Tuesday, August 18, 2026
HomeLATESTAnasuya:యాంకర్ అనసూయ పై పోలీస్ కేసు..!

Anasuya:యాంకర్ అనసూయ పై పోలీస్ కేసు..!

Anasuya: ప్రముఖ సినీనటి అనసూయ పై తాజాగా కేసు ఫైల్ అవ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

on
- Advertisement -banner Ad

Anasuya:టాలీవుడ్ లో నటిగా యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరు సంపాదించుకుంది యాంకర్ అనసూయ. అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో నిత్యం ఆక్టివ్ గా ఉంటూ పలు రకాలు విషయాల పైన స్పందిస్తూ ఉంటుంది. అలాగే సినిమాలకు సంబంధించి అప్డేట్లు నిరంతరం గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉండే అనసూయ పై గత కొద్ది రోజులుగా ఏదో ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా యాంకర్ అనసూయ పైన పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మరి వాటి గురించి పూర్తి వివరాలు చూద్దాం.

అనసూయ పై కేసు ఫైల్..

యాంకర్ అనసూయ తన ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోని షేర్ చేశారు. ఆ వీడియోలో జైశ్రీరామ్ పేరుతో కొంతమంది దాడులు చేస్తున్నారని , సనాతన ధర్మం ముసుగులో పెద్ద దొంగలు కూడా ఉన్నారంటూ వ్యాఖ్యాలు చేసింది. దీనిపైన చాలానే విమర్శలు రావడంతో తన మాటలను వక్రీకరిస్తున్నారని, తాను అందరి హిందువుల గురించి మాట్లాడలేదని అందులో ఉన్న కొంతమంది ముసుగు దొంగల గురించి మాత్రమే చెప్పానంటూ అనసూయ మరో వీడియోని విడుదల చేశారు. అంతేకాకుండా కేవలం మతం పేరుతో అరాచకాలు చేస్తున్న కొందరి గురించి తెలిపానంటూ తెలిపింది..

- Advertisement -
Advertisement

also read:Yash: ఏడు సినిమాలను వదులుకున్న యశ్ !

భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఫైర్..

తాను కూడా రాముడు భక్తురాలినేనని, తన కుమారుడికి కూడా హనుమంతుడి పేరు పెట్టాను అంటూ తెలియజేసింది. అయితే తాజాగా ఈ వివాదానికి సంబంధించి కొంతమంది రాజకీయ నాయకులు హైదరాబాదులో బోరుబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అనసూయ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని మతపరమైన అంశాల పైన మాట్లాడేటప్పుడు కాస్త బాధ్యతగా వ్యవహరించాలంటే పలువురు రాజకీయ నాయకులు పేర్కొన్నారు. మరి ఈ విషయం పైన అనసూయ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.

- Advertisement -
Advertisement

also read:Bigg Boss:”బిగ్ బాస్‌లో గిఫ్టుల పేరుతో మోసం”..మనసులోని బాధని కక్కేసిన పల్లవి ప్రశాంత్..!

అభిమానుల ఆందోళన..

అనసూయ ( Anasuya)కేవలం సినిమాలతోనే కాకుండా సామాజిక, రాజకీయ అంశాల పైన స్పందిస్తూ ఉంటుంది. అలా నిరంతరం ఏదో ఒక విషయంలోనే అనసూయ పేరు వినిపిస్తుంది. ఎక్కువగా మహిళ హక్కుల గురించి మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటుంది. మరి ఇటువంటి తరుణంలోని అనసూయ పైన కేసు ఫైల్ అవ్వడం అటు అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ప్రస్తుతం అనసూయ కి సంబంధించి ఈ న్యూస్ వైరల్ గా మారింది.

- Advertisement -
Advertisement

అనసూయ సినిమాలు..

అనసూయ సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది నాగబంధం సినిమాలో కీలకమైన పాత్రలో నటించింది. ప్రస్తుతం ఫ్లాష్ బ్యాక్, వోల్ఫ్ అనే చిత్రాలలో నటిస్తోంది. అయితే ఈ రెండు చిత్రాలు కూడా తమిళ చిత్రాలే కావడం గమనార్హం. తెలుగులో అయితే ప్రస్తుతం అనసూయ ఏ సినిమాలో కూడా నటించలేదు. 2022లో యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేసింది అనసూయ. అనంతరం సినిమాలలోనే నటిస్తూ బిజీగా ఉంది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you