ACTOR SREEJITH RAVI:ఎన్నో చిత్రాలలో అద్భుతమైన పాత్రలలో నటించి మంచి పేరు సంపాదించుకున్న నటీనటులు కేవలం ఒక చిన్నపాటి తప్పు చేయడం వల్ల వారి కెరియర్ నే కాకుండా . వారి పరువు మొత్తం పోతుంది..అలా ఇప్పుడు వెండితెర పైన కరుడుగట్టిన విలన్ గా, క్రూరమైన పోలీసు అధికారిగా నటించి మంచి పేరు సంపాదించిన మలయాళ నటుడు శ్రీజిత్ రవికి కోర్టు ఒక గట్టి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చిన్నారుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో నాలుగేళ్ల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం త్రిసూర్ పాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు ఒక సంవత్సరం పాటు కారగార శిక్ష విధిస్తూ ఒక సంచలన తీర్పును వెలువరిచింది.
బాలికలతో సినీ నటుడు అసభ్యకర ప్రవర్తన..
మలయాళ సినీ ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు శ్రీజిత్ రవి తమిళ ప్రేక్షకులకు బాగా సుపరిచితుడు. ముఖ్యంగా కుంకీ చిత్రంలో ఫారెస్ట్ రేంజర్ గా కనిపించి అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత కథాకళి చిత్రంలో కూడా అద్భుతమైన పాత్రను పోషించారు. వెండితెరపై విలనిజం పండించిన ఈ నటుడు నిజజీవితంలో చేసిన ఒక పని ఇప్పుడు ఆయనను జైలు పాలు అయ్యేలా చేసింది..
ALSO READ:Mirchi Madhavi:ప్రకాశ్ రాజ్ భార్య పాత్ర కోసం అలాంటి డిమాండా? మిర్చి మాధవి షాకింగ్ కామెంట్స్
అసలేం జరిగిందంటే?
అసలు విషయంలోకి వెళితే.. 2022లో కేరళలోని త్రిస్సూర్ ప్రాంతంలో ఇద్దరు మహిళలు, బాలికలు తమ అపార్ట్మెంట్లోకి తిరిగి వెళుతున్న సమయంలో ఒక వ్యక్తి కారులో వారిని వెంబడించారట. అంతటితో ఆగకుండా ఆ చిన్నారుల ఎదుట అసభ్యకరంగా ప్రవర్తించారు.. ఈ ఘటన పైన ఆ బాధిత బాలికలు తల్లితండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించగా.. దర్యాప్తులో ఆ వ్యక్తి ప్రముఖ నటుడు శ్రీజిత్ రవి(ACTOR SREEJITH RAVI) అని తేలడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. ఈ విషయంపై పోలీసులు ఆయన పైన పోక్సో చట్టం కింద కేసు నమోదు కూడా చేశారు. ఆ సమయంలో ఆయన బెయిల్ పైన బయటకు వచ్చినా కూడా న్యాయస్థానంలో మాత్రం విచారణ ఏ మాత్రం ఆగకుండా కొనసాగింది.
ALSO READ:Naga Chaitanya:నాగచైతన్య ‘వృషకర్మ’ ట్రైలర్ వచ్చేసింది.. అంచనాలు పెంచేసిన మేకర్స్!
ఏడాది పాటు జైలు శిక్ష.. జరిమానా..
అలా సుమారుగా నాలుగు సంవత్సరాల పాటు కోర్టులో కేసు కొనసాగగా న్యాయస్థానంలో నేరం ఋజువు అవ్వడంతో తాజాగా కోర్టు తీర్పును ప్రకటించారు.. నటుడు శ్రీజిత్ రవికి ఒక సంవత్సరం పాటు కఠినమైన కారగార శిక్షతోపాటుగా 50వేల రూపాయలు జరిమానా విధిస్తూ ఆదేశాలను కోర్టు జారీ చేసింది. ఈ జరిమాణ మొత్తాన్ని బాధిత బాలికలు ఇద్దరికీ సమానంగా నష్టపరిహారం కింద అందజేయాలని కోర్టు క్లారిటీ ఇచ్చింది. సినీ పరిశ్రమలో నటుడుగా మంచి పేరు సంపాదించిన శ్రీజిత్ రవి ఇలాంటి కేసులో శిక్ష పడడంతో ఇప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలోనే ఈ విషయం ఒక సంచలనంగా మారింది. మరి ఈ విషయం పైన నటుడు శ్రీజిత్ కుటుంబం కాని ఆయన కానీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.




