Wednesday, July 22, 2026
HomeLATESTNTR:ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్?

NTR:ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్?

NTR: ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతున్న గాడ్ ఆఫ్ సినిమా వారి చిత్రంలో ఒక బాలీవుడ్ నటుడు కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం.

on
- Advertisement -banner Ad

NTR:టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్(Trivikram), జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం గాడ్ ఆఫ్ వార్. ఈ సినిమా అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి ఈ సినిమా పైన భారీ బజ్ ఏర్పడింది. వీరి కలయికలో గతంలో వచ్చిన అరవింద సమేత సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఎన్టీఆర్(NTR) కెరియర్ లోనే ఒక మరుపురాని సినిమాగా నిలిచింది. మళ్లీ ఇప్పుడు చాలా కాలం తర్వాత వీరి కాంబినేషన్ లోనే ఇతిహాసాల నేపథ్యంలో రాబోతున్న గాడ్ ఆఫ్ వార్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం స్కంద పురాణం లోని సుబ్రహ్మణ్య స్వామి గురించి తెరకెక్కించే కథ అన్నట్లుగా వినిపిస్తోంది.

ఎన్టీఆర్ కొత్త చిత్రంలో బాలీవుడ్ సీనియర్ స్టార్..

హారిక అండ్ హాసిని క్రియేషన్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా , అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ఒక అత్యంత కీలకమైన పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోని రంగంలోకి దించేలా ప్లాన్ చేస్తున్నారట. ఆ పాత్ర సినిమా కథని మలుపు తిప్పేలా ఉంటుందని సమాచారం. ఒకవేళ ఆ హిందీ స్టార్ హీరో నటిస్తే కనుక జాతీయస్థాయిలో ఈ సినిమాకి మరింత క్రేజ్ పెరగడం ఖాయమని, ఉత్తరాది మార్కెట్లో కూడా భారీగానే క్రేజ్ పెరిగే అవకాశం ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో పోషించే పాత్ర మాత్రం చాలా పవర్ ఫుల్ పాత్రగా ఉంటుందట.

- Advertisement -
Advertisement

ALSO READ:Sanjana Galrani:తెలుగు సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ సంజన!

హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ..

థియేటర్లలో ఆ పాత్ర చూస్తే ప్రేక్షకులు విజిల్స్ వేసేలా ఉంటుందని, కథలోని ధైవిక అంశాలకు తగ్గట్టుగానే ఇందులో కొంతమంది నటీనటులను దేవుళ్ళ పాత్రలో కూడా సర్ప్రైజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట త్రివిక్రమ్. హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ , లోతైన ఎమోషన్స్ తో ఒక విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి బజ్ ఎంత పెరుగుతుందో.. ఈ ప్రాజెక్టు చుట్టూ ఒక వివాదం ముసురుకుంది. అదేమిటంటే ఈ సినిమాపై తమిళనాడుకు చెందిన నామ్ తమిళర్ కట్చి పార్టీ ముఖ్య అధినేత , సీమాన్ తీవ్ర అసంతృప్తిని తెలియజేస్తున్నారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Akhil: అఖిల్ ‘లెనిన్’కు బిగ్గెస్ట్ అసెట్ ఇదే.. ఈసారి బ్లాక్‌బస్టర్ ఖాయమా?

త్రివిక్రమ్ – ఎన్టీఆర్ మూవీ స్టోరీపై తమిళ నటుడు మండిపాటు..

తమిళలకు కార్తికేయుడు ప్రాచీన ఆది దైవమని అలాంటి సంస్కృతితో తమిళనాడు ప్రజలకు మంచి బంధం ఉందని తెలియజేశారు. కానీ కార్తికేయుడు ఉత్తరాది రాష్ట్రంలో జన్మించారని తప్పుడు భావన కలిగించేలా చిత్ర యూనిట్ మొత్తం ప్రచారం చేస్తోందంటూ ఫైర్ అయ్యారు. సినిమాల పేరుతో చరిత్రను, దైవిక అంశాలను వ్యతిరేకిస్తే మాత్రం తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ నటుడు, NTK పార్టీ ముఖ్య అధినేత సీమాన్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఇప్పుడు ఈ విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ విషయం పైన చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you