Tuesday, August 4, 2026
HomeLATESTNithin :నితిన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ వైరల్!

Nithin :నితిన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ వైరల్!

Nithin: నాని సమర్పణలో నితిన్ హీరోగా నటిస్తున్న కొత్త మూవీ టైటిల్ గ్లింప్స్ మేకర్స్ విడుదల చేశారు. మ్యూజిక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

on
- Advertisement -banner Ad

Nithin :టాలీవుడ్ లో ఎప్పుడూ కూడా విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించే హీరోలలో నేచురల్ స్టార్ నాని, నితిన్ కూడా ఒకరు. ఇప్పుడు తాజాగా వీరిద్దరి క్రేజీ కాంబినేషన్లో ఒక వినూత్న కాన్సెప్ట్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. హీరో నితిన్, నాని నిర్మాణంలో ఒక ఆసక్తికరమైన సినిమా రాబోతోంది. కోర్టు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నాని నిర్మాతగా కూడా బాగానే సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. అలా తన సొంత బ్యానర్ లోనే పలు చిత్రాలను నిర్మిస్తున్నారు.

నాని – నితిన్ మూవీ నుండి టైటిల్ గ్లింప్స్ రిలీజ్..

తాజాగా మురళి కాంత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా చాలా ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు నాని కూడా హాజరయ్యారు. అలియాస్ రుక్మిణి అనే టైటిల్ తో సినిమా రాబోతున్నట్లు ఒక చిన్నపాటి గ్లింప్స్ కూడా విడుదల చేశారు చిత్ర బృందం
అనంతరం మొదటి సన్నివేశానికి సంబంధించి క్లాప్ హీరో నాని కొట్టి సినిమాని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా హీరో నాని సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ప్రేమకథలు ఎప్పుడూ కూడా ప్రత్యేకమైనవి.. అయితే అవి అద్భుతమైన నటీనటులు , భిన్నమైన నేపథ్యం కలిగిన సాంకేతిక నిపుణులు తోడైతే ఆ సినిమాలు మరింత అద్భుతంగా ఉంటాయని తెలిపారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Samantha:సోషల్ మీడియాలో సమంత సంచలన పోస్ట్!

కొత్త కాన్సెప్ట్..

అలాగే హీరో నితిన్(Nithin )తో కలిసి మీ అందరికీ తప్పకుండా నచ్చేలా ఒక అద్భుతమైన చిత్రాన్ని తీసుకురాబోతున్నామంటూ నాని రాసుకొచ్చారు. అంతేకాకుండా అలియాస్ రుక్మిణి సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ వీడియో అందరిని ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ముఖ్యంగా వీడియోలో పెళ్లయిన కొత్త జంట శోభనం గది, కొన్ని ఆసక్తికరమైన పుస్తకాలను చూపించారు. ఆ తర్వాత మరొక వ్యక్తి పూజ చేస్తూ ఉండగా వచ్చిన తన భార్య నా కోరిక తీర్చే వ్రతం లేదా అంటుంది.. అప్పుడే వ్రతం వెంకన్న రచయిత రుక్మిణీ ఎవరు ? అనే ప్రశ్న మొదలవుతుంది.ఈ క్రమంలోనే హీరో నితిన్ ఉదయాన్నే నిద్ర లేచి ఒళ్ళు విరుస్తూ కళ్ళజోడు పెట్టుకొని నా భార్య రుక్మిణి అని చెబుతారు.

- Advertisement -
Advertisement

ALSO READ:OTT:ఈ వారం ఓటీటీలో వినోదాల జాతర.. ఆగస్టు 4 నుంచి ఫుల్ గా కొత్త సినిమాలు..!

నితిన్ ఖాతాలో హిట్?

ముఖ్యంగా నాచురల్ స్టార్ నాని చేతులు మీదుగా వాయిస్ ఓవర్ తో విడుదల చేసిన ఈ గ్లింప్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా కనిపిస్తోంది.ఈ కాంబినేషన్ కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉండడంతో ఈసారి నితిన్ కచ్చితంగా విజయాన్ని అందుకుంటారని అభిమానులు కూడా భావిస్తున్నారు. మరి ఈ సినిమాకి సంబంధించి నటీనటుల విషయాలను త్వరలోనే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించబోతున్నారు. మరి ఈ సినిమాతో హీరో నితిన్ తన కెరీయర్ ను మలుచుకొని మళ్లీ సక్సెస్ బాట పట్టాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి గ్లింప్స్ వైరల్ గా మారుతోంది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you