Wednesday, November 11, 2026
HomeLATESTTollywood:టాలీవుడ్‌లో మరో బిగ్ సెలబ్రిటీ విడాకులు.. ఫ్యాన్స్ కి బిగ్ షాక్!?

Tollywood:టాలీవుడ్‌లో మరో బిగ్ సెలబ్రిటీ విడాకులు.. ఫ్యాన్స్ కి బిగ్ షాక్!?

Tollywood:టాలీవుడ్‌కు చెందిన మరో ప్రముఖ మహిళా సెలబ్రిటీ విడాకుల వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

on
- Advertisement -banner Ad

Tollywood:సినీ పరిశ్రమలో ప్రేమ, పెళ్లి, విడాకులకు సంబంధించిన వార్తలు తరచూ తెరపైకి వస్తుంటాయి. ముఖ్యంగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లో చోటుచేసుకునే పరిణామాలు అభిమానులతో పాటు సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చకు దారితీస్తుంటాయి. తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ తన భార్య అన్నా లెజినోవాతో విడిపోతున్నట్లు ప్రకటించడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌కు చెందిన మరో ప్రముఖ మహిళా సెలబ్రిటీ విడాకుల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

పవన్ కల్యాణ్ – అన్నా లెజినోవా సంయుక్త ప్రకటన :

పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు నవంబర్ 9న సంయుక్త ప్రకటన విడుదల చేసారు. తమ జీవితంలోని ఒక ముఖ్యమైన ప్రయాణాన్ని కలిసి సాగించిన తర్వాత పరస్పర అవగాహన, గౌరవంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు వారు వెల్లడించారు.

- Advertisement -
Advertisement

అయితే భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ మంచి స్నేహితులుగా కొనసాగుతామని స్పష్టం చేశారు. ముఖ్యంగా తమ పిల్లల భవిష్యత్తు, ఆనందం, శ్రేయస్సు విషయంలో ఇద్దరూ కలిసి బాధ్యత తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ ప్రకటనతో పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. రాజకీయ, సినీ వర్గాల్లోనూ ఈ అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది.

also read:Priya Bhavani Shankar :పెళ్లి చేసుకోనున్న ఇరుముడి హీరోయిన్.. కాబోయే భర్త ఎవరంటే?

- Advertisement -
Advertisement

టాలీవుడ్‌లో మరో స్టార్ విడాకులు? :

ఇదిలా ఉంటే టాలీవుడ్‌కు (Tollywood)చెందిన మరో ప్రముఖ మహిళా సెలబ్రిటీ విడాకుల వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఏడాది మంచి విజయాన్ని అందుకున్న ఓ ప్రముఖ మహిళా సెలబ్రిటీ ఇప్పటికే తన భర్తతో పరస్పర అంగీకారంతో విడాకుల ప్రక్రియను పూర్తి చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అంతేకాకుండా ప్రస్తుతం ఆమె తన పిల్లలతో కలిసి హైదరాబాద్‌లో నివసిస్తున్నట్లు పలు కథనాలు వినిపిస్తున్నాయి. అయితే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ విషయాన్ని బయటకు వెల్లడించేందుకు ఆమె ఆసక్తి చూపడం లేదనే ప్రచారం కూడా సాగుతోంది. కానీ ఈ వార్తలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదు. దీంతో ఆ సెలబ్రిటీ ఎవరనే విషయంపై నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

- Advertisement -
Advertisement

also read:Tarun Bhaskar:పెళ్లిపై.. తరుణ్ భాస్కర్ షాకింగ్ కామెంట్స్..!

గతంలోనూ విడాకులు తీసుకున్న టాలీవుడ్ ప్రముఖులు :

గతంలోనూ తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు తమ వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. స్టార్ హీరోయిన్ సమంత, అక్కినేని నాగచైతన్య విడాకుల వ్యవహారం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అలాగే నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ కూడా తమ వివాహ బంధాన్ని ముగించారు.

మరోవైపు కోలీవుడ్‌లో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ విడిపోవడం కూడా అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు టాలీవుడ్‌లో మరో సెలబ్రిటీ విడాకుల వార్తలు ప్రచారంలోకి రావడంతో ఆసక్తి నెలకొంది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you