Thursday, November 12, 2026
HomeLATESTPoonam Kaur:పవన్ కళ్యాణ్ విడాకుల వేళ.. పూనమ్ కౌర్ పోస్ట్ వైరల్..!

Poonam Kaur:పవన్ కళ్యాణ్ విడాకుల వేళ.. పూనమ్ కౌర్ పోస్ట్ వైరల్..!

Poonam Kaur: పవన్ కళ్యాణ్ తన మూడవ భార్య అన్నా తో కూడా విడాకులు తీసుకున్న వేళ పూనమ్ కౌర్ చేసిన పోస్టు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది

on
- Advertisement -banner Ad

Poonam Kaur:తెలుగు సినీ ఇండస్ట్రీలో సినీ హీరో , జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎలాంటి చిన్న వార్త వచ్చినా సరే వాటిపైన కచ్చితంగా స్పందిస్తూ ఉంటుంది హీరోయిన్ పూనమ్ కౌర్. ముఖ్యంగా ఈమె చేసే ట్వీట్ కోసం నెటిజన్స్ సైతం ఆసక్తికరంగా ఎదురు చూస్తుంటారు. గడిచిన కొన్నేళ్లుగా అటు పవన్ కళ్యాణ్ పైన ఇటు ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పైన చేసే కామెంట్స్ సోషల్ మీడియాలో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి.

పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకున్న వేళ పూనమ్ సంచలన పోస్ట్..

తాజాగా పవన్ కళ్యాణ్ ఆయన మూడో భార్య అన్నా లెజినోవా పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్టు వార్తలు బయటకు రావడంతో అటు సినీ సెలబ్రెటీలే కాకుండా రాజకీయ నాయకులు అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. ఈ విషయం పైన ఎవరూ కూడా స్పందించకూడదంటూ రాజకీయ పార్టీ నేతలు కూడా తమ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇటువంటి సందర్భంలోనే పూనమ్ కౌర్ (Poonam Kaur)చేసిన ఒక మిస్టరీ కామెంట్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ కు తనకు మధ్య త్రివిక్రమ్ అడ్డగోలుగా నిలిచారని పవన్ చుట్టూ ఉన్న కోటగిరి తనను ఆ దారిలోకి రాకుండా చేశారంటూ పూనమ్ కౌర్ గత కొన్నేళ్లుగా ఆరోపణలు చేస్తూనే ఉంది..

- Advertisement -
Advertisement

also read:Aishwarya Lekshmi:జిమ్‌లో చెమటలు చిందిస్తున్న మలయాళ బ్యూటీ.. ఫొటోలు వైరల్!

పూనమ్ పాత ట్వీట్ బయటకు తీసిన పూనమ్..

దీంతో అసలు వీరి ముగ్గురు మధ్య ఏం జరిగింది? ఇందులో త్రివిక్రమ్ పాత్ర ఏంటి ? అనే విషయం పైన మాత్రం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత కూడా రాలేదు. పూనమ్ కౌర్ కూడా ఈ విషయాలపైన పూర్తి వివరాలు బయట పెట్టకుండా, కొన్నిసార్లు పేర్లు ప్రస్తావిస్తూ మరొకసారి పేర్లు ప్రస్తావించకుండా చురకలు అంటిస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ విడాకుల వేళ ఒక నెటిజన్ పూనమ్ కౌర్ పాత పోస్టుని తవ్వి తీశారు.. మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం అయ్యింది అంటూ ఆమెకు ట్విట్టర్ వేదికగా ఒక కామెంట్ చేయగా , ఈ విషయం పైన పూనమ్ కౌర్ రిప్లై ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

- Advertisement -
Advertisement

also read:Priya Bhavani Shankar:సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ప్రియా భవాని శంకర్..!

నిజాలు బయటకు వస్తాయంటూ పోస్ట్..

నెటిజన్ చేసిన కామెంట్ కు స్పందిస్తూ.. భవిష్యత్తులో నిజం మరింత గెలిచి తీరుతుంది. మరిన్ని నిజాలు బయటికి వస్తాయి ప్రతి ఒక్కరికి మనశ్శాంతి సమస్యల నుంచి పరిష్కారం లభించాలని కోరుకుంటున్నాను అంటూ పూనమ్ కౌర్ క్రిప్టిక్ పోస్ట్ షేర్ చేసింది. ఈ ట్వీట్ లో ఆమె ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ పేరును కానీ ఆయన విడాకుల ప్రస్తావనని కానీ తీసుకురాలేదు. కానీ సరిగ్గా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలో ఇలాంటి పరిస్థితి జరిగిన వెంటనే ముందు ముందు మరిన్ని నిజాలు బయటికి వస్తాయని చెప్పడంతో ఆమె పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి కామెంట్స్ చేశారంటూ నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి ఇన్నాళ్లు బయటపెట్టని నిజాలను భవిష్యత్తులోనైనా పూనమ్ కౌర్ బయట పెడుతుందేమో చూడాలి మరి. ఈ విషయం మాత్రం వైరల్ గా మారింది..

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you