Rithu Chowdary: బిగ్ బాస్ జోడిగా సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించిన జంటలలో రీతూ చౌదరి, డిమోన్ పవన్ జంట కూడా ఒకటి. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలో వివాహం చేసుకోబోతున్నారని రూమర్స్ కూడా వినిపించాయి కానీ ఈ విషయం పైన ఎక్కడ అధికారికంగా వీరు ప్రకటించలేదు. కానీ తాజాగా తన అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్ అయితే చెప్పుకొచ్చారు గత కొన్ని రోజులుగా తమ మధ్య విభేదాలు వచ్చాయని జరుగుతున్న ప్రచారానికి చెక్ పెడుతూ తమ సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.
స్నేహానికి ముగింపు..
ఇకమీదట తమ మధ్య ఉన్న స్నేహబంధం కూడా పూర్తిగా ముగిసిపోయిందని ఒక ఎమోషనల్ నోట్ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో రీతూ చౌదరి, డిమాండ్ పవన్ పోస్ట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా కూడా ఒకరినొకరు ఫాలో చేసుకుని బ్లాక్ కూడా చేసుకున్నామంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా రీతూ చౌదరి(Rithu Chowdary)తో ఉన్న సంబంధం పైన వస్తున్న ట్రోల్స్, నెగిటివిటీ ఫేక్ రూమర్స్ చాలా దారుణంగా ఉన్నాయని.. బిగ్బాస్ హౌస్లో కనిపించేది నిజ జీవితంలో జరిగేది మాత్రం వేరువేరుగా ఉంటాయనే విషయాలు గుర్తించాలి.. మేము ఇద్దరం ఎవరు ఎవరిని వాడుకోలేదు అది ఒక పరస్పర స్నేహబంధం మాత్రమే అంటూ తెలిపారు పవన్.
also read:Devara 2: దేవర 2 అసలు ఉంటుందా? లేదా? క్లారిటీ ఇచ్చేది ఎవరు..?
వాట్సప్ ఇన్స్టాగ్రామ్ బ్లాక్..
కానీ గత కొన్ని నెలలుగా మా మధ్య వ్యక్తిగత సమస్యలు గొడవలు జరుగుతున్నాయని ప్రచారం వినిపిస్తోంది పరిస్థితులు అదుపుతప్పడంతో మనశ్శాంతి కోసమే ఇద్దరు విడివిడిగా ప్రాజెక్టులు చేయాలని నిర్ణయించుకున్నామని, ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా మేమిద్దరం ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్న అలాగే బ్లాక్ లిస్టులో కూడా ఉంచేసాము.. రీతూ చౌదరి వాట్సాప్, స్నాప్ చాట్ లో నన్ను బ్లాక్ చేసింది నేను కూడా ఇంస్టాగ్రామ్ నుంచి ఆమని తీసేసాను ఆ తర్వాతే రీతు ఇన్స్టాగ్రామ్ కూడా నన్ను బ్లాక్ చేసింది నేనైతే తనకు సంబంధించి ఎలాంటి పాత పోస్టులను డిలీట్ చేయలేదు ఇకపైన రివాన్ అనే కాంబినేషన్ ఉండదు అంటూ తెలిపారు.
also read:Sree Mukhi: స్టైలిష్ లుక్ లో శ్రీముఖి గ్లామర్ అందాలు.. ఫోటోలు వైరల్!
నేటిజన్స్ కోరిన డిమోన్ పవన్..
అలాగే నేటిజన్స్కు ఒక సూచన ఇస్తూ ఇక మీదట అనవసరమైన ఊహాగానాలు ఆపి మా ప్రైవసీని గౌరవించి మాకు కొంచెం మనశ్శాంతి ఇవ్వాలని కోరుకుంటున్నాను అని డెమోన్ పవన్ తన పోస్టులో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు సైతం తీవ్ర నిరాశతో ఉన్నారు. రీతూ చౌదరి, డిమోన్ పవన్ ఇద్దరూ కూడా చాలా క్యూట్ గా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లలో ఫోటోలు వీడియోలు చేస్తే బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు విడిపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. మరి వీరిద్దరి మధ్య అసలు ఏం జరిగింది అనే విషయం పైన రీతూ చౌదరి ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి మరి.
View this post on Instagram




