Wednesday, September 30, 2026
HomeLATESTChiranjeevi: ఓటీటీ షోకి హోస్టుగా చిరంజీవి..!

Chiranjeevi: ఓటీటీ షోకి హోస్టుగా చిరంజీవి..!

Chiranjeevi: ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వేదికగా ఒకటాఫ్ షో కి చిరంజీవి హోస్ట్గా వ్యవహరించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

on
- Advertisement -banner Ad

Chiranjeevi: టాలీవుడ్ లో మెగాస్టార్ కుటుంబానికి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉందని చెప్పవచ్చు. సహాయమని అడిగిన వారందరికీ కూడా తమకు తోచిన విధంగా సహాయం చేస్తూ ఉంటారు. అందుకే చాలామంది మెగాస్టార్ చిరంజీవి ని ఇన్స్పైర్గా తీసుకొని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంటారు. చిరంజీవి కూడా ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు సేవా కార్యక్రమాలను చేస్తూ, సినీ ఇండస్ట్రీకి అవసరమైన పనులలో కూడా తన వంతు సహాయం చేస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా చిరంజీవి హోస్టుగా కూడా మారినట్లు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

మరో టాక్ షో కి హోస్టుగా చిరంజీవి…

తాజాగా చిరంజీవికి సంబంధించి ఒక న్యూస్ టాలీవుడ్లో తెగ వైరల్ గా మారింది. ఆయన సెలబ్రిటీ టాక్స్ షోకి హోస్ట్ గా చేయబోతున్నారని ప్రముఖ ఓటీటీ సంస్థలలో ఒకటైన నెట్ ఫ్లిక్ ఈ షో ప్రసారం చేయబోతున్నట్లు ప్రచారం అయితే జరుగుతోంది. దీంతో మెగాస్టార్ రెమ్యూనరేషన్ ఎంత ఉంటుంది అనే విషయం ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఈ టాక్ షోలోకి చిరంజీవి రూ .200 కోట్ల రూపాయల వరకు ఆఫర్ ఇచ్చినట్లుగా వినిపిస్తున్నాయి. ఈ డీల్ ని మెగా డాక్టర్ సుస్మిత కొణిదెల చూసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. కానీ ఇప్పటివరకు ఈ షో కి సంబంధించి ఎలాంటి అధికారికంగా ప్రకటన అయితే రాలేదు కానీ మరి రాబోయే రోజుల్లో ఈ విషయం పైన క్లారిటీ వస్తుందేమో చూడాలి.

- Advertisement -
Advertisement

also read:NTR:రాజమౌళి కుటుంబం పై ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్..!

చిరంజీవి సినిమాలు..

ప్రస్తుతం చిరంజీవి డైరెక్టర్ బాబి దర్శకత్వంలో కాకా అనే సినిమాలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని థియేటర్లో విడుదల చేసేలా ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే ఈ సినిమా షూటింగ్లో శరవేగంగా పాల్గొన్న చిరంజీవి ఇప్పటికే డబ్బింగ్ పనులను కూడా మొదలుపెట్టారు. ఈ చిత్రంలో నివేదా పేతిరాజు, అనస్వర రాజన్ , సునీల్ ,గెటప్ శ్రీను తదితర నటీనటులు నటిస్తున్నారు. డైరెక్టర్ వశిష్ట తో విశ్వంభర సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటున్నారు. ఈ రెండు చిత్రాలు అయిపోయిన వెంటనే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో సినిమా చేయబోతున్నట్లు వినిపిస్తున్నాయి.

- Advertisement -
Advertisement

also read:Rithu Chowdary: డిమోన్ పవన్ – రీతూ చౌదరి బ్రేకప్..!

వైరల్ గా మారిన రెమ్యూనరేషన్..

ఇదంతా ఇలా ఉండగా సుమారుగా 47 ఏళ్ల సినీ కెరీర్ లో చిరంజీవి (Chiranjeevi)పెద్దగా టాక్ షోలు చేయలేదు. గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం మీలో ఎవరు కోటీశ్వరుడు అనే క్విజ్ రియాల్టీ షో కి మాత్రమే హోస్ట్ గా చేశారు. తనదైన స్క్రీన్ ప్రజెంట్స్, హోస్టింగ్ తో బాగా ఆకట్టుకున్న చిరంజీవి దాని తర్వాత ఇప్పుడు మరో టాక్ షో కి సిద్ధమవుతున్నారని తెలిసి అభిమానులు కూడా ఆనందపడుతున్నారు. ఒకవేళ హోస్ట్ గా 200 కోట్ల రూపాయల పారితోషకాన్ని అందుకుంటే మాత్రం ఒక టాక్ షో కి ఇంత అమౌంట్ ఇవ్వడం అనేది మొదటిసారి ఇదే అని చెప్పవచ్చు. ఏది ఏమైనా మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యకాలంలో అభిమానుల కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you