Samantha:ప్రతి ఆడపిల్లకి గర్భధారణ సమయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సమయంలో వచ్చే కేరింగ్, చూపించే ప్రేమ, ఎదురయ్యే అనుభవాలు, నేర్చుకునే ఫీలింగ్స్ ఖచ్చితంగా డిఫరెంట్‌గా ఉంటాయి. అది ఆ సిచువేషన్ ఫేస్ చేసిన అమ్మాయిలకు మాత్రమే తెలుస్తుంది. అది స్టార్ హీరోయిన్ కావచ్చు, కామన్ పీపుల్ కావచ్చు. ప్రెగ్నెన్సీ విషయంలో చాలా చిన్న చిన్న సరదా కోరికలు కోరుకుంటూ ఉంటారు. ప్రెగ్నెన్సీ సమయంలో తన భర్త తన పక్కనే ఉండాలి అని, తను అడిగిన కోరికలు తీర్చాలి అని, కావాల్సిన ఫుడ్ చేసి పెట్టాలి అని, తిరగాల్సిన చోటికి తిప్పాలి అని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది.
సమంత కూడా అదే విధంగా కోరుకునేదా? :
స్టార్ హీరోయిన్ సమంత(Samantha) కూడా అదే విధంగా కోరుకునేది మనందరికీ తెలిసిందే. క్రేజీ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ప్రెగ్నెంట్‌గా ఉంది. ఆమె 9వ నెల క్యారీ చేస్తుంది. ఆమె 9వ నెల క్యారీ చేస్తున్నా మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. హెల్తీ ప్రోటీన్ డైట్ తీసుకుంటూనే బాడీకి మంచి వర్కౌట్స్ అందిస్తుంది. అంతేకాదు, ప్రెగ్నెన్సీ సమయంలో బెడ్ రెస్ట్ అంటూ ఒక మూలన కూర్చోకుండా ఆమె ప్రతి లైఫ్ మూమెంట్‌ని ఎంజాయ్ చేస్తుంది.
also read:Faria Abdullah:ఫరీయ అబ్దుల్లా జీవితంలో అల్లు అర్జున్‌కు ఇంత స్పెషల్ ప్లేస్ ఉందా?
9వ నెలలోనూ వర్కౌట్స్, ఫోటోషూట్స్ :
గర్భధారణ సమయంలో నుండి 9 నెలలు నిండుతున్న సమయంలో కూడా ఆమె మంచిగా వర్కౌట్స్ చేస్తుంది. రకరకాల ఫోటోషూట్స్ చేస్తుంది. తన బ్రాండ్‌కి సంబంధించిన ప్రమోషన్స్ చేస్తుంది. తన భర్తతో చిన్న చిన్న సరదా కోరికలు తీర్చుకుంటుంది. దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
also read:Producer Chaitanya Reddy:ఛార్మీ- పూరీ జగన్నాథ్ పై సంచలన విషయాలు బయటపెట్టిన నిర్మాత..!
భర్తతో లవ్లీ మూమెంట్స్ షేర్ చేసిన సమంత :
అయితే, ఈ ఫొటోలు, వీడియోలపై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా కూడా తన భర్తతో కలిసి గడిపిన కొన్ని లవ్లీ మూమెంట్స్‌ను ఆమె అభిమానులతో సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. భర్తతో కలిసి సరదాగా ఆడుకుంటున్న వీడియోను పోస్ట్ చేయడంతో పాటు, సన్‌లైట్‌ను ఆస్వాదిస్తున్న క్యూట్ మూమెంట్స్‌ను కూడా అభిమానులకు చూపించింది. అలాగే తనకు ఇష్టమైన ఫుడ్‌ను ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. వాటిని చూసిన అభిమానులు ఆమె ఆనందంగా, ప్రశాంతంగా గడుపుతున్న తీరు గురించి స్పందిస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ లవ్లీ మూమెంట్స్ చాలా క్యూట్‌గా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సమంతపై నెగిటివ్ కామెంట్స్ :
ఈ పిక్చర్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. కొంతమంది సమంత మోస్ట్ లక్కీ అంటుంటే, మరి కొంతమంది సమంతపై నెగిటివ్‌గా ట్రోలింగ్ చేస్తున్నారు. దీనిని మాత్రం సమంత అస్సలు పట్టించుకోవడం లేదు. తన ప్రెగ్నెన్సీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంది.
View this post on Instagram




