Wednesday, July 22, 2026
HomeLATESTOTT:కేరళలో జరిగిన రియల్ స్టోరీ.. ఓటీటీలో మెంటలెక్కిస్తున్న మలయాళం మూవీ!

OTT:కేరళలో జరిగిన రియల్ స్టోరీ.. ఓటీటీలో మెంటలెక్కిస్తున్న మలయాళం మూవీ!

OTT: కేరళలో జరిగిన ఒక రియల్ స్టోరీ సంఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన మలయాళం మూవీ ఇప్పుడు ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది.

on
- Advertisement -banner Ad

OTT:కరోనా సమయంలో ఓటీటీలో ఎక్కువమంది సినిమాలు చూడడం చేత అప్పటినుంచి ఎక్కువగా మలయాళం సినిమాలకు భారీ పాపులారిటీ ఏర్పడింది. సస్పెన్స్, క్రైం థ్రిల్లర్, హర్రర్ ఇలా ఏ జోనర్ సినిమాలైనా సరే మలయాళం నుంచి వచ్చిందంటే చాలు కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ మధ్యన కొన్ని రియల్ క్రైమ్ స్టోరీలను కూడా తెరకెక్కిస్తున్నారు. వాటికి కూడా మంచి ఆదరణ లభిస్తుంది. అలాంటి సినిమాలలో ఇప్పుడు మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఒకటి. థియేటర్లలో కాసుల వర్షం కురిపించి ఓటీటీలో కూడా భారీగానే వ్యూస్ రాబట్టుతోంది. మరి ఆ సినిమా ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

కుట్టవం శిక్షయుమ్ మూవీ స్టోరీ!

అదేదో కాదు కుట్టవం శిక్షయుమ్.. స్టోరీ విషయానికి వస్తే.. 2015లో కేరళలో జరిగిన రియల్ నగదు దోపిడీ కేసు ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి కథ అందించిన సీబీ థామస్ కూడా రియల్ లైఫ్ లో ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వడం గమనార్హం. కేరళ ప్రాంతంలోని కాసర్గోడు జిల్లాలో ఈ కథ ప్రారంభమవుతుంది. పెద్ద ఆభరణాల దుకాణంలో అర్థరాత్రి భారీ దొంగతనం జరుగుతుంది. సుమారుగా 1.5 కిలోల బంగారాన్ని దొంగలు దోచుకెళ్తారు. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభిస్తారు. కానీ అక్కడ ఒక క్లూ కూడా దొరకదు చివరికి ఆ కేసును చేదించేందుకు సీఐ సాజాన్ ఫిలిప్ రంగంలోకి దిగుతారు.

- Advertisement -
Advertisement

also read:Aamir Khan:60 ఏళ్లలో మూడో పెళ్లి డేట్ ప్రకటించిన అమీర్ ఖాన్..!

అలా తన బృందంతో కలిసి సాజాన్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. అలా జువెలరీ షాప్ తో మొదలైన దొంగతనం నగరంలో చాలా ప్రాంతాలకు చేరుతుంది . ఉత్తర భారతదేశానికి చెందిన ఒక అంతర్రాష్ట్ర ముఠా అని పోలీసులు గుర్తిస్తారు. దీంతో నిందితులను పట్టుకునేందుకు సాజాన్ తన బృందం ఉత్తరప్రదేశ్ కి వెళ్లగా రాజస్థాన్ సరిహద్దులోని ఒక మారుమూల ప్రాంతానికి వెళ్తారు. అక్కడి నుంచి అసలు కథ ప్రారంభమవుతుంది. అక్కడ కరుడుగట్టిన నేరస్తులకు స్థావరమైన ఆ ప్రాంతంలో అపరిచిత వ్యక్తులు ఎవరు వచ్చినా సరే వారిని కొట్టి చంపేస్తూ ఉంటారు. అంతేకాకుండా అక్కడ లోకల్ పోలీసులు కూడా సాజాన్ టీం కి ఎలాంటి సహకారం అందించరు. మరి నేరస్థుల గ్రామంలో నుండీ సాజాన్ టీం ఎలా బయటపడింది. నిందితులను ఎలా పట్టుకొని అరెస్టు చేశారు అన్నదే ఈ సినిమా కథ.

- Advertisement -
Advertisement

also read:Samantha:ప్రెగ్నెన్సీలోనూ వర్కౌట్స్ తో దుమ్ము దులిపేస్తున్న సమంత!

కార్తీ ఖైదీ మూవీని తలపించిన మూవీ..

ఈ సినిమా స్టోరీ చూస్తే కార్తి నటించిన ఖైదీ సినిమా లాగే ఉంటుంది . అందులో లాగే ఈ సినిమా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండడమే కాకుండా చాలా ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా కనిపిస్తాయి. ఈ సినిమా నెట్ ఫ్లిక్ లో స్ట్రిమింగ్ అవుతోంది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you