Thursday, October 1, 2026
HomeLATESTDhurandhar 2:బుల్లితెరపై ధురంధర్ 2 ఎప్పుడంటే..?

Dhurandhar 2:బుల్లితెరపై ధురంధర్ 2 ఎప్పుడంటే..?

Dhurandhar 2: ఆదిత్యాదర్ దర్శకత్వంలో రణబీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ 2 సినిమా ఇప్పుడు టీవీలో ప్రసారం అవ్వడానికి సిద్ధం అయ్యింది.

on
- Advertisement -banner Ad

Dhurandhar 2:బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన రణవీర్ సింగ్ హీరోగా, డైరెక్టర్ గా పేరు సంపాదించిన ఆదిత్య ధర్ కాంబినేషన్లో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ధురంధర్. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇండియన్ సినిమాల్లో సరికొత్త రికార్డులను సృష్టించిన ఈ చిత్రం ధురందర్ 2 (Dhurandhar 2): ది రివేంజ్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఓటీటిలో కూడా అద్భుతమైన రెస్పాన్స్ లభించిన ఈ సినిమా ఇప్పుడు బుల్లితెర పైన అలరించడానికి సిద్ధమయ్యింది.

టీవీలోకి రాబోతున్న ధురంధర్ 2..

ఇటువంటి సమయంలోనే మరొకసారి సెన్సార్ చేయబడినట్లు తెలుస్తోంది. ధురంధర్ 2 చిత్రం అక్టోబర్ 18న స్టార్ గోల్డ్ ఛానల్లో ప్రసారం కాబోతోంది. టీవీలో టెలికాస్ట్ అయ్యే చిత్రాలకు మరొకసారి సెన్సార్ చేయవలసి ఉంటుంది అట. ఇందులో భాగంగా ఈ చిత్రాన్ని మళ్లీ సెన్సార్ కి పంపించగా ఏకంగా 45 నుంచి 50 కట్స్ వరకు సూచించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఈ సినిమా చూసే అవకాశం ఉండడంతో ఇందులో కొన్ని అభ్యంతరకరమైన సీన్స్ తొలగించాలని సెన్సార్ ఆదేశాలను జారీ చేసింది.

- Advertisement -
Advertisement

also read:Amithabh Bachchan: హీరో అమితాబ్ బచ్చన్ కు గాయం..!

ఏకంగా 50 కట్స్..

ఆ సీన్స్ డిలీట్ చేసిన తర్వాతే బుల్లితెర ప్రేక్షకులు ఈ సినిమాని చూసే విధంగా.. U/A 16+ సర్టిఫికెట్ ను జారీ చేసినట్లు తెలుస్తోంది. ధురంధర్ 2 చిత్రంలో యాక్షన్ సీన్స్, వైలెన్స్ చాలా ఎక్కువగా ఉండడంతో థియేటర్లలో విడుదలైనప్పుడు సెన్సార్ బోర్డ్ కేవలం పెద్దలకు మాత్రమే ఏ సర్టిఫికెట్ జారీ చేసి సినిమాని విడుదల చేసేలా చేసింది. ఓటీటిలో మాత్రం ఎటువంటి కట్స్ లేకుండా స్ట్రీమింగ్ చేశారు. కానీ ఇప్పుడు బుల్లితెర పైన ప్రసారం చేయడం కోసం మరొకసారి సెన్సార్ చేయగా 50 కి పైగా సీన్స్ కత్తిరించారు. మరి దీంతో దాదాపుగా ఈ సినిమా నిడివిలో 10 నిమిషాల పాటు తగ్గిపోయినట్లు సమాచారం.

- Advertisement -
Advertisement

also read:Nabha natesh: గ్లామర్ అందాలతో సెగలు పుట్టిస్తున్న నభా నటేష్!

ఎలాంటి రేటింగ్ అందుకుంటుందో..

థియేటర్, ఓటిటిలో ప్రభంజనం సృష్టించిన ధురంధర్ 2 ఇన్ని కట్స్ చేసిన తర్వాత టీవీలో ఎలాంటి టిఆర్పి రేటింగ్ సాధిస్తుందో అనే విషయం తెలియాలి. దురంధర్ 1 చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 1300 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ రాబట్టగా.. రెండవ భాగం 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో సారా అర్జున్ హీరోయిన్గా నటించింది. అక్షయ్ ఖన్నా, ఆయేషాఖాన్, అర్జున్ రాంపాల్, దినేష్ పండుర్, రాకేష్ బేడి, సంజయ్ దత్, మాధవన్ తదితర నటీనటులు ఇందులో కీలకమైన పాత్రలలో నటించారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you