Wednesday, July 22, 2026
HomeLATESTAamir Khan:60 ఏళ్లలో మూడో పెళ్లి డేట్ ప్రకటించిన అమీర్ ఖాన్..!

Aamir Khan:60 ఏళ్లలో మూడో పెళ్లి డేట్ ప్రకటించిన అమీర్ ఖాన్..!

Aamir Khan: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మూడో పెళ్లి ప్రకటించారు. ముహూర్తం ఖరారు చేస్తూ పెళ్లి వేదికను అభిమానులతో పంచుకున్నారు.

on
- Advertisement -banner Ad

Aamir Khan:బాలీవుడ్ లో ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటించే హీరోలలో అమీర్ ఖాన్ కూడా ఒకరు. గత కొద్దిరోజులుగా అమీర్ ఖాన్ మూడవ పెళ్లి గురించి పలు రకాల వార్తలు వినిపించాయి. అయితే ఆ విషయం పైన అధికారికంగా ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. గతంలో రెండు సార్లు వివాహం చేసుకున్న అమీర్ ఖాన్ మనస్పర్ధలు కారణం చేత వారితో విడిపోయారు. గత కొంతకాలంగా అమీర్ ఖాన్ గౌరీ స్ప్రాట్(gauri spratt) అనే ఫ్యాషన్ స్టైలిస్ట్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరూ పలు రకాల ఈవెంట్స్ కి కూడా జంటగా హాజరయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకి అధికారికంగా తమ బంధాన్ని ప్రకటించేశారు.

మూడో పెళ్లికి సిద్ధమైన అమీర్ ఖాన్..

అలా తన ప్రియురాలని పరిచయం చేసిన అమీర్ ఖాన్(Aamir Khan) పెళ్లి వార్తలపై తాజాగా రియాక్ట్ అవుతూ ఒక షాకింగ్ విషయాన్ని తెలియజేశారు. ముంబైలో జరిగిన ఒక సినిమా స్క్రీనింగ్ వేడుకలలో పాల్గొన్న అమీర్ ఖాన్.. తన పెళ్లి జూలై 5వ తేదీన జరగబోతోంది అంటూ తెలియజేశారు. అది చాలా చిన్న వేడుక, కేవలం ఇంట్లోనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నామని తెలియజేశారు. జులై 5వ తేదీన తమకు చాలా ప్రత్యేకమైన రోజు అంటూ, ఆ రోజు కేవలం కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య తమ పెళ్లి జరగబోతోంది అంటూ తెలియజేశారు.

- Advertisement -
Advertisement

also read:Samantha:ప్రెగ్నెన్సీలోనూ వర్కౌట్స్ తో దుమ్ము దులిపేస్తున్న సమంత!

అమీర్ ఖాన్ పెళ్లి విడాకులు..

ఈ కొత్త ప్రయాణంలో అందరి ఆశీస్సులు తమ వెంట ఉండాలని కోరారు అమీర్ ఖాన్. తామిద్దరం ఎప్పుడు సంతోషంగా ఉండాలని దీవించాలని మీడియా వేదికగా అభిమానులను కోరారు. అమీర్ ఖాన్ మొదటిసారి 1986లో రీనా దత్తా ను ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు. 2002లో వీరిద్దరూ విడిపోయారు. అయితే వీరికి జునైద్ ఖాన్, ఐరా ఖాన్ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

- Advertisement -
Advertisement

also read:Rajamouli: జక్కన్నకు ప్రపంచం మెచ్చే అరుదైన గౌరవం!

మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్..

రీనా తో విడాకులు తీసుకున్న మూడు సంవత్సరాల తర్వాత 2005లో ప్రముఖ డైరెక్టర్ కిరణ్ రావును ప్రేమించి రెండో వివాహం చేసుకున్నారు. అనంతరం వీరికి ఆజాద్ రావు ఖాన్ అనే కుమారుడు జన్మించారు. పదహారేళ్ల వైవాహిక జీవితానికి 2021లో తెర దించుతూ విడిపోతున్నట్లు ప్రకటించారు. అలా విడిపోయినప్పటికీ ఇద్దరు కలిసి తమ కొడుకు బాధ్యతను చూసుకుంటున్నారు. అలా రెండుసార్లు విడాకులు తీసుకున్నటువంటి అమీర్ ఖాన్ ఇప్పుడు మరొకసారి 60 ఏళ్ల వయసులో గౌరీతో ప్రేమలో పడ్డారు. అంతేకాకుండా పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించడంతో ఈ విషయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైనప్పటికీ అభిమానులు మాత్రం ఈ జంటకు కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you