Wednesday, September 30, 2026
HomeLATESTAllu Sirish:లౌడ్ స్పీకర్లపై లొల్లి.. అల్లు శిరీష్ కి నెటిజన్ ఘాటు కౌంటర్..!

Allu Sirish:లౌడ్ స్పీకర్లపై లొల్లి.. అల్లు శిరీష్ కి నెటిజన్ ఘాటు కౌంటర్..!

Allu Sirish:అల్లు శిరీష్ ఫిర్యాదుపై స్పందించిన కొందరు నెటిజన్లు సినిమా ఈవెంట్లు, ఆడియో లాంచ్‌లు, ఇతర వినోద కార్యక్రమాలను కూడా ప్రస్తావిస్తున్నారు. రాత్రివేళల్లో జరిగే సినిమా కార్యక్రమాలు, పబ్‌ల నుంచి వచ్చే శబ్దాల విషయంలోనూ ఇదే స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారా?

on
- Advertisement -banner Ad

Allu Sirish:హైదరాబాద్‌లో అర్ధరాత్రి వేళ వినిపించిన భారీ శబ్దాలపై టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ చేసిన ఫిర్యాదు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. రాత్రి వేళల్లో అనుమతించిన పరిమితికి మించి లౌడ్ స్పీకర్లు వినియోగించడంపై ఆయన హైదరాబాద్ పోలీసులను ట్యాగ్ చేస్తూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కొందరు నెటిజన్లు శిరీష్‌కు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు మాత్రం ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.

అర్ధరాత్రి వరకు భారీ శబ్దాలు.. పోలీసులకు అల్లు శిరీష్ ఫిర్యాదు:

తాను షేక్‌పేట్‌లోని అపర్ణ వన్ సొసైటీలో నివసిస్తున్నట్లు పేర్కొన్న అల్లు శిరీష్.. సమీపంలోని వినోభా నగర్ హనుమాన్ ఆలయం వైపు నుంచి అర్ధరాత్రి సమయంలో పెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయని సోషల్ మీడియా ద్వారా పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. గణేష్ నిమజ్జనం కార్యక్రమం పూర్తయినప్పటికీ రాత్రి 2 నుంచి 3 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వినిపించడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
Advertisement

రాత్రి సమయంలో శబ్ద కాలుష్యానికి సంబంధించిన నిబంధనలు అమల్లో ఉంటాయని, వాటిని ఉల్లంఘించే విధంగా లౌడ్ స్పీకర్లు వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరినట్లు సమాచారం. దీంతో ఈ అంశం ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

శిరీష్ ఫిర్యాదుపై నెటిజన్ల భిన్నాభిప్రాయాలు:

అల్లు శిరీష్(Allu Sirish) చేసిన ఫిర్యాదుపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు కనిపిస్తున్నాయి. రాత్రివేళ అధిక శబ్దాల కారణంగా వృద్ధులు, చిన్నారులు, విద్యార్థులు, అనారోగ్యంతో ఉన్నవారు ఇబ్బందులు పడే అవకాశం ఉందని కొందరు నెటిజన్లు ఆయనకు మద్దతు తెలిపారు.

- Advertisement -
Advertisement

అయితే మరికొందరు మాత్రం ఈ ఫిర్యాదును ప్రశ్నిస్తూ పోస్టులు చేస్తున్నారు. పండుగల సమయంలో మాత్రమే శబ్ద కాలుష్యంపై అభ్యంతరాలు ఎందుకు వ్యక్తమవుతున్నాయని కొందరు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఆలయాలు, మతపరమైన కార్యక్రమాలకు సంబంధించిన లౌడ్ స్పీకర్ల విషయంలోనే ఇలాంటి చర్చలు ఎందుకు వస్తున్నాయని వారు కామెంట్లు చేస్తున్నారు.

సినిమా ఈవెంట్లు, పబ్స్‌పై కూడా ప్రశ్నలు:

అల్లు శిరీష్ ఫిర్యాదుపై స్పందించిన కొందరు నెటిజన్లు సినిమా ఈవెంట్లు, ఆడియో లాంచ్‌లు, ఇతర వినోద కార్యక్రమాలను కూడా ప్రస్తావిస్తున్నారు. రాత్రివేళల్లో జరిగే సినిమా కార్యక్రమాలు, పబ్‌ల నుంచి వచ్చే శబ్దాల విషయంలోనూ ఇదే స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -
Advertisement

అయితే పండుగలు, సినిమా కార్యక్రమాలు, వాణిజ్య కార్యకలాపాలు అనే తేడా లేకుండా శబ్ద కాలుష్యానికి సంబంధించిన నిబంధనలు అందరికీ ఒకే విధంగా వర్తించాలన్నది మరో వర్గం అభిప్రాయం. ఈ నేపథ్యంలో శిరీష్ చేసిన ఫిర్యాదు చుట్టూ సోషల్ మీడియాలో వాదోపవాదాలు కొనసాగుతున్నాయి.

also read:Actress Anjali:పెళ్లిపై షాకింగ్ కామెంట్లు చేసిన హీరోయిన్ అంజలి..!

థియేటర్ ట్రాఫిక్‌పై నెటిజన్ కౌంటర్ :

ఈ వివాదం మధ్య ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్య ప్రత్యేకంగా చర్చకు వచ్చింది. సంవత్సరానికి ఒకసారి జరిగే గణేష్ నవరాత్రుల కార్యక్రమాల వల్ల ఇబ్బంది కలుగుతోందని భావిస్తే, ఆ సమస్యను అర్థం చేసుకోవచ్చని చెబుతూనే.. కోకాపేట్ చౌరస్తాలోని అల్లు థియేటర్ కారణంగా స్థానికులు ప్రతిరోజూ ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆ నెటిజన్ పేర్కొన్నారు.

ప్రతిరోజూ థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులు, వాహనాల కారణంగా చౌరస్తా పరిసరాల్లో రద్దీ ఏర్పడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకరోజు జరిగే పండుగ కార్యక్రమాల వల్ల ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను అర్థం చేసుకున్నట్లే, ప్రతిరోజూ స్థానికులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలను కూడా అర్థం చేసుకోవాలని కోరారు.

also read:Actress Arrested:సినీ ఇండస్ట్రీలో షాకింగ్ సీన్..సెక్స్ రాకెట్ కేసులో సినీ నటి అరెస్ట్..!

పోలీసుల దర్యాప్తుతో మరో కోణం వెలుగులోకి :

ఈ వివాదంపై సైబరాబాద్ పోలీసులు కూడా స్పందించారు. శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనే అంశంపై పరిశీలన జరిపిన పోలీసులు.. అవి సమీపంలోని ఆలయం నుంచి రావడం లేదని స్పష్టం చేసినట్లు సమాచారం.దర్యాప్తులో భాగంగా ఆ శబ్దాలు ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు చేసిన సౌండ్ సిస్టమ్స్ కారణంగా వినిపించినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో మొదట సోషల్ మీడియాలో జరిగిన చర్చకు ఈ పోలీసుల వివరణ మరో కోణాన్ని జోడించింది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you