Thursday, October 1, 2026
HomeLATESTAmithabh Bachchan: హీరో అమితాబ్ బచ్చన్ కు గాయం..!

Amithabh Bachchan: హీరో అమితాబ్ బచ్చన్ కు గాయం..!

Amithabh Bachchan: బాలీవుడ్ బిగ్ బిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న అమితాబ్ బచ్చన్ గాయపడ్డారు. ప్రస్తుతం ఆయనకు ఎలా ఉంది అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు.

on
- Advertisement -banner Ad

Amithabh Bachchan: బాలీవుడ్లో దిగ్గజ నటుడుగా పేరు సంపాదించిన అమితాబ్ బచ్చన్ గురించి , ఆయన యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇప్పటికీ వైవిద్యమైన పాత్రలలో కనిపిస్తూ ప్రేక్షకులను, అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నారు. అలాంటి స్టార్ హీరో తాజాగా గాయపడ్డట్టుగా తెలుస్తోంది.. కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్ 18 రియాలిటీ షోలో షూటింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆయన కింద పడ్డారు. దీంతో అమితాబ్ బచ్చన్ మోకాలికి గాయం అయ్యిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా అమితాబ్ బచ్చన్ తాజా ఎపిసోడ్ లో వెల్లడించారు. సాధారణంగా కేబీసీ షో ప్రారంభంలో అమితాబ్ బచ్చన్ వేదిక మధ్యలో నిలబడి ప్రేక్షకులను ఉద్దేశించి మరీ ప్రసంగిస్తారు. కానీ ఈసారి గాయం వల్ల ఆయన కూర్చొని మరీ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు.

షూటింగ్లో గాయపడ్డ అమితాబ్ బచ్చన్..

ఎపిసోడ్ ప్రారంభంలో వేదిక వద్దకు వచ్చి సీటులో కూర్చొనే సంఘటనను అమితాబ్ బచ్చన్(Amithabh Bachchan) వివరిస్తూ.. సాధారణంగా నేను వేదిక మధ్యలో నిలబడి చెప్పేవాడిని. కానీ ఈరోజు నా మోకాలికి గాయం అయింది. నిన్న షూటింగ్ చేస్తూ ఉండగా జారిపడ్డాను. ఎడమ కాలికి దెబ్బ తగిలింది. ఈ విషయం విన్న వెంటనే సెట్లో ప్రేక్షకులు కూడా ఒక్కసారిగా కంగారుపడ్డారు. అయితే అమితాబ్ బచ్చన్ వెంటనే ప్రేక్షకులను ఓదారుస్తూ గాయం అంత తీవ్రమైనది కాదు పోటీదారులను వేదిక పైకి ఆహ్వానించేటప్పుడు నేను నిలబడతాను.. ప్రస్తుతం అయితే నిలబడడానికి కాస్త కష్టంగా ఉన్నందువల్లే కూర్చున్నానని తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే అటు అభిమానులు కేబీసీ కంటెస్టెంట్స్ అమితాబ్ బచ్చన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

- Advertisement -
Advertisement

also read:Nabha natesh: గ్లామర్ అందాలతో సెగలు పుట్టిస్తున్న నభా నటేష్!

అమితాబ్ బచ్చన్ సినిమాలు..

అమితాబ్ బచ్చన్ 83 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ చురుకుగా కనిపిస్తారు. ప్రస్తుతం ఆయన పెద్ద ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ రిభూ దాస్ గుప్తా దర్శకత్వంలో రాబోతున్న సెక్షన్ 84 అనే కోర్టు డ్రామా చిత్రంలో లీడ్ పాత్రలో నటిస్తున్నారు. ఇందులో డయానా పెంటి, నిమ్రత్ కౌర్ తదితర నటీనటులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కొనసాగుతోంది. తెలుగులో విషయానికి వస్తే ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న కల్కి 2898AD రెండవ భాగంలో అశ్వత్థామ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో కమలహాసన్ కూడా కనిపిస్తారు. అలాగే ఇవే కాకుండా మరికొన్ని ప్రాజెక్టులలో అమితాబ్ బచ్చన్ నటించబోతున్నారు.

- Advertisement -
Advertisement

also read:Bigg Boss 10: బిగ్ బాస్ సీజన్ 10.. ఈ వారం నామినేషన్ లో 9 మంది కంటెస్టెంట్స్..!

అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ డీటెయిల్స్..

అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ విషయానికి వస్తే భార్య జయాబచ్చన్ కూడా ప్రముఖ నటిగా , రాజకీయ నాయకురాలుగా పేరు సంపాదించింది. వీరి కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా బాలీవుడ్ లో హీరోగా మంచి పేరు సంపాదించారు. కోడలు ఐశ్వర్యారాయ్ ప్రపంచ సుందరిగా పేరు సంపాదించడమే కాకుండా బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. అమితాబ్ బచ్చన్ కు ఆరాధ్య బచ్చన్ అనే మనవరాలు కలదు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you