Thursday, November 26, 2026
HomeLATESTChiranjeevi:కాకా.. విశ్వంభర.. చిరంజీవి ఫ్యాన్స్ లో అయోమయం..!

Chiranjeevi:కాకా.. విశ్వంభర.. చిరంజీవి ఫ్యాన్స్ లో అయోమయం..!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర, కాకా సినిమాల విడుదల తేదీల పై ఇప్పుడు అభిమానులలో అయోమయం నెలకొంది.

on
- Advertisement -banner Ad

Chiranjeevi: టాలీవుడ్ బాక్సాఫీస్ వార్ ఎప్పుడు కూడా స్టార్ హీరోల మధ్య జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా కొన్ని పండుగలకు తమ చిత్రాలను విడుదల చేయాలని సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటారు సెలబ్రెటీలు. అలా 2027 సంక్రాంతి బరిలో చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. పండుగ సీజన్ ను క్యాష్ చేసుకొనేందుకు ఇప్పటికే పలు క్రేజీ సినిమాలు కూడా విడుదల తేదీలను ప్రకటించుకున్నాయి. అయితే ఈసారి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న సినిమాల పైన అభిమానులకు మరింత ఉత్కంఠ మొదలయ్యింది.

సంక్రాంతి బరిలో పోటీ పడబోతున్న విశ్వంభర , కాకా..

ఎందుకంటే ఈసారి సంక్రాంతి బరిలో కాకా చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నప్పటికీ.. విశ్వంభరా కోసం సన్నహాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. నిజానికి డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ఎప్పుడో మొదలుపెట్టిన భారీ సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర. ఈ చిత్రాన్ని చాలా కాలం గా రిలీజ్ విషయంలో వాయిదా వేస్తూ ఉన్నారు. అయితే ఈసారి ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలిపేలా నిర్మాతలు భావిస్తున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వాస్తవంగా జనవరి 13న కాకా చిత్రాన్ని రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావించింది. డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇందులో అనస్వర రాజన్ కీలకమైన పాత్రలో నటిస్తోంది. విడుదల తేదీని కూడా చిత్ర బృందం అధికారికంగానే ప్రకటించారు.

- Advertisement -
Advertisement

also read:Anupama parameswaran:భోగి సినిమా ప్రమోషన్స్ కి రాకపోవడం పై.. అనుపమ క్లారిటీ..!

అభిమానులలో మొదలైన నిరుత్సాహం..

కాకా సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని విషయాన్ని కూడా ఎన్నో సందర్భాలలో చిత్ర బృందం తెలియజేసింది. కానీ ఇప్పుడు తాజాగా జనవరి 13న విశ్వంభర సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఒకే రోజు ఒకే హీరో నటించిన రెండు భారీ సినిమాలు పండుగ సీజన్లో పోటీ పడతాయి అనే విషయం ఇప్పుడు మెగా అభిమానుల కొంత నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. ఇప్పటివరకు గ్రాఫిక్స్ పోస్ట్ ప్రొడక్షన్ వల్ల విశ్వాంభర సినిమా వాయిదా పడుతూ వస్తోంది.

- Advertisement -
Advertisement

also read:ACTOR SREEJITH RAVI:బాలికలతో నటుడు అసభ్యకర ప్రవర్తన..కోర్టు తీర్పు ఏమిటంటే..?

తెరపైకి మరో వార్త?

కానీ వినిపిస్తున్న మరో రూమర్ ప్రకారం జనవరి 13న విస్వంభర సినిమాని తీసుకువచ్చి, శివరాత్రికి కాకా సినిమాని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి అనుకున్నట్టుగానే రెండు చిత్రాలను ఒకేసారి విడుదల చేసి సంక్రాంతి హాలిడేస్ లను క్యాష్ చేసుకుంటారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద సినిమాల విడుదల విషయానికి వస్తే.. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న జనవరి 12 సినిమా విడుదల, అలాగే శ్రీ విష్ణు నటించిన ఫ్యామిలీ ప్యాక్ సినిమాతో పాటుగా శర్వానంద్ నటిస్తున్న జార్జ్ క్రిష్, అలాగే సాయి ధరంతేజ్ నటిస్తున్న సంబరాల ఏటి గట్టు సినిమాతో పాటుగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న మహాకాళి చిత్రాలు కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు సంక్రాంతి పండుగకు యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you