Monday, August 24, 2026
HomeLATESTZombie Reddy 2: జాంబిరెడ్డి 2 నుండి గ్లింప్స్ రిలీజ్ చేసిన టీమ్..!

Zombie Reddy 2: జాంబిరెడ్డి 2 నుండి గ్లింప్స్ రిలీజ్ చేసిన టీమ్..!

Zombie Reddy 2: తేజ సజ్జా హీరోగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న జాంబిరెడ్డి మూవీ సీక్వెల్ ఇప్పుడు అధికారికంగా అనౌన్స్మెంట్ ఇచ్చారు.

on
- Advertisement -banner Ad

Zombie Reddy 2: చిత్రంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా పేరు సంపాదించిన తేజ సజ్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు. అతి చిన్న వయసులోనే పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించిన తేజ సజ్జా.. పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఒక అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. అదే జాంబిరెడ్డి చిత్రానికి సీక్వెల్ గా జాంబిరెడ్డి 2 రాబోతోంది. ఇందుకు సంబంధించి గ్లింప్స్ సైతం సోషల్ మీడియాలో విడుదల చేయగా ట్రెండీగా మారింది.

జాంబి రెడ్డి సీక్వెల్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్..

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైన నిర్మిస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందిస్తూ ఉండగా ఎస్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతోనే డైరెక్టర్గా పరిచయం కాబోతున్నారు కూడా. ఈ సీక్వెల్లో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర , షనయా కపూర్ కీలకమైన పాత్రలలో నటిస్తూ ఉండడంతో సినిమా పైన భారీగా అంచనాలు పెరిగిపోయాయి. రాయలసీమ జానపద గీతానికి అనుగుణంగా రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించి గ్లింప్స్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయేలా కనిపిస్తోంది.

- Advertisement -
Advertisement

ALSO READ:OTT Movie: ఒళ్లు గగుర్పొడిచే సీన్స్.. ఓటీటీని షేక్ చేస్తోన్న సినిమా..డోంట్ మిస్..!

సినిమాపై క్యూరియాసిటీ పెంచేసిన టీం..

సినిమా పైన మరింత క్యూరియాసిటీ పెరిగిపోయేలా చేసింది.. ఫోక్ సింగర్ నాగవ్య గొంతుతో పాడే పాట మరింత ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ సినిమా ఉండబోతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా హాలీవుడ్ స్థాయిలో జాంబీస్ సినిమాలను తలపించేలా ఈ సినిమా ఉండబోతున్నట్లు జాంబిరెడ్డి 2 (Zombie Reddy 2)కనిపిస్తోంది. మొదటి భాగంలో రాయలసీమ నేపథ్యంలో సాగిన కథ ఈసారి హైదరాబాద్ నగరానికి మార్చినట్లుగా కనిపిస్తోంది. ఒరిజినల్ సినిమా కంటే మరింత పెద్దదిగా సాహసోపేతంగా సరికొత్త రక్తపాతంతో కూడిన భీకరమైన జాంబీ ప్రపంచాన్ని ఈ సీక్వెల్ లో చూపించబోతున్నట్లు గ్లింప్స్ ద్వారా స్పష్టంగా కనిపిస్తోంది.

- Advertisement -
Advertisement

ALSO READ:Bigg Boss :బిగ్ బాస్ తెలుగు 10 అగ్నిపరీక్షలో అదరగొడుతున్న కామన్ గర్ల్!

పాన్ ఇండియా భాషల్లో రిలీజ్..

ఈ చిత్రాన్ని తెలుగులోనే కాకుండా ఈసారి హిందీ , కన్నడ, మలయాళం , నేపాలి, జపాన్ వంటి భాషలలో విడుదల చేయబోతున్నారు. 2027లో ఈ సినిమాని చాలా గ్రాండ్గా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మొదటి భాగంతో టాలీవుడ్లో జాంబి జూనియర్ కు సరికొత్త ఊపిరి పోసినట్లు టీం తెలియజేశారు. ఈ సీక్వెల్ తో బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా మరొకసారి విధ్వంసం సృష్టించబోతున్నారు తేజ సజ్జా. 1998లో చూడాలని ఉంది సినిమా ద్వారా చైల్డ్ యాక్టర్ గా వచ్చిన తేజ సజ్జా ఎన్నో చిత్రాలలో చైల్డ్ యాక్టర్ గానే నటించారు. ఆ తర్వాత ఓ బేబీ, జాంబిరెడ్డి, ఇష్క్, అద్భుతం, హనుమాన్, మిరాయ్ వంటి చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you