Hero Ajith:కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన హీరో అజిత్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా రేసింగ్ వైపే అడుగులు వేస్తున్నారు. యూరప్ లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఎండ్యూరెన్స్ రేసింగ్ ఈవెంట్లో అజిత్ ప్రయాణిస్తున్నటువంటి కారు అధిక వేగంతో అదుపుతప్పి మరొక వాహనాన్ని చాలా బలంగా ఢీ కొట్టినట్లు వినిపిస్తోంది..ఈ ఘటన ఆగస్టు 23వ తేదీన చోటు చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన విషయం మాత్రం ఇంకా బయటికి రాకపోవడంతో అజిత్ అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు.
కార్ రేసింగ్ లో గాయపడ్డ హీరో అజిత్..
అయితే అదృష్టవశాత్తు అజిత్(Hero Ajith) కి ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారని వినిపించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. స్పోర్ట్స్ పై చిన్న వయసు నుంచి ఆసక్తి ఉండడంతో అజిత్ సినిమాలతో పాటుగా రేసింగ్ కి ప్రాధాన్యత ఇచ్చారు. కొంతకాలం అంతర్జాతీయ స్థాయిలో మోటార్స్ స్పోర్ట్స్ ఈవెంట్లో పాల్గొంటున్నారు. అజిత్ కుమార్ రేసింగ్ ద్వారా ఈ రంగంలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళుతున్నారు. తాజాగా యూరప్ లో జరిగిన రేస్ లో అజిత్ కారు వేగంగా వెళుతున్న సమయంతో నియంత్రణ కోల్పోవడంతో మరొక వాహనాన్ని ఢీ కొట్టినట్లు సమాచారం
also read:Anasuya:కట్టు బొట్టుపై అనసూయ సంచలన వీడియో..!
హై స్పీడ్ కారణంగా ప్రమాదం..
హై స్పీడ్ కారణంగా ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని కానీ కారులో ఉండే లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా లేటెస్ట్ రక్షణ పరికరాల ద్వారా అజిత్ ను కాపాడినట్లు తెలుస్తోంది. ఎండ్యూరెన్స్ రేసింగ్ అనేది సాధారణ రేసింగ్ తో పోలిస్తే చాలా సవాల్తో కూడి ఉంటుందని , డ్రైవర్లు ఎక్కువగా సమయంతో పాటు అత్యంత వేగంగా కారుని నడపాలని, డ్రైవర్లు ఎక్కువగా నియంత్రణలను పాటించాల్సి ఉంటుందని, చిన్న పొరపాటు జరిగినా కూడా భారీ ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉంటుందని తెలుపుతున్నారు. అందుకే అజిత్ కు ఎదురైన ఈ ప్రమాదం మరొకసారి ఆయన ప్రొఫెషనల్ లైఫ్ని రిస్క్ కి గురిచేస్తుంది.
also read:Zombie Reddy 2: జాంబిరెడ్డి 2 నుండి గ్లింప్స్ రిలీజ్ చేసిన టీమ్..!
వరుస ప్రమాదాలకు గురవుతున్న అజిత్..
అజిత్ కి రేసింగ్ ప్రమాదాలు ఎదురవడం ఇది కొత్తేమీ కాదు.. గతంలో కూడా చాలాసార్లు ఆయన ప్రమాదాల నుంచి సురక్షితంగానే బయటపడ్డారు. గత ఏడాది ఇటలీలో జరిగిన యూరోపియన్ సిరీస్ సందర్భంగా ప్రమాదానికి గురైనా ఎలాంటి గాయాలు కాలేదు. మళ్లీ అదే ఏడాది స్పెయిన్ లో జరిగిన డబుల్ రోల్ ఓవర్ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడిన సంగతి తెలిసింది. అంతకుముందు దుబాయిలో కూడా ఒకసారి రేస్ ప్రాక్టీస్ సమయంలో కారును ఢీకొని ఘటన జరిగింది. ఆయనప్పటికీ మాత్రం అజిత్ రేసింగ్ పై ఆసక్తి పెరుగుతూనే ఉన్నది. నటుడుగా ఎంత బిజీగా ఉన్నా తనకు ఇష్టమైన రేసింగ్ ని మాత్రం వదలలేదు అజిత్. చివరిగా అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో కనిపించారు . ప్రస్తుతం డేర్ డెవిల్ అనే చిత్రంలో నటిస్తున్నారు.




