ప్రముఖ హీరోయిన్ ఈషా రెబ్బ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం , అభినయంతో, నటనతో ఆకట్టుకుంటూ ఎప్పటికప్పుడు అభిమానుల హృదయాలను దోచుకుంటుంది
ఇప్పటికే పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ఇటీవల ఓం శాంతి శాంతి శాంతిః సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
ఈమె తన సినిమాల కంటే కూడా ఈమధ్య ప్రముఖ డైరెక్టర్ తరుణ్ భాష్కర్ తో రిలేషన్ లో ఉందనే రూమర్లను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
రహస్యంగా రిలేషన్ కొనసాగిస్తున్నారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ జంట ఈ విషయంపై ఎక్కడా స్పందించడం లేదు.
ఇకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. తాజాగా గోల్డెన్ కలర్ పట్టు లెహంగాలో కనిపించి పుత్తడి బొమ్మల అందరి దృష్టిని ఆకట్టుకుంది.
ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.