Monday, November 2, 2026
HomeLATESTMamitha Baiju:మమితా బైజు అసలు పేరు ఏంటో తెలుసా..?

Mamitha Baiju:మమితా బైజు అసలు పేరు ఏంటో తెలుసా..?

Mamitha Baiju: మలయాళ సినీ ఇండస్ట్రీ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న మమిత బైజు అసలు పేరు ఏంటో తెలిసి అభిమానులు కూడా సర్ప్రైజ్ అవుతున్నారు.

on
- Advertisement -banner Ad

Mamitha Baiju:సాధారణంగా సినీ సెలబ్రిటీలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు పేర్లు మార్చుకున్న సందర్భాలను కూడా మనం చూసే ఉన్నాము. అలా స్టార్స్ గా పేరు సంపాదించిన తర్వాత వారి రియల్ పేర్లు తెలుసుకొని అభిమానులు కూడా ఆశ్చర్యపోతుంటారు. అలా ఇప్పుడు దక్షిణాది సినీ ప్రియుల హృదయాలలో చోటు సంపాదించుకొని బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న యంగ్ హీరోయిన్ మమితా బైజు కూడా అలాంటి కోవకే చెందుతారు. అసలు ఈ హీరోయిన్ అసలు పేరు వెనుక ఒక ఆసక్తికరమైన కథ దాగివున్నట్లు తెలుస్తోంది. వాటి గురించి పూర్తిగా చూద్దాం.

మమితకు పెద్దలు పెట్టిన పేరు ఏంటో తెలుసా?

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మమితా బైజు(Mamitha Baiju) తన పేరు ఎలా మారిపోయిందో స్వయంగా అభిమానులతో పంచుకోవడం జరిగింది.. మమిత తెలిపిన వివరాల ప్రకారం ఆమె తల్లిదండ్రులు మొదట ఈమెకు పెట్టిన అసలు పేరు నమిత.. పుట్టినప్పుడు చాలా ముచ్చటపడి ఈ పేరు పెట్టుకున్నారట. అయితే బర్త్ సర్టిఫికెట్ నమోదు చేస్తున్న సమయంలో ఒక చిన్న పొరపాటు వల్ల నమిత కాస్త మమితా గా ముద్ర పడిందట. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే ఇలా మిస్టేక్ పడిన పేరుని ఆమె కుటుంబ సభ్యులు నాలుగైదు సంవత్సరాల వరకు గమనించలేకపోయారట.

- Advertisement -
Advertisement

also read:Regina Cassandra:లవ్ ఫెయిల్యూర్ పై రెజీనా ఎమోషనల్ కామెంట్స్..!

ఆ చిన్న మిస్టేక్ ఇంతకు దారితీసిందా?

అలా మమితా బైజును స్కూల్లో చేర్పించేందుకు సర్టిఫికెట్ పరిశీలిస్తున్న సమయంలో ఈ తప్పు బయట పడిందని అప్పుడే కాలం గడిచిపోవడంతో అధికారిక కాగితాలలో కూడా మమితా పేరు ఖరారు కావడంతో ఇక ఆ పేరు మార్చడానికి కుదరలేదట. పెద్దలకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా ఈ పేరు ఖరారు కావడం జరిగింది. అలా జరిగిన ఒక పొరపాటు వల్లే ఇప్పుడు నమిత కాస్త మమిత బైజుగా పేరు సంపాదించింది. నేడు భారతీయ సినీ ఇండస్ట్రీలోని తిరుగులేని బ్రాండ్ గా పేరు సంపాదించింది ఈ ముద్దుగుమ్మ.

- Advertisement -
Advertisement

also read:Amitabh Bachchan:అభిమానుల కోసం అమితాబ్ బచ్చన్ బిగ్ రిస్క్..!

మమితా బైజు కెరియర్..

2024లో విడుదలైన ప్రేమలు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన మమితా బైజు.. కెరియర్ లోనే ఊహించని బ్రేక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత వరుసగా విజయాలతో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. అలా డ్యూడ్, జననాయగన్, విశ్వనాధ్ అండ్ సన్స్, బెత్లెహాం కుటుంబం యూనిట్ వంటి చిత్రాలలో నటించి , భారీ విజయాలను అందుకుంది. కేవలం నెలల వ్యవధిలోని మూడు వేరువేరు భాషలలో నటించి ఒక్కో సినిమాతో 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం తమిళంలో ఇరందువానమ్, మలయాళం లో హలో డియర్ వంటి చిత్రాలలో నటిస్తోంది. ఈ సినిమాలు కూడా మంచి విజయాలు అందుకోవాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. ఏదిఏమైనా పేరు మార్పు వల్ల మమితా బైజు క్రేజ్ మారిపోయిందని పలువురు నెటిజన్స్ సైతం సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you