Priya Bhavani Shankar:ఈ ఏడాది చాలామంది సెలబ్రిటీలు బ్యాచిలర్ లైఫ్ ను వీడి వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఈరోజు ప్రముఖ సింగర్ అనిరుధ్, SRH అధినేత కావ్య మారన్ వివాహం జరగనుంది. అలాగే మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ వివాహం కూడా డిసెంబర్ నెలలో జరగనుంది. మరో యంగ్ హీరో తేజ సజ్జా కూడా త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఒక హీరోయిన్ నిన్నటి రోజున ఎంగేజ్మెంట్ చేసుకొని ఈరోజు వివాహం చేసుకొని సడన్ షాక్ ఇచ్చింది అభిమానులకు. ఆ హీరోయిన్ ఎవరో కాదు ఇరుముడి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న హీరోయిన్ ప్రియా భవాని శంకర్.
పెళ్లి చేసుకున్న ప్రియా భవాని శంకర్..
ఇరుముడి చిత్రంలో రవితేజ భార్యగా.. ఒక పాపకు తల్లిగా అద్భుతంగా నటించింది. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే.. నిన్నటి రోజున తన ప్రియుడు రాజ్ వేల్ రాజ్ తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేయగా.. త్వరలోనే వివాహం చేసుకుంటారని అందరూ భావించినప్పటికీ.. కానీ తాజాగా ఈ ముద్దుగుమ్మ వివాహం చేసుకున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ALSO READ:Bhanupriya:ప్రేమించి పెళ్లి చేసుకున్న భానుప్రియ జీవితంలో ఇంత విషాదమా?
సింపుల్గా వివాహం..
గడిచిన పదేళ్లుగా రాజ్ తో ప్రేమలో ఉందని, ఈ విషయాన్ని చాలా రోజుల క్రితమే ఆమె రివీల్ చేసింది. అయితే ఇప్పుడు తాజాగా ఎలాంటి హడావిడి లేకుండా వివాహ బంధంలోకి చాలా సింపుల్ గా అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది. ఈ విషయం విన్న అభిమానులు సైతం ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నవంబర్ 11 న అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా వీరి వివాహం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:Samantha:సమంత బిజినెస్ సీక్రెట్స్ ఇవే.. మహిళలకు ఇచ్చిన సలహాలు వైరల్!
ప్రియా భవాని శంకర్ కెరియర్..
ప్రియా భవాని శంకర్ (Priya Bhavani Shankar)కెరియర్ విషయానికి వస్తే.. మొదట టెలివిజన్ రంగంలో యాంకర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. తమిళ ఇండస్ట్రీలో వరుసగా స్టార్ హీరోల చిత్రాలలో నటించి బాగానే పేరు సంపాదించుకుంది. కళ్యాణం కమనీయం, భీమా, జీబ్రా, ఇండియన్ 2, డెమొంటేకాలనీ 2, బ్లాక్, ఇరుముడి తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ప్రియా భవాని శంకర్, నాగచైతన్య నటించిన ధూత అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది. రవితేజ తో నటించిన ఇరుముడి సినిమా ఈమె కెరియర్ లోనే ఒక మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం ప్రియా భవాని శంకర్ చేతుల డెమొంటే కాలనీ 3, ఇండియన్ 3 చిత్రాలతో పాటుగా మరో తమిళ సినిమా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఎటువంటి హడావిడి లేకుండా సైలెంట్ గా వివాహం చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
PBK Marriage❤💍
Priya Bhavani Shankar tied the knot with her longtime boyfriend Raj Velu🫂
#PriyaBhavaniShankar #Wedding https://t.co/TVXL2MmnoM
— Movie Buff (@moviesbuff_) November 11, 2026




