసెంబర్ 24న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన తొలి పాటకు విశేషమైన స్పందన రాబట్టడమే కాకుండా అభిమానులకి మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. మరి సినిమా ట్రైలర్ తో ఎలాంటి అంచనాలు పెంచేస్తుందో చూడాలి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you