Wednesday, July 22, 2026
HomeLATESTOTTలోకి వచ్చేసిన యూత్ మచ్ అవైటెడ్ మూవీ.. ఇద్దరు అమ్మాయిల లవ్, రొమాన్స్..మైండ్ దొబ్బే కథరా...

OTTలోకి వచ్చేసిన యూత్ మచ్ అవైటెడ్ మూవీ.. ఇద్దరు అమ్మాయిల లవ్, రొమాన్స్..మైండ్ దొబ్బే కథరా సామీ..!

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన లెస్బియన్ లవ్ స్టోరీ Girls Like Girls ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమ, భావోద్వేగాలు, రిలేషన్‌షిప్‌లో ఎదురయ్యే సవాళ్లతో రూపొందిన ఈ రొమాంటిక్ డ్రామా యువతను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన కథ, నటీనటులు, స్ట్రీమింగ్ వివరాలు తెలుసుకోండి.

on
- Advertisement -banner Ad

OTT:యంగ్‌స్టర్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన “గర్ల్స్ లైక్ గర్ల్స్” (Girls Like Girls)మూవీ స్ట్రీమింగ్‌లోకి అడుగుపెడుతోంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈ “గర్ల్స్ లైక్ గర్ల్స్” మూవీకి సంబంధించిన సీన్స్ బాగా ట్రెండ్ అయ్యాయి. చాలా ఇంట్రెస్టింగ్‌గా స్టోరీ ఉండడం, అదేవిధంగా ఈ సినిమాలో నటించిన నటీనటులు ప్రత్యేక ఆకర్షణగా కనిపించడమే ఇందుకు ప్లస్ పాయింట్. ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా..? అంటూ ఎదురు చూసిన ఫ్యాన్స్‌కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఓటీటీలోకి ఈ “గర్ల్స్ లైక్ గర్ల్స్” స్ట్రీమింగ్ వచ్చేసింది.

అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్.. కానీ ట్విస్ట్ ఇదే..!

ఓటీటీలో హాలీవుడ్ మూవీస్‌కు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. అయితే ఈ సినిమాకు మరింత క్రేజ్ రావడానికి కారణం మాత్రం ఈ సినిమా కథ, కాన్సెప్ట్ అనే చెప్పాలి. ముఖ్యంగా హారర్, క్రైమ్, రొమాంటిక్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి ఈ మూవీ కచ్చితంగా నచ్చేస్తుంది. ఇవాళ జూలై 7 నుంచి గర్ల్స్ లైక్ గర్ల్స్ స్ట్రీమింగ్‌లోకి అడుగుపెడుతోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది కానీ, ప్రస్తుతం కేవలం రెంట్ బేసిస్‌లో మాత్రమే అందుబాటులోకి రానుంది. అంటే ఫ్రీగా చూడడానికి ఇది వీలుపడదు. ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ ఉన్నప్పటికీ ఈ రొమాంటిక్ థ్రిల్లర్ చూడాలంటే ఇంకొంచెం డబ్బులు కట్టాలి. రెంట్ కోసం మనీ పే చేయాల్సిందే. అలా పే చేసిన వాళ్లు మాత్రమే ఈ గర్ల్స్ లైక్ గర్ల్స్ మూవీని చూడగలరు. మిగతా వాళ్లు ఈ సినిమాను చూడలేరు.

- Advertisement -
Advertisement

కథే సినిమాకు హైలైట్..!

అమెరికన్ కమింగ్-ఆఫ్-ఏజ్ రొమాంటిక్ మూవీ అయిన గర్ల్స్ లైక్ గర్ల్స్ జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన ప్రతి చోట కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. మరీ ముఖ్యంగా కథ కొత్తగా ఉండడం, డైరెక్టర్ అంతకంటే రియలిస్టిక్‌గా సీన్స్ తెరకెక్కించడం ఈ సినిమా హిట్ అవ్వడానికి ప్రధాన కారణం. ఈ సినిమాను డైరెక్ట్ చేసింది హేలీ కియోకో. ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఇందులో మాయా డా కోస్టా, మైరా మోలాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణం వీళ్ల నటనే అని చెప్పాలి.

ఇద్దరు అమ్మాయిల ప్రేమ.. తర్వాత ఏం జరిగింది..?

ఇద్దరు అమ్మాయిలు లవ్ చేసుకుంటే ఎలా ఉంటుంది..? రొమాన్స్ జరిగిన తర్వాత వాళ్ల లైఫ్‌లో ఏం జరుగుతుంది..? వీళ్లిద్దరి మధ్యలోకి వచ్చిన ఒక అబ్బాయి ఈ సినిమా కథను మలుపు తిప్పుతాడు. చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగే కథ ఇది.కోలే, సోనియా మధ్య ఫ్రెండ్స్ కారణంగా పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ఇంకొంచెం పైమెట్టు ఎక్కి హద్దులు దాటుతుంది. సోనియాకు అప్పటికే లవర్ ఉంటాడు. కానీ క్రమక్రమంగా కోలే, సోనియా బాగా క్లోజ్ అయిపోతారు. ఎంత క్లోజ్ అంటే ఒళ్లు తెలియకుండా కలిసిపోయేంత క్లోజ్ అయిపోతారు.

- Advertisement -
Advertisement

also read:Tollywood:మాజీ బాయ్ ఫ్రెండ్ సైకో.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

అసలు ట్విస్ట్ ఏంటంటే..?

ఒకరోజు కోలే తన తల్లి మరణం కారణంగా బాధపడుతూ ఉన్నప్పుడు సోనియా ఆమెకు ఇంకా దగ్గర అవుతుంది. అప్పుడు వీళ్లు ముద్దు కూడా పెట్టుకుంటారు. కానీ భయంతో కోలేకు సోనియా దూరంగా ఉండడం స్టార్ట్ చేస్తుంది. అనుకోకుండా అదే సమయంలో కోలేకు సంబంధించిన ఒక వ్యక్తిగత సీక్రెట్ బయటపడుతుంది. దీనికి సంబంధించి సోనియానే ప్రధాన కారణమని కోలే నమ్ముతుంది. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అసలు కోలేకు సంబంధించిన ఆ సీక్రెట్ ఏంటి..? సోనియా, కోలే మళ్లీ కలుసుకున్నారా..? ఆ సీక్రెట్ వల్ల సోనియా, కోలే ఎందుకు రాద్ధాంతం చేసుకున్నారు..? అసలు ఏమైంది అనేది గర్ల్స్ లైక్ గర్ల్స్ మూవీ చూస్తేనే అర్థమవుతుంది.

- Advertisement -
Advertisement

also read:OG 2:పవన్ కళ్యాణ్ ఓజీ 2కు అదే బలంగా మారనుందా?

ఎండింగ్ పీక్స్‌లో ఉంటుంది..!

స్టార్టింగ్‌లో కథ కొంచెం స్లోగా వెళ్లినా, ఎండింగ్ వచ్చే వరకు మాత్రం సినిమా పీక్స్‌కు వెళ్లిపోతుంది. ప్రతి సెకండ్ ఏం జరుగుతుందా..? ఏం జరుగుతుందా..? అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తారు. మరి ఇలాంటి సినిమా చూడాలంటే అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్‌తో పాటు రెంట్ కూడా పే చేయాల్సిందే.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you