Agadha trailer:ఈ మధ్యకాలంలో ఎక్కువగా తరచూ హర్రర్ థ్రిల్లర్ సినిమాలకే ఎక్కువగా ప్రేక్షకులు మక్కువ చూపుతున్నారు. దీంతో చాలామంది దర్శక నిర్మాతలు, నటీనటులు సైతం ఇలాంటి చిత్రాలను తీయడానికే ఇష్టపడుతున్నారు. అలా ఇప్పటికీ ఎన్నో చిత్రాలు విడుదలైనప్పటికీ ఇప్పుడు తాజాగా అగధ అనే సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమాకి సంబంధించి తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ విడుదల చేయగా.. ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరిచేలా ట్రైలర్ కనిపిస్తోంది.
సినిమాపై అంచనాలు పెంచేసిన అగధ ట్రైలర్..
ట్రైలర్ విషయానికి వస్తే.. అగధ అది ఒక మూఢ నమ్మకం అయితే కాదు చీకటి లోకంలో నుంచి పుట్టుకొచ్చే ఒక శక్తి అనే డైలాగ్ తో మొదలై సినిమా ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో అనే విషయాన్ని ట్రైలర్లో చాలా అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా మిస్టరీ, దైవిక శక్తులు, అతీంద్రియ అంశాలతో సరికొత్తగా ఈ సినిమాని తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. ఈ సినిమా స్టోరీ మహిమ మరణం వెనుక కారణమేంటి ? అనే నేపథ్యంలో చూపించినట్లు తెలుస్తోంది. ట్రైలర్(Agadha trailer) కూడా చాలా ఉత్కంఠ పరిచయాల కనిపిస్తోంది.
also read:Tollywood:ఆగస్టు నెలలో విడుదలైయ్యే సినిమాల లిస్ట్ ఇదే..అన్ని సూపర్ హిట్సే..!
ఎవరు ఎలా నటించారంటే?
హీరో శ్రవణ్ రెడ్డి, కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో మిస్టరీకి కీలకంగా.. ఈ సినిమా కథలో పలు పాత్రలు కనిపిస్తున్నాయి. భయం, ఆందోళన నిజాన్ని తెలుసుకోవాలనే ఆలోచనతో ఈ సినిమాని తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. ఈ ట్రైలర్ లో ప్రతి సీను కూడా అదనపు బలాన్ని తీసుకువచ్చిందని చెప్పవచ్చు. డైరెక్టర్ ఎమ్మెస్ రాజు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ట్రైలర్లు కథను చెప్పినట్టే చెప్పి అసలు రహస్యాన్ని మాత్రం చూపించలేదు. ముఖ్యంగా అగధ ఎవరు? ఆ శక్తి ఎలా పుట్టింది? మహిమకు ఏం జరిగింది ? ఆ కుటుంబాన్ని ఎందుకు అగధ వెంటపడుతోంది? మహాదేవి వారిని కాపాడగలుగుతుందా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే ఈ సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే.
also read:Nithin :నితిన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ వైరల్!
ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు..
ఆగస్టు 14వ తేదీన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ వంటి భాషలలో చాలా గ్రాండ్గా విడుదల చేయబోతున్నారు. డైరెక్టర్ ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన.. ఈ మిస్టరీ సినిమా చూడడానికి చాలామంది ప్రేక్షకులు సైతం ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్ LLP బ్యానర్ పైన విశాలాక్షి బలుసు నిర్మించారు. దర్శకుడు ఎం ఎస్ రాజుకు ఏ విధంగా కలిసి వస్తుందో చూడాలి మరి. ఒకవేళ ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు అందుకునే అవకాశం ఉంది.




