Paradise Teaser:టాలీవుడ్లో నాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రాలలో ది ప్యారడైజ్ సినిమా కూడా ఒకటి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, గ్లింప్స్ భారీగా సినిమా పైన అంచనాలను పెంచేశాయి. దీంతో ఈ సినిమా కోసం, సినిమా అప్డేట్ల కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ సైతం ఎప్పుడు వస్తుందనే విషయం పైన ప్రకటిస్తూ అదిరిపోయే అప్డేట్ ప్రకటించింది చిత్ర బృందం.
ప్యారడైజ్ టీజర్ డేట్ లాక్..
ఈ సినిమా టీజర్ ఆగస్టు ఆరవ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ప్యారడైజ్ మూవీ టీజర్ 1 నిమిషం 35 సెకండ్లతో తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. నాని గత సినిమాలకు భిన్నంగా ఇప్పటివరకు చూడని మాస్ అవతారంలో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో భారీ విజయాన్ని అందుకున్న దసరా సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తో ఇప్పుడు కలిసి ఈ ప్రాజెక్టు చేయడంతో సినిమా పైన అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తన మాస్ టేకింగ్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
also read:Korean kanakaraju:అదరగొట్టేస్తున్న వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు ట్రైలర్..!
టీజర్ పై అంచనాలు పెంచుతున్న టీమ్..
ఈ చిత్రానికి సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతాన్ని అందిస్తూ ఉండడం మరింత హైలెట్గా నిలిచింది. ఇందులో హీరోయిన్గా కాయాదులోహర్ నటిస్తోంది. అలాగే మోహన్ బాబు, సోనాలి కులకర్ణి తదితర నటీనటులు ఇందులో నటిస్తున్నారు. మరి ఆగస్టు ఆరవ తేదీన విడుదల కాబోతున్న టీజర్ సినిమా పైన ఎలాంటి క్రేజీ పెంచుతుందో తెలియాలి అంటే ఆగస్టు ఆరవ తేదీ వరకు ఆగాల్సిందే.
also read:TV:’మా బోనాల జాతర’లో అసలు సర్‌ప్రైజ్ ఇదే.. అమూల్య-నిరంజన్ జంట వైరల్..!
ఆగస్టు 21న విడుదల..
ఆగస్టు 21వ తేదీన ప్యారడైజ్ సినిమాని విడుదల చేయబోతున్నారు. దీంతో చిత్ర బృందం ఆగస్టు నెల అంతా కూడా ప్రమోషన్స్ కి కేటాయించేలా ప్లాన్ చేస్తోంది. అంతేకాకుండా ఆగస్టు 21వ తేదీన రవితేజ డైరెక్టర్ శివ నిర్వహణ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఇరుముడి. ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ కూడా సినిమా అంచనాలను పెంచేసింది. మరి బాక్సాఫీస్ వద్ద ఎవరు గెలుస్తారో చూడాలి.




