Tuesday, August 18, 2026
HomeLATESTIrumudi:ఇరుముడి సినిమాలో ఆ 40 నిమిషాలే హైలెట్..!

Irumudi:ఇరుముడి సినిమాలో ఆ 40 నిమిషాలే హైలెట్..!

Irumudi:ఇరుముడి సినిమా చివరి 40 నిమిషాలు వేరు.. ఆడియన్స్ను సీట్ అంచున కూర్చోబెట్టేలా చాలా ఉత్కంఠ భరితంగా ఊహకందని మలుపులతో సాగుతుందని తెలిపారు.

on
- Advertisement -banner Ad

Irumudi:టలీవుడ్ లో మాస్ హీరోగా పేరు సంపాదించిన రవితేజ, విలక్షణమైన చిత్రాలను తెరకెక్కిస్తూ పేరు సంపాదించిన డైరెక్టర్ శివ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఇరుముడి. మైత్రి మూవీస్ మేకర్స్ వారు ఈ సినిమాని భారీ బడ్జెట్ తోనే నిర్మించారు. ఆగస్టు 21న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇప్పటివరకు విడుదలైన పాటలు ,టీజర్, ట్రైలర్ కూడా సినిమా పైన అంచనాలను భారీగా పెంచేశాయి. ఆదివారం రోజున నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ శివ ఈ సినిమాకి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

ఇరుముడి స్టోరీ పై డైరెక్టర్ శివ కామెంట్స్..

డైరెక్టర్ శివ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ పుట్టుక వెనుక ఉన్న ఆలోచన గురించి తెలుపుతూ కూతురికి పూర్తి స్వేచ్ఛనిస్తూ, జీవితంలో ఎలాంటి కష్టం , సమస్య ఎదురైనా సరే తండ్రికి ధైర్యంగా చెప్పుకొని వెసులుబాటు కల్పించే ఒక మధ్య తరగతి తండ్రి ఆవేదన ఆలోచనలు చుట్టూనే ఈ సినిమా స్టోరీ రాసుకున్నానని తెలిపారు. మజిలీ, నిన్ను కోరి వంటి సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ .. ఆ చిత్రాలను సున్నితమైన భాగోద్వేగాలతో తెరకెక్కించారు. అలాంటి సినిమాలు కాకుండా ఇరుముడి(Irumudi) సినిమా పూర్తిస్థాయిలో మాస్ ఎలిమెంట్స్ తో సీరియస్ డ్రామాగా సాగుతుందని వెల్లడించారు.

- Advertisement -
Advertisement

also read:Anasuya:యాంకర్ అనసూయ పై పోలీస్ కేసు..!

సినిమాలో ఆ 40 నిమిషాలే కీలకం..

ఇరుముడి సినిమా చివరి 40 నిమిషాలు వేరు.. ఆడియన్స్ను సీట్ అంచున కూర్చోబెట్టేలా చాలా ఉత్కంఠ భరితంగా ఊహకందని మలుపులతో సాగుతుందని తెలిపారు. ముఖ్యంగా రవితేజ చైల్డ్ ఆర్టిస్ట్ నక్షత్ర మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టిస్తాయని, వారి నటన సినిమాకే హైలెట్ గా ఉంటుందని పేర్కొన్నారు. హీరోయిన్ ప్రియ భవాని శంకర్ కి సినిమాలో మూడు బలమైన సీన్స్ ఉన్నాయని, అలాగే సీనియర్ నటులు సాయికుమార్, అజయ్ ఘోష్ తదితర నటీనటులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:Yash: ఏడు సినిమాలను వదులుకున్న యశ్ !

అక్కడే సినిమా షూటింగ్..

ఈ సినిమాలోని కథ సహజత్వం ఏమాత్రం దెబ్బతినకుండా ఉండేందుకు, పీలేరు పరిసర ప్రాంతాలలో కొన్ని రియల్ లొకేషన్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు డైరెక్టర్ తెలియజేశారు. అలాగే అయ్యప్ప భక్తుల మనోభావాలకు అద్దం పట్టే మల్లెపూల పల్లకి పాట పైన కూడా స్పందిస్తూ.. ఈ పాట చూసి థియేటర్లలో శివతాండవంలా అనుభూతినిస్తోందని తెలిపారు. జీవి ప్రకాష్ అందించిన సంగీతం ఈ సినిమాకి అద్భుతంగా ఉందని తెలిపారు. మరి ఇరుముడి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you