Monday, November 2, 2026
HomeINTERVIEWSRegina Cassandra:లవ్ ఫెయిల్యూర్ పై రెజీనా ఎమోషనల్ కామెంట్స్..!

Regina Cassandra:లవ్ ఫెయిల్యూర్ పై రెజీనా ఎమోషనల్ కామెంట్స్..!

Regina Cassandra: ప్రముఖ హీరోయిన్ రెజీనా కసాండ్రా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన బ్రేకప్ గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.

on
- Advertisement -banner Ad

Regina Cassandra:కోలీవుడ్, టాలీవుడ్ లో గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా విభిన్నమైన నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నది హీరోయిన్ రెజీనా కసాండ్రా. తనకు పాత్ర నచ్చితే విలన్ గా కూడా నటించడానికి కూడా సిద్ధంగానే ఉంటుంది. అలా ఇప్పటికే ఎన్నో చిత్రాలలో నటించిన రెజీనా ఇప్పుడు నయనతార నటించిన మహాశక్తి చిత్రంలో కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ తన పర్సనల్ లైఫ్ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఎమోషనల్ గా మాట్లాడింది.

లవ్ కారణంగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను..

జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయని, వాటిని మనం దాటుకొని ముందుకు వెళితేనే అసలైన పోరాటం అంటూ రెజీనా (Regina Cassandra)పేర్కొన్నది. ముఖ్యంగా తన ప్రేమ బంధం గురించి మాట్లాడుతూ.. 2020లో నా జీవితంలో ఒక పెద్ద కుదుపు వచ్చింది, నా ప్రేమ బంధం అర్ధాంతరంగా మురిసిపోయింది. ఆ బంధంలో నేను దారుణంగా మోసపోయాను. ఆ సమయంలో మానసికంగా చాలా కృంగిపోయాను. డిప్రెషన్ లోకి కూడా వెళ్లిపోయాను. ఆ గాయం నుంచి కోలుకోవడానికి నాకు చాలా సమయమే పట్టింది. అందుకే చాలా కాలం పాటు ఎవరితో బంధంలోకి వెళ్లకూడదని గట్టిగా నిర్ణయం తీసుకున్నానని తెలిపింది.

- Advertisement -
Advertisement

also read:Amitabh Bachchan:అభిమానుల కోసం అమితాబ్ బచ్చన్ బిగ్ రిస్క్..!

మనల్ని మనం ప్రేమించుకుంటే ఏ ఇబ్బందులు ఉండవు..

ఆ మానసిక సంఘర్షణ నుంచి తాను ఎలా బయటపడ్డాను అనే విషయాన్ని కూడా తెలుపుతూ ఈరోజు నేను ఇంత ధైర్యంగా నిలబడడానికి కారణం నాకోసం నేను ఎక్కువగా సమయాన్ని కేటాయించుకోవడమే. ఇతరుల నుంచి ఎలాంటి ఆప్యాయత ఊరట కోసం తాను ఎదురు చూసే దాన్ని కాదు అని, మనల్ని మనం ప్రేమించుకోవడం ఎంతో ముఖ్యము.. కేవలం ప్రేమ వైఫల్యాలే కాదు సమాజంలో చాలామంది యువతులు ఏదో ఒక విషయంలో లైంగిక వేధింపులు, చేదు అనుభవాలను కూడా ఎదుర్కొంటున్నారని తెలిపింది. నా స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి ఎన్నో విషయాలను తెలుసుకున్నానని తెలిపింది.

- Advertisement -
Advertisement

also read:Ramayana:రామాయణం నటీనటుల రెమ్యునరేషన్లు.. ఎవరికి ఎన్ని కోట్లు ఇస్తున్నారో తెలుసా?

బాధను బయటకు చెప్పుకుంటేనే నయం..

ఎన్నో సందర్భాలలో నాకే ఇలాంటివి ఎందుకు ఎదురవుతున్నాయి అని తనని తాను ఎప్పుడు నిందించుకోకూడదు.. బాధల్ని మనసులోనే దాచుకోకుండా ధైర్యంగా బయటికి చెప్పాలి. అప్పుడే ఆ చేదు జ్ఞాపకాల నుంచి మనం బయటపడగలమంటూ రెజీనా తెలియజేసింది. 2012లో ఎస్ఎంఎస్ అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రెజీనా ఆ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, ఎవరు, పవర్, తదితర చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. రెజీనా సినిమాలలోనే కాకుండా పలు రకాల వెబ్ సిరీస్లలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నది. తన కెరీర్ లోనే సరికొత్త పాత్రలతో అలరిస్తూ వ్యక్తిగతంగా ఎదిగిన తీరు చూసి అభిమానులు సైతం రెజీనా పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుత రెజీనా చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you