Wednesday, July 22, 2026
HomeLATESTAkhil: అఖిల్ 'లెనిన్'కు బిగ్గెస్ట్ అసెట్ ఇదే.. ఈసారి బ్లాక్‌బస్టర్ ఖాయమా?

Akhil: అఖిల్ ‘లెనిన్’కు బిగ్గెస్ట్ అసెట్ ఇదే.. ఈసారి బ్లాక్‌బస్టర్ ఖాయమా?

Akhil: అఖిల్ అక్కినేని నటిస్తున్న 'లెనిన్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు ఉన్న బిగ్గెస్ట్ అసెట్ ఏంటి? అఖిల్ కెరీర్‌లో తొలి బ్లాక్‌బస్టర్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయా? సినిమా విశేషాలు, తాజా అప్‌డేట్స్, ఫ్యాన్స్‌లో

on
- Advertisement -banner Ad

Akhil: అఖిల్ అక్కినేని పేరుకి ఇండస్ట్రీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉంది. సినీ పరిశ్రమలోకి వచ్చి చాలా కాలమైనప్పటికీ, ఇప్పటివరకు ఆయనకు ఆశించిన స్థాయిలో ఒక్క పెద్ద హిట్ కూడా దక్కలేదు. అయితే ఈసారి మాత్రం ఎలాగైనా సూపర్ హిట్ అందుకోవాలనే కసితో అఖిల్ కనిపిస్తున్నారు. “లెనిన్” సినిమా ప్రమోషన్స్‌లో కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అఖిల్(Akhil) అక్కినేని హీరోగా నటించిన తాజా చిత్రం ‘లెనిన్’ విడుదలకు సిద్ధమైంది.

ట్రైలర్‌ కి అదే హైలెట్:

ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించడంతో సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. ముఖ్యంగా నాగార్జున చెప్పిన “ఇది మహాభారతం” అనే పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్ సోషల్ మీడియాలో మరింత ఆసక్తిని పెంచింది. దీంతో ఈసారి అఖిల్ తప్పకుండా హిట్ కొడతాడనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. అయితే సినీ విశ్లేషకుల దృష్టిని ఆకర్షిస్తున్న అంశం మాత్రం మరోటి. సినిమాపై మంచి పాజిటివ్ బజ్ ఉన్నప్పటికీ, అధిక హైప్ లేకపోవడమే ‘లెనిన్’కు బిగ్గెస్ట్ ప్లస్ కావచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల చాలా సినిమాలు భారీ ప్రమోషన్స్‌తో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచినా, కంటెంట్ ఆ స్థాయిలో లేకపోవడంతో నిరాశపరిచాయి.

- Advertisement -
Advertisement

also read:Regina Cassandra:నక్క తోక తొక్కిన రెజీనా..టాప్ హీరోయిన్స్ కుల్లుకునే ఛాన్స్ కొట్టేసింది..!

‘లెనిన్’ కి అదే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్:

కానీ ‘లెనిన్’ మేకర్స్ మాత్రం ఆ దారిలో వెళ్లడం లేదు. సినిమాకు ఎంత అవసరమో అంత మేరకే ప్రమోషన్స్ నిర్వహిస్తూ, ఓవర్ హైప్ సృష్టించకుండా ముందుకు వెళ్తున్నారు. దీంతో ప్రేక్షకుల్లో సినిమాపై సహజమైన ఆసక్తి పెరుగుతోందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వ్యూహమే సినిమాకు బాగా కలిసొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో గతంలో భారీ అంచనాల మధ్య విడుదలై, కంటెంట్ బలహీనంగా ఉండటంతో నిరాశపరిచిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అయితే ‘లెనిన్’ విషయంలో చిత్రబృందం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. సినిమా కాన్సెప్ట్ ఏమిటి? ప్రేక్షకులకు ఏమి చూపించాలనుకుంటున్నారు? అనే విషయాలనే ఇంటర్వ్యూల్లో ప్రధానంగా చెబుతున్నారు. అంతేకానీ, రూ.100 కోట్లు, రూ.1000 కోట్ల వసూళ్లు లేదా ఇండస్ట్రీ హిట్ వంటి భారీ ప్రకటనలు చేయడం లేదు.

- Advertisement -
Advertisement

also read:Tollywood:టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్..రూట్ మార్చుతున్న స్టార్ డైరెక్టర్లు!

ఈసారి అఖిల్‌కు హిట్ కన్ఫామ్:

ఈ విధమైన ప్రమోషన్ స్ట్రాటజీ వల్ల ప్రేక్షకుల్లో సినిమాపై మరింత పాజిటివ్ ఫీలింగ్ ఏర్పడింది. ఈసారి అఖిల్‌కు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సక్సెస్ దక్కే అవకాశాలు ఉన్నాయని అభిమానులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అఖిల్ కి జోడిగా మొదటిసారి భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse) నటిస్తోంది.’లెనిన్’ చిత్రం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన తర్వాత స్పందన ఎలా ఉంటుందనే దానిపై ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమాపై పాజిటివ్ బజ్ కొనసాగుతోంది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you