Tollywood:సినీ ఇండస్ట్రీలో లవ్ స్టోరీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన చిత్రం ‘మేం వయసుకు వచ్చాం’ సినిమా. ఈ చిత్రం ఒక క్లాసిక్ అని చెప్పవచ్చు. 2012లో ఈ సినిమా యూత్ని బాగా అట్రాక్ట్ చేసింది. ఈ సినిమా ఒక అందమైన ప్రేమ కథతో పాటుగా ఎమోషనల్ సీన్స్ కూడా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించగా, ఇందులో హీరోగా తనీష్(Thanish), హీరోయిన్గా నీతి టేలర్ నటించింది. ఈ సినిమాలోని పాటలు కూడా బాగానే ఆకట్టుకున్నాయి. ఇందులో నటించిన ప్రతి ఒక్కరు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు.
టీనేజ్ లవ్ స్టోరీ నరకం..
ముఖ్యంగా హీరోయిన్ నీతి టేలర్(niti tailor) తన యాక్టింగ్ తో బాగా ఆకట్టుకుంది. ఈమె నటనకు, అందానికి తెలుగు కుర్రాళ్ళు ఫిదా అయ్యారు.. ఈ సినిమా తర్వాత అడపా దడపా సినిమాలలో నటించినా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది . బాలీవుడ్ లో పలు సీరియల్స్ లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాకుండా నిరంతరం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు తన మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి కొన్ని భయంకరమైన నిజాలు బయట పెట్టడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఓటీటిలో ప్రసారమయ్యే రియాలిటీ గేమ్స్ ఆలయన్స్ షో లో పాల్గొన్న నీతి టేలర్ తన జీవితంలో జరిగిన కొన్ని చేదు అనుభవాలను పంచుకుంది.
ALSO READ:OG 2:పవన్ కళ్యాణ్ ఓజీ 2కు అదే బలంగా మారనుందా?
చిత్రహింసలు పెట్టేవాడంటూ ఎమోషనల్..
తన మాజీ బాయ్ ఫ్రెండ్ తనని చాలా హింసలు పెట్టేవారని అతను ఒక సైకో లా బిహేవ్ చేయడం చూసి తాను చాలా భయపడిపోయానని తెలియజేసింది. నీతి టేలర్ మాట్లాడుతూ..” నా మాజీ ప్రియుడు నన్ను సిగరెట్ల తో కాల్చాడు. అతడు ఒక సైకో.. అతని పుట్టిన రోజున మరింత మితిమీరిపోయి చేశాడని, ఒక పిచ్చివాడిలా చేయడమే కాకుండా తనని ఆరోజు గట్టిగా చంప దెబ్బ కొట్టాడు. దీంతో అతనికి వెంటనే గుడ్ బాయ్ చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసానంటూ కన్నీళ్లు పెట్టుకొని తెలియజేసింది నీతి టేలర్.
ALSO READ:Bhanu Chander:బ్లూ ఫిల్మ్ కేసు వివాదం.. భానుచందర్‌కు అండగా నిలిచిన హీరో ఎవరో తెలుసా?
రీ ఎంట్రీ ఇస్తుందా?
అయితే అప్పుడు తెలిసి తెలియని వయసులో ప్రేమలో ఉండే దాన్ని.. నేను మనుషులను అంచనా వేయడం చేతకాక మోసపోయానంటూ తెలియజేసింది. 2020లో ఈమె పరీక్షిత్ భవను ప్రేమించి వివాహం చేసుకుంది. అయితే ఆ తర్వాత మళ్లీ అటు సినిమాలను సీరియల్స్ లో కనిపించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్గానే కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. మరి రాబోయే రోజుల్లోనైనా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు.
View this post on Instagram


