Wednesday, September 30, 2026
HomeLATESTAmala Paul:ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్ చేసిన అమలాపాల్..!

Amala Paul:ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్ చేసిన అమలాపాల్..!

Amala Paul: ప్రముఖ హీరోయిన్ అమలాపాల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని, ఇండస్ట్రీ గురించి, డైరెక్టర్స్ గురించి తనదైన శైలిలో స్పందించింది.

on
- Advertisement -banner Ad

Amala Paul:టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్లలో అమలాపాల్ కూడా ఒకరు. గడచిన కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ నిరంతరం సోషల్ మీడియాలో తన కుటుంబానికి సంబంధించి ఏదో ఒక విషయంలో వైరల్ గా మారుతుంది. తాజాగా అమలాపాల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఒక ఈవెంట్ లో పాల్గొన్న ఈమె.. దక్షిణాది సినీ పరిశ్రమలో హీరోయిన్లను సరిగ్గా చూసుకోవడం లేదనే విమర్శలు పైన స్పందించింది.

సినీ పరిశ్రమను నిందించడం తప్పు..

ఈ విషయం పైన అమలాపాల్(Amala Paul) మాట్లాడుతూ..” ఈ విషయంపై పూర్తిగా సినీ పరిశ్రమను నిందించడం సరైన పద్ధతి కాదని తేల్చి చెప్పారు. కొన్ని చిత్రాలలో మహిళలను చూపించే విధానం కూడా సరిగ్గా లేకపోవడానికి ఇండస్ట్రీ కారణం కాదని, అది కేవలం సినిమా టీం లేదా డైరెక్టర్ ఆలోచన లోపం అయ్యి ఉండవచ్చని అమలాపాల్ తెలియజేసింది. ఏదేమైనా కాలం మారుతుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో లేడి ఓరియెంటెడ్ చిత్రాలు కూడా ఎక్కువగా వస్తున్నాయనే విషయాన్ని గుర్తు చేసింది. తాను ఇండస్ట్రీ లోకి వచ్చి 15 ఏళ్లు పైనే అయింది. ప్రస్తుతం మహిళలు తమకు తగిన స్థానం కోసం తీవ్రంగా కష్టపడుతున్నారంటూ తెలిపింది.

- Advertisement -
Advertisement

also read:Chiranjeevi: ఓటీటీ షోకి హోస్టుగా చిరంజీవి..!

మార్పు వస్తుందని నమ్ముతున్నాను..

ఇటువంటి మార్పు రాబోయే రోజులలో మరింత సానుకూల వాతావరణాన్ని కలిగిస్తాయని నమ్ముతున్నారని, ఇవే కాకుండా తన కెరీర్లో ఎప్పుడూ కూడా ఒకే రకమైన పద్ధతి గల పాత్రలు కాకుండా సరికొత్త కథల సినిమాలు చేయడానికి తాను ఇష్టపడతానని తెలిపింది. అలా 2019లో అడై లాంటి బోల్డ్ రిస్క్ ఉన్న సినిమాను కూడా చేశానని గుర్తుచేసుకుంది. ఆ సమయంలో తన ఇమేజ్ ఏమవుతుంది? అనే భయం, మళ్లీ అలాంటి పాత్రలే వస్తాయేమో అనే ఆందోళన కూడా ఉండేది. కానీ ఇన్ని సంవత్సరాల అనుభవం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఆరోజు చేసిన ఆ సాహసమే చాలా పెద్దది అనిపించింది. ఇప్పుడు మాత్రం మళ్ళీ అలాంటి సినిమాలు చేయలేనంటూ నిజాయితీగా తెలియజేసింది అమలాపాల్.

- Advertisement -
Advertisement

also read:NTR:రాజమౌళి కుటుంబం పై ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్..!

అమలాపాల్ సినిమా కెరియర్..

అమలాపాల్ సినీ కెరియర్ విషయానికి వస్తే.. 2009లో నీల తామర అనే మలయాళ సినిమాతో తన సినీ కెరియర్ ని మొదలుపెట్టిన అమలాపాల్ ఆ తర్వాత తమిళ్ , మలయాళం వంటి చిత్రాలలో నటించింది. తెలుగులో బెజవాడ అనే సినిమాతో అలరించిన ఈమె.. ఆ తర్వాత నాయక్, ఇద్దరమ్మాయిలతో, జెండాపై కపిరాజు, పిట్ట కథలు తదితర చిత్రాలలో నటించింది. చివరిగా 2024లో 11 క్రాస్ అనే సినిమాలో నటించింది. అమలాపాల్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. 2014లో ప్రముఖ డైరెక్టర్ విజయ్ ని ప్రేమించి వివాహం చేసుకున్న ఈమె.. 2017లో మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుంది. అనంతరం 2023 నవంబర్ 5వ తేదీన జగత్ దేశాయ్ ను ప్రేమించి, వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమారుడు కూడా జన్మించారు. ఏది ఏమైనాప్పటికీ ఈ మధ్యకాలంలో అమలాపాల్ సినిమాలలో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తోంది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you